Friday, 18 August 2023

కీళ్ల_నొప్పులు**సయాటిక స్పాండిలైటిస్ కోసం_ఆయుర్వేదం_మరియు_ఫిజియో_థెరపీ_నొప్పి_నివారణకు_నవీన్_నడిమింటి_సలహాలు

*కీళ్ల_నొప్పులు*
*సయాటిక స్పాండిలైటిస్ కోసం_ఆయుర్వేదం_మరియు_ఫిజియో_థెరపీ_నొప్పి_నివారణకు_నవీన్_నడిమింటి_సలహాలు*

             కీళ్లను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌. దీనివల్ల కీళ్లు వాచి, గట్టిపడి నొప్పి పెడతాయి. ఈ వ్యాధి పురుషుల్లో కంటే స్త్రీలలో సాధారణంగా కనిపిస్తుంది. 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సులో ఎక్కువగా వస్తుంది.

*కారణాలు :*
దీనికి సరైన కారణం తెలియదు. కాని ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. అంటే శరీరంలోని సహజ రక్షక వ్యవస్థ కీళ్లపైన దాడి చేస్తుంది.

*లక్షణాలు :*
చేతులు, ముఖ్యంగా చేతి వేళ్లు, మణికట్లు, మోచేతులు, కాలి మడమ, మోకాళ్లు, మెడ భాగంలోని కీళ్లలో నొప్పి, కీళ్లు గట్టిగా ఉండటం, వాచిపోవడం రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ లక్షణాలు. ఎక్కువ సమయం పడుకుని, కూర్చుని లేచిన తరువాత కీళ్లు గట్టిపడటం ఎక్కువ అవుతుంది. ఇది తగగ్డానికి గంటనుంచి కొన్ని గంటల సమయం పట్టవచ్చు. కీళ్ల సమస్యలు మాత్రమే కాకుండా, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వల్ల నీరసం, బరువు తగ్గిపోవడం, జ్వరం, ఆకలి లేకపోవడంలాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు స్థిరంగా ఉండవు. కీళ్ల నొప్పులు వాటికవే తోవచ్చు. దీనిని రెమిషన్‌ అంటారు.

*కీళ్ల_నొప్పులకు_ఇతర_కారణాలు :*
*ఆస్టియో_ఆర్థరైటిస్‌ :*
 కీళ్ల రాపిడి, గాయాలు కావడం వల్ల ఎముకలపై ఉండే మృదువైన కార్టిలేజ్‌ పొర దెబ్బ తింటుంది. ఇది రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌లాగా అన్ని భాగాల్లో కాకుండా, ఏదో ఒక భాగంలో మాత్రమే జరుగుతుంది. పూర్తి ఆరోగ్యం సమస్య కోసం వైద్య నిలయం గ్రూపులో లింక్స్ లో వీడియో చుడాలి
https://fb.watch/e6IcT_7jau/
*చికిత్స :*
ఈ వ్యాధికి జీవితాంతం చికిత్స తీసుకోవాలి. మందులతోపాటు వ్యాయామం, జీవనశైలి మార్పులు అవసరమవుతాయి. తొందరగా చికిత్స తీసుకుంటే పరిస్థితి విషమించకుండా ఉంటుంది. రుమటాలజిస్ట్‌ పర్యవేక్షణలోనే చికిత్స జరగాలి. మెథట్రెక్సేట్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, సల్ఫాసలజైన్‌, స్టిరాయిడ్స్‌ను వాడాల్సి వస్తుంది. ఈ మందులకు లొంగకపోతే బయలాజిక్స్‌లాంటి ఆధునిక చికిత్సలు ఇవ్వాలి.

*మీ కు నొప్పికి  సంబంధించిన  సమస్యలకు  కూడా  ఇది  పని  చేస్తుంది .* 
.
1. ఇందుకు  మనం  చెయ్యవలసినది  పారిజాతం  ఆకుల  కషాయం  ప్రతి  రోజూ  రెండు  పూటలా   కాచుకుని  త్రాగడం 
.
2 .  పసుపు ,  మెంతులు , శొంటి  సమాన  పాళ్ళల్లో తీసుకుని   పొడి  చేసుకుని , ఆ  పొడిని  ఒక  గాజు  సీసాలో  వేసుకుని  పూటకు  ఒక  గ్రాము  మించకుండా   వేడి  నీళ్ళతో  తీసుకోవడం  వలన  వెన్ను  సమస్యలు  తగ్గుతాయి .
.
3 . పాలల్లో  పసుపు  వేసుకుని  త్రాగండి  .  దీనిని  ఇపుడు  విదేశాలలో  గోల్డ్  మిల్క్   అనే  పేరుతో  త్రాగుతున్నారు ,  వెన్ను  సమస్యలతో  పాటు  ఆస్తమాకు  కూడా  ఇది మంచి  మందు

*జాగ్రత్తలు :*
1.- అలసిపోగానే విశ్రాంతి తీసుకోవాలి.
2.- వంటగదిలో వస్తువుల ద్వారాకాని, తలపు గొళ్లేల నా
 ఎటువంటి గాయాలు తగలకుండా చూసుకోవాలి.
3.- లక్షణాలు తీవ్రతంగా ఉంటే చేతి కర్ర సహాయంతో కాని, వాకర్స్‌ ద్వారా కాని నడవాలి.
4.-సమతులాహారం తీసుకోవాలి.
5.-ఆరోగ్యకరమైన బరువు కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

*శస్త్ర_చికిత్స_ఎప్పుడు_అవసరం?*
మందులు, ఫిజికల్‌ థెరపీకి లొంగనప్పుడు మాత్రమే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌కు సర్జరీ అవసరమ వుతుంది. శరీరంలోని కొన్ని కీళ్లకు టోటల్‌ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ చేయాల్సి వస్తుంది.

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నప్పటికీ చాలామంది స్త్రీలు గర్భం దాల్చగలరు. ఆరోగ్యకరమైన బిడ్డలను పొందగలరు. గర్భం దాల్చిన సమయంలో ఈ వ్యాధికి వాడే కొన్ని మందులను ఆపవలసి ఉంటుంది. ప్రసవం తరువాత చాలామందిలో మొదటి మూడు నెలలలోపు వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు మందులు మళ్లి వాడాలి.

*పోషకాహారం :*
1.-చేపనూనె వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది. 2.-ఆస్టియోపోరోసిస్‌ రాకుండా ఉండటానికి తగినంత 3.-కాల్షియం, విటమిన్‌ డి అందేలా చూసుకోవాలి. 4.-సాచురేటెడ్‌ కొవ్వు, కొలెస్టరాల్‌, ఉప్పు తక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవాలి.
5.-ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం,
6.- సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే ముడి గింజలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

*#వ్యాయామం_చేయవచ్చా?*
ఆర్థరైటిస్‌ వ్యాయామం మూడు రూపాల్లో చేయవచ్చు. స్ట్రెచింగ్‌, స్ట్రెంతనింగ్‌, కండిషనింగ్‌ వ్యాయామాలు చేయాలి. మోకాళ్లు, మడమలు, పాదాల్లో సమస్య ఉన్నప్పుడు ఈత మంచి వ్యాయామం. కాల్లు,పాదాల్లో సమస్య లేకపోతే సైకిలింగ్‌, వాకింగ్‌ బాగా తోడ్పడుతాయి.

               ఈ వ్యాధి  వందమందిలో తల్లిదండ్రులు, పిల్లల్లో వచ్చే అవకాశం నలుగురికి ఉంఉటంది. సాధారణ జనాభాలో ప్రతి వందమందిలో ఒకరు సైయేటికా &రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ బారినపడే అవకాశం ఉంది. కాగా, ఈ వ్యాధిగ్రస్తుల పిల్లల్లో 25 శాతం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
*ధన్యవాదాలు 🙏*
*మీ Naveen Nadiminti*
ఫోన్ -9703706660,
  *సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment