Saturday, 19 August 2023

మలబద్దకం సమస్య వల్ల వచ్చే ఇతర సమస్యలు

*_✍🏻 "మలబద్దకం సమస్య వల్ల వచ్చే ఇతర సమస్యలు": -_*

*_👉🏼 మలబద్దకం అనేది అనేక రోగాలకు దారి తీస్తుంది._*

*_👉🏼 ప్రతిరోజూ వేళ ప్రకారం, గడియారం గంట కొట్టినంత సరిగ్గా విరేచనం ఫ్రీగా అయ్యే అలవాటులేని వ్యక్తి పేగులు చాలా బలహీనంగా ఉన్నాయని అర్థం._*

*_👉🏼 కొందరికి విరేచనం వచ్చినట్టే అన్పిస్తుంది. కానీ ఎంతో ప్రయత్నిస్తే తప్ప బైటకు రాదు. టాయిలేట్ కోసం ఎదురుచూస్తూ కాఫీలు తాగటం, చుట్ట, బీడి, సిగరెట్లు తాగటం, పేపరు చదవడం.... ఇలాంటి యుద్ధకార్యక్రమాలెన్నో చేస్తుంటారు. అయినా విరేచనం అవదు. ఆ యుద్ధం ముగియదు._*

*_👉🏼 గంటల తరబడి మోకాళ్ళు నొప్పులు పుట్టేంతవరకూ టాయిలెట్లోనే గడిపే పరిస్థితి నడుస్తోందంటే, పేగులు చాలా బలహీనంగా ఉన్నాయనే అర్ధం చేసుకోవాలి._*

*_✍️ "అసలు ఈ మలబద్ధత ఎందుకొస్తుంది"?_*

*_👉🏼 తీసుకున్న ఆహారం తిన్నట్టుగా అరిగిపోతే మలబద్ధత రాదు. జీర్ణశక్తి బలంగా ఉన్నా మలబద్ధత రాదన్నమాట. అందుకే “మిగలకుండా జీర్ణం అయ్యే ఆహారం” "Non- Residual Diet" తీసుకోమంటుంది వైద్యశాస్త్రం._*

*_👉🏼 మనకున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల రీత్యా తూకం తూచి ఆహారం తీసుకోవాలంటే అన్ని వేళలా అందరికీ సాధ్యపడక పోవచ్చు._*

*_👉🏼 కాబట్టి కడుపులో అగ్నిని కాపాడుతూ పేగులనడకని క్రమబద్ధం చేస్తూ ఆహారాన్ని సక్రమంగా జీర్ణంచేస్తూ విరేచనం ఫ్రీగా అయ్యేలా FOOD వాడమని శాస్త్రం చెప్తుంది._*

*_👉🏼 కడుపులో మందంగా ఉంటోంది... ఓసారి విరేచనానికి వేసుకుందామను కొంటున్నాను అంటుంటారు చాలామంది. విరేచనాల మందు వేసుకుంటే కొద్దిగా మలం, ఎక్కువ నీళ్ళతో కొన్ని విరేచనాలు అవుతాయి._* 

*_👉🏼 ఒక్కోసారి విపరీతంగా కడుపు నొప్పి, వాంతులు రావడం కూడా జరుగుతుంటాయి. కొందరిలో కాళ్ళూ చేతులూ బలహీన పడినట్లవుతాయి కూడా!_*

*_👉🏼 తరుచూ ఇలా నీళ్ళగా విరేచనాలు అయ్యేమందుని వాడుతూ ఉంటే పేగులు బలహీనబడి మరికొన్ని కొత్త ఉపద్రవాలకు దారితీయవచ్చు. కూడా. అంతేకాదు. నీళ్ళగా కొన్ని విరేచనాలు అయినంత మాత్రాన కడుపంతా క్లీన్ అయ్యిందని అనడానికి కూడా వీల్లేదు. ఈ విధంగా విరేచనాలకు వేసుకుంటే కడుపు క్లీన్ అవదు కూడా._*

*_👉🏼 ఒక పచ్చి మామిడికాయని పిండితే రసం ఎలా రాదో