Tuesday, 15 August 2023

గాయం_దెబ్బలు_తగిలిన_అప్పుడు_తీసుకోవాలిసిన_జాగ్రత్తలు_అవగాహనా_కోసం

*గాయం_దెబ్బలు_తగిలిన_అప్పుడు_తీసుకోవాలిసిన_జాగ్రత్తలు_అవగాహనా_కోసం Naveen Nadiminti సలహాలు*
 
గాయం (Injury) అనగా దెబ్బలు తగలడం. రకాలు : 1,మానసిక గాయాలు . 2.శారీరక గాయాలు ,

*మానసిక_గాయాలు :*

మనిషికి గాయమైనచో కాలక్రమమున గాయము మానును. మనసుకు గాయమైనచో ఆ గాయము జీవితాంతము వరకు మాయదు. మానవుడు మాటలతో చేయు గాయములు అస్త్రములకన్న పరుషములు. ప్రియభాషణము చేతకనివారు మౌనము వహించుట ముఖ్యము.

*#శారీరక_గాయము :*

శరీరానికి బయట వస్తువుల నుండి తగిలే దెబ్బలు వలన చర్మము చిట్లడమో, కమిలిపోవడమో , వాయడమో, గీక్కుపోవడమో జరిగితే దాన్ని గాయమందుము. గాయము కర్రతో కొట్టినందువలన, ముళ్ళు గుచ్చునందువలన, పళ్ళతో కొరికినందువలన, నిప్పుతో కాలినందువలన, సల్ఫూరిక్ ఆమ్లము, జిల్లేడు పాలు వంటి రసాయనాలు వలన, ఇలా ఎన్నో విదములుగా జరుగవచ్చును.

గాయమైనచోట ఇన్ఫ్లమేషన్ కి గురియై 1. వాపు , 2. ఎరుపెక్కడం , 3. ఉష్ణోగ్రత పెరగడం , 4. నొప్పి గా ఉండడం , 5. ఆ భాగము పనిచేయకపోవడం అనేవి జరుగుతాయి .

చిన్న గాయాలైనప్పుడు సబ్బు నీటితో కడగాలి. రక్తస్రావం తగ్గడానికి గాయంపై పరిశుభ్రమైన గుడ్డతో బాగా బిగించి ఒత్తిడి ఇవ్వాలి. ఎలాంటి ఆయింట్‌మెంట్‌, పౌడర్‌ ఉపయోగించకూడదు. ప్రథమ చికిత్స చేస్తూ అవసరం అనుకుంటే వైద్య సలహా పొందాలి. చెట్లు, మొక్కల వల్ల చర్మానికి దురద వస్తే చర్మాన్ని సబ్బునీటితో బాగా కడగాలి. పరిశుభ్రమైన నీటితో ఎక్కువసేపు కంటిని శుభ్రపరచాలి. కళ్లు నలపకూడదు. గుడ్డతో నలుసు తీయడానికి ప్రయత్నం చేయకూడదు. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.

*శారీరక_గాయాలు_రకాలు :*

* బ్రూయీ - : చర్మము క్రింద రక్తము గూడికట్టి గీక్కు పోయేలా ఉండే గాయము .
* గంటు : పదునైన కత్తి, బ్లేడు వంటి వాటితో కోసుకుపోవడము. రక్తము ఎక్కువగా కారును .
* బొబ్బలు : మండే వస్తువు వలన కాలిపోయి చర్మము ఉబ్బి నీరుచేరడము.
* బెణుకు : కొన్ని సమయాలలో నడిచేటపుడు ఒడుదుడుకులు గా అడుగులు వేయడము వలన కీళ్ళలోని లిగమెంట్స్ సాగిపోవడము జరిగి వాపు , నొప్పి వచ్చుట.

ఒక్కొక్కసారి గాయము వలన ప్రాణాపాయము కలుగవచ్చును. మనిషికి గాయాలు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రమాదాలు, వలన కలుగును. ఉపశయము చేయుట ప్రధమ చికిత్స లో చూడండి.వైద్య నిలయం లింక్స్ 
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02umbaf87SSBLFoMtZWqqnMSRABKHWxxrL5DTmggQkRpLSGNKwynyQAwXMrJu2Hhypl&id=100057505178618&mibextid=Nif5oz
*చికిత్స :*

కింద పడటం లేదా రోడ్డుపైన కలిగే గాయాలకు ప్రధమ చికిత్స

తల, వెన్నుముక్కకు ముఖ్యంగా మెడకు తగిలే గాయాలు చాలా అపాయం తెస్తాయి. ఎందుకంటే, ఈ గాయాలు జీవితాంతం పక్షవాతం కలిగిస్తాయి లేదా ప్రాణాలకు ముప్పు తెస్తాయి. తల, వెన్నుముక్క, కదలికలను తగ్గించండి. తద్వారా వెన్నుముక్క మెలి తిరగకుండా, గాయం తీవ్రం కాకుండా నివారించవచ్చు.

