*కాళ్ళు_మరియు_చేతులు పై_ఇన్ఫెక్షన్_ఆయుర్వేదం_నవీన్_నడిమింటి_సలహాలు*
కాళ్ళ, చేతి వేళ్ళమధ్య పాచి పట్టడం
పొలాల్లోని నీళ్ళలోని రసాయనాల వలన, కర్మాగారాల లోని రసాయనాల వలన వేళ్ళమధ్యలోని రక్తం మలినమవుతుంది కాళ్ళు నడవడానికి కూడా వీలు కాదు.
పసుపు ------- 50 gr
గడ్డ కర్పూరం -------- 50 gr
తులసి ఆకుల పొడి ---50 gr
అన్నింటిని విడివిడిగా పొడి చేసుకొని కలిపి వుంచుకోవాలి.
కలబంద గుజ్జును శుద్ధి చేసి (7 సార్లు నీటిలో విదిలించాలి ) పొడికి కలిపి నూరి ఆ పుండ్లకు పట్టించాలి.వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://m.facebook.com/story.php?story_fbid=2570693456528857&id=1536735689924644 *చచ్చుబడిన_కాళ్ళు_తిరిగి_శక్తిని_పొందడానికి*
కానుగ చెట్ల వేర్ల రసం ----- ఒక లీటరు
వంటాముదం---- ఒక లీటరు
కానుగ చెట్టు వేర్లను (సాధ్యమైతే ఉత్తరం వైపు పాకి వున్న వేర్లు) తెచ్చి దంచి రసం తీయాలి.
రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇంకి పోయి తైలం మాత్రమే మిగిలే వరకు సన్న మంట మీద కాచాలి. చల్లారిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి.
దీనిని కాళ్ళ మీద ఏ భాగమైతే చచ్చుబడి ఉన్నదో ఆ ప్రాంతం లో రుద్దాలి. దీని వలన కాళ్ళకు శక్తి వస్తుందినడక వేగం హెచ్చుతుంది.
*కాళ్ళు,_చేతులపై వచ్చే పుండ్లను నివారించే లేపనం*
నల్ల జిలకర పొడి ---- 20 gr
పసుపు ---- 20 gr
ముద్దకర్పూరం ---- 10 gr
కొబ్బరి నూనె ---- 50 gr
కొబ్బరి నూనెను వేడి చేసి దించి దానిలో కర్పూరం వెయ్యాలి కరిగిన తరువాత రెండు పొడులను వేస్తూ కలపాలి. పొడి గాని, నూనె గాని తగ్గితే కలుపుకోవచ్చు. సీసాలో నిల్వ చేసుకోవాలి. ఎంత కాలమైనా నిల్వ వుంటుంది.
ఈ తైలాన్ని వాడడం వలన దెబ్బలు, గాయాలు, పుండ్లు, రసిక కారే పుండ్లు కూడా నివారింప బడతాయి.
పద్యం:-- వంకాయ, గోంగూర, ఆవకాయ, ఆవాలు,మాంసం, గుడ్లు వంటివి తినకూడదు.
రక్త శుద్ధి త్వరగా జరగాలంటే
100 గ్రాముల ఆవు నేతిని కరిగించి దానిలో 100 మిరియాలను లెక్కబెట్టి వేసి స్టవ్ ,మీద నుండి దించి వడకట్టాలి. ఆ నేతిని సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని భోజనం లో అన్నం లోని తొలి ముద్దలో వేసుకొని ప్రతి రోజు తింటూ వుంటే త్వరగా రక్త శుద్ధి జరుగుతుంది. దేనిని ఏ చర్మ వ్యాధి నివారణ కైనా వాడవచ్చు. దీనితోచర్మం ఎంతో అందంగా తయారవుతుంది.
మిరియాలను కూరలలో వాడుకోవచ్చును.
*కాళ్ళ మంటల నివారణకు -- మదయంత్యాది చూర్ణం*
మదయంతిక = గోరింటాకు
ఎక్కువ సేపు నిలబడడం ముఖ్య కారణం దీని వలన కాళ్ళ పై ఒత్తిడి పెరుగుతుంది.
గోరింటాకు పొడి --- 80 gr
చందనం పొడి --- 10 gr
ఎండిన గుంటగలగర పొడి --- 10 gr
ఒక గిన్నెలో అన్ని పొడులను వేసి బాగా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
రెండు టీ స్పూన్ల పొడిని తీసుకుని దానికి ఒక గ్రాము మెంతాల్ కలిపితగినంత నీరు కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.
ఈ పేస్ట్ ను పాదం పైన కింద అంతా పూయాలి
*సూచనలు :--*
కాళ్ళకు సరిపడిన చెప్పులను మాత్రమే వాడాలి. అప్పుడప్పుడు కొబ్బరినూనె, చందన తైలం
వంటివి రాస్తూ వుండాలి.
మసాలాలు తినకూడదు. మద్యం, సిగరెట్ల వంటి అలవాట్లను మానెయ్యాలి.
బరువును ఒక కాలి మీది నుండి ఇంకొక కాలి మీదికి మార్చుకుంటూ వుండాలి.
కుషన్ షూ వాడాలి.
వర్షాకాలంలో కాళ్ళ మీద , చేతుల మీద ఏర్పడే దురదలు , కొంకర్లు పోవడం
హస్త , పాద లేపనం
తేనె ---- ఒక టేబుల్ స్పూను
గ్లిజరిన్ ---- ఒక టీ స్పూను
గుడ్డు తెల్ల సోన ---- ఒకటి
శనగ పిండి ---- తగినంత
అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా పేస్ట్ లాగా కలపాలి . దీనిని కాళ్ళ మీద , చేతుల మీద పూయాలి . దీనిని
6 --- 8 గంటల వరాళి ( రాత్రంతా ) వుంచి ఉదయం కడగాలి .
దీని వలన చారలు ముడతలు కొంకర్లు నివారింపబడతాయి .
*సూచనలు ;---* మాటిమాటికి నీటిలో మరియు వర్షంలో తడవకూడదు .నీల్లు ఎక్కువగా తాగాలి . సబ్బుకు , నీటికి
సంబంధించిన పనులు చేయకూడదు .
*కాళ్ళ నొప్పులు --- బెణుకులు*
ఉత్తరేణి ఆకులు --- 100 gr
నువ్వుల నూనె --- 100 gr
గిన్నెలో నూనెను పోసి స్టవ్ మీద పెట్టి ఉత్తరేణి ఆకులను చిన్న చిన్న ముక్కలుగా తుంచి నెమ్మదిగా నూనెలో వేయాలి .
ఆకులు నల్లగా మాడిన తరువాత వడకట్టి ముద్ద కర్పూరం ఒక స్పూను కలపాలి . లేదా రసంతీసి నూనెకు కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇంకిపోయే వరకు కాచాలి దించి , వడకట్టి నూనెలో ముద్దకర్పూరం కలపాలి .
ఈ నూనెతో కాళ్ళకు మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయి .
*కాళ్ళ పగుళ్ళు --- నివారణ*
కారణాలు :--- వంశ పారంపర్యం ,చర్మం పొడిబారడం , చర్మం సాగే గుణాన్ని కోల్పోవడం , పోషకాహార లోపం మొదలైనవి
టంకణ చూర్ణము (Borax ) --- 5 gr
ఆముదము --- 5 gr
పసుపు --- 5 gr
White Petrolium Jelly or Vinegar --- 10 gr
ఒక చిన్న గిన్నెలో అన్ని పదార్ధాలను వేసి బాగా కలపాలి . ఆయింట్మెంట్ తయారవుతుంది .
1 రాత్రి నిద్రించే ముందు పాదాలను బకెట్ లోని వేడి నీళ్ళలో ఉంచాలి . స్క్రబ్బర్ తో పగుళ్ళు వున్నచోట బాగా రుద్దాలి . తరువాత తడి లేకుండా తుడిచి ఔషధాన్ని పూయాలి . సాక్స్ వేసుకోవాలి . ఉదయం మరలా స్క్రక్కబర్ తో
రుద్ది కడగాలి .
2. రాత్రి పడుకునే ముందు పాదాలను గోరువెచ్చని ఉప్పు నీటిలో వుంచి బాగా రుద్ది కడగాలి . తరువాత తడి లేకుండా
తుడిచి లేత మర్రి వూడల పాలను పూయాలి . ఉదయం శనగ పిండి తో కడగాలి .
*సూచనలు :---* ఎక్కువసేపు నిలబడకూడదు . బరువు తగ్గాలి నీళ్ళు ఎక్కువగా తాగాలి . సాత్వికాహారం ( బీర , సొర )
తినాలి
*కాళ్ళ పగుళ్ళు --- నివారణ*
గుగ్గిలం పొడి
వెన్నపూస
రెండింటిని కలిపి పూస్తే వెంటనే తగ్గుతాయి .
కింద పడి కాళ్ళకు దెబ్బ తగిలితే
మోకాళ్ళు సన్నగా చిట్లితే కూడా
తుమ్మ బంక పొడి
తుమ్మ కాయల పొడి
పటికబెల్లం పొడి ( లేదా) పాత బెల్లం పొడి
అన్నింటిని బాగా కలిపి నిల్వ చేసుకోవాలి .
ప్రతి రోజు అర టీ స్పూను పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి . దీనితో ఎముకలు చిట్లడం అనే సమస్య నివారింప
బడుతుంది .
పంచ పత్ర తైలాన్ని తయారు చేసి తైల మర్దన చేయాలి . రోజుకు రెండు , మూడు సార్లు తైలాన్ని గోరువెచ్చగా
చేసి పూస్తే వాపు తగ్గుతుంది .
ధన్యవాదములు 🙏
?మీ నవీన్ నడిమింటి, Naveen Nadiminti
*సభ్యులకు సూచన*
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..
No comments:
Post a Comment