✍️కిడ్నీ సమస్యలు (దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు- సి కె డి) మరియు నివారణ మార్గాలు:
ఈ సమస్యకు కారణాలు:
👉జీవనశైలి లో వచ్చిన మార్పులు.
👉శారీరక శ్రమ లేకపోవడం.
👉శరీరానికి కావలిసిన మోతాదులో నీళ్లు లేకపోవడం.
👉సరైన నిద్ర లేకపోవడం.
👉మద్యపానం, ధూమపానం కలిగి ఉండటం.
👉ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం.
👉అధికంగా మాంసాహారం తీసుకోవడం.
👉మానసిక ఒత్తిడి.
👉ఈ సమస్యకు ముఖ్య కారణాలు మధుమేహం మరియు అధిక రక్తపోటు.
✍️తొలిదశలో లక్షణాలు:
👉కిడ్నీ పనితీరులో సమస్యలు ఉన్నపటికీ సాధారణంగా మానవ శరీరం విజయవంతంగా పనిచేయగలదు.
👉దీనితో తొలిదశలలో కిడ్నీ దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు ( సికెడి) బయటపడే స్థాయిలో లక్షణాలను చూపించదు.
👉 సికెడి తొలిదశ లక్షణాలు సామాన్యంగా అర్థరహితంగా ఉంటాయి.
👉ఆకలి కాకపోవడం.
👉వికారం.
👉పొడిబారిన చర్మం కలిగి దురదలు రావడం.
👉ఒక రకమైన తలనొప్పి రావడం.
👉అస్వస్థతతో ఉన్నట్లు అనుభూతి.
👉అలసట,చిరాకు కలగడం.
👉అనుకోకుండా బరువు కోల్పోవడం.
✍️రెండవ దశలో లక్షణాలు:
👉కిడ్నీ పనితీరు సక్రమంగా లేని కారణంగా రక్తంలో క్యాల్షియం మరియు ఫాస్ఫరస్ స్థాయిలలో అసమతుల్యత ఏర్పడినప్పుడు ఎముకల నొప్పి కలగడటం.
👉 చేతులు, పాదములు మరియు చీలమండలలో తిమ్మిరి మరియు వాపు కలగడం.
👉అమ్మోనియా వంటి వాసనతో కూడిన శ్వాస దుర్వాసన (లేదా) శరీరంలో వ్యర్థ పదార్థాల నిల్వ కారణంగా చేపల వాసన కలిగి ఉండటం.
👉ఆకలి హరించుకుపోవడం మరియు బరువు కోల్పోవడం.
👉వాంతులు అవడం.
👉తరచుగా వెక్కిళ్లు రావడం.
👉ఎక్కువ మార్లు మూత్రవిసర్జన అవడం ముఖ్యంగా రాత్రి వేళలో మరీ ఎక్కవగా వెళ్లడం.
👉శ్వాసక్రియకు ఆటంకం ఏర్పడటం.
👉ఆయాసం కలగడం.
👉మూత్రం లో లేదా మలం లో రక్తం పడటం.
👉మానసికమైన ఆలోచనలు రావడం.
👉కండరాలలో తిమ్మిర్లు రావడం.
👉తొందరగా గాయాలు ఏర్పడటం.
👉తరచుగా నీరు దాహం వేస్తుండటం.
👉రుతుక్రమంలో లోపం.
👉నిద్రలేమి.
👉ఎక్కువ లేత రంగు లేదా ఎక్కువ నలుపు రంగుకు చర్మం మారడం.
👉లైంగిక చర్యకు విముఖత.
✍️నివారణ మార్గాలు:
👉తక్కువ సోడియం కలిగిన ఆహారాన్ని సేవించడం.
👉 డబ్బాలలో ఆహారపదార్థాలను ఉపయోగించకపోవడం. ఎందుకంటే వాటిలో సోడియం హెచ్చుగా ఉంటుంది.
👉రోజుకు కనీసం 30 నిమిషాలపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.
👉ఈత మరియు వేగంగా నడక శారీరకంగా చురుకుగా ఉండేందుకు మంచి వ్యాయామాలు.
👉 వైద్యుల సలహా మేరకు వారినుండి మీకు ఏలాంటి వ్యాయామం సరిపడుతుందో అడిగి తెలుసుకుని వ్యాయామాలు చేయాలి.
👉తాజా పళ్లు, కూరగాయలను బాగా తీసుకోవాలి.
👉చిరుధాన్యాలు, తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలను ఆహారంలోకి చేర్చాలి.
👉చక్కెర మరియు తీపుకలిపిన పానీయాలను వాడకండి.
👉తక్కువ కెలరీలు కలిగిన ఆహారాన్ని ఎంపిక చేసుకోండి.
👉కొవ్వు కలిగిన పదార్థాలను వాడకండి.
👉ఉప్పు మరియు చక్కెరను వాడకండి
👉ఆరోగ్యకరమైన బరువుపై దృష్ట ఉంచండి.
👉 ఊబకాయం మీ మూత్రపిండాలపై ప్రభావాన్ని చూపుతుంది.
👉అవసరమైనంత మోతాదులో నిద్రించండి. రోజుకు 7 నుండి 8 గంటలపాటు నిద్రించడం లక్ష్యంగా ఉంచుకోండి.
👉ఆ మాత్రం నిద్ర మీ మొత్తం ఆరోగ్యానికి, మరియు శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరం.
👉కిడ్నీ డ్యామేజ్ కు దోహదం చేసే ధూమపానాన్ని వదలివేయండి . పొగ త్రాగడాన్ని వదలడం వల్ల మీ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
👉మానసిన ఒత్తిడి మరియు మానసిన మాంద్యాన్ని అదుపుచేయడం చాలా ముఖ్యం.
👉 దీర్ఘకాలిక ఒత్తిడి మీ రక్తంపోటును, రక్తంలో గ్లూకోస్ స్థాయిని పెంచుతుంది.
👉మనసుకు ఆహ్లాదం కలిగించే సంగీతాన్ని వినడం, ప్రశాంతమయిన మరియు శాంతిని కల్పించే పనులపై దృష్టిని కేంద్రీకరించడం లేదా ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేస్తాయి.
👉ఔషధాలను సకాలంలో క్రమం తప్పకుండా ఉపయోగించండి. లేదా డాక్టరు సూచనల ప్రకారం మందులను తీసుకోండి.
✍️ముఖ్య గమనిక:
పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.
✍️విన్నపం:
మీరు చదివిన తర్వాత ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి. మంచి విషయాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు. మీ వంతు బాధ్యతగా ఈ చిన్న సహాయం చేస్తారని ఆశిస్తున్నాము.
✍️సమస్య ఏదైనా ఒకసారి మాతో చర్చించండి. మా వంతు సహాయంగా మీకు విలువైన ఆరోగ్య సలహాలు ఇవ్వబడును. మీరు మీ విలువైన సలహాలని మాకు కామెంట్ రూపంలో ఇవ్వగలరని ఆశిస్తూ.. సమస్య ఉన్నవాళ్లు వాట్సప్ ద్వారా తెలుపగలరని విజ్ఞప్తి.
మా వాట్సప్ నెంబర్: 9949363498
🙂అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి🙂
No comments:
Post a Comment