* కదలలేని లేదా భరించలేని తీవ్రమైన నొప్పి కలిగిన పిల్లవాడికి ఎముక విరిగి ఉండవచ్చు. గాయపడిన ఆ ప్రదేశాన్ని కదపకండి. దానికి ఆధారం ఇచ్చి వెనువెంటనే వైద్య సహాయం పొందండి.
* ఒకవేళ స్పృహకోల్పోతే, వారిని వెచ్చగా ఉంచి, వెనువెంటనే వైద్య సహాయం తీసుకోండి.
* నలిగిన లేదా బెణికిన వాటిపై మంచు ముక్కలు పెట్టండి లేదా గాయలపై భాగాన్ని చల్లని నీటితో ముంచండి.
ఇలా 15 నిముషాలు చేయండి. అయితే మంచు ముక్కను నేరుగా చర్మంపైన పెట్టరాదు. చర్మానికి - మంచు ముక్కకు మధ్య ఒక పొర బట్ట ఉండేలా చూడండి., మంచు ముక్కను లేదా నీటిని తొలగించి ఓ పావుగంట సేపు వేచి చూడండి. అవసరమనిపిస్తే, ఈ ప్రక్రియను మరోసారి చేయండి. ఈ చల్ల దనం వల్ల నొప్పి, వాపు తగ్గుతుంది.

*తెగిన_గాయాలకు_పుండ్లకు_ప్రధమ_చికిత్స*

* తెగిన గాయం లేదా పుండ్లు చిన్న వాటికి అయితే- గాయం లేదా పుండును శుభ్రమైన నీరు, సబ్బుతో కడగండి.
* గాయం పుండు చుట్టు పక్కల చర్మాన్ని ఆరనీయాలి.
* పుండు గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి, బ్యాండేజీ కట్టాలి. తెగిన గాయం పుండ్లు పెద్దవి తీవ్రమైనవి అయితే గాజు ముక్క లేదా ఇతర ముక్క లేవైనా గాయానికి అతుక్కొని ఉంటే దాన్ని తొలిగించరాదు. అలా అతుక్కొని ఉన్న ముక్క గాయం నుంచి రక్తం కారకుండా అడ్డుపడి ఉండవచ్చు. ఆ ముక్కను తొలిగిస్తే, గాయం తీవ్రంగా మారవచ్చు.
* గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే, గాయపడిన ప్రదేశాన్ని ఛాతీకన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచాలి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి గాయంపైన ఉంచి గట్టిగా నొక్కాలి. ఒకవేళ గాయంలో ఏదైనా తట్టుకొని ఉంటే, దాని పక్కన మడతల బట్టను పెట్టి నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయే దాకా ఇలా చేస్తూనే ఉండండి.
* ఏదైనా మొక్కను గానీ, జంతుసంబంధ వస్తువులను గానీ గాయం పెట్టరాదు. వాటివల్ల ఇన్ ఫెక్షన్ కలుగుతుంది.
* గాయం పైన బ్యాండేజీ కట్టండి. అయితే గట్టిగా కట్టరాదు. గాయానికి వాపు రావటానికి వీలుగా బ్యాడేజీని కొంచెం వదులుగానే కట్టాలి.
* వ్యక్తికి వెంటనే వైద్య సహాయం అందించాలి లేదా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాలి. బిడ్డకు టెట్నస్ (ధనుర్వాతం) ఇంజక్షన్ ఇప్పించాలా అని ఆరోగ్య కార్యకర్తను అడగండి.

*నొప్పినివారణ_మందులు :*
అనగా tab. Dolomed (ibuprofe+paracetamol) రోజుకి 2-3 మాత్రలు 4-5 రోజులు.

*యాంటిబయోటిక్స్ :*
అనగా tab . ciprobid TZ (ciprofloxacin + Tinidazole) రోజుకి 2-3 మాత్రలు చొ. 4-5 రోజులు .

పైపూత మందులు : Ointment MEGADIN-M 1 tube . గాయము బాగా సబ్బునీటితో కడిగి రోజుకు రెండు పూటలు రాయాలి .
#ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti,*
        This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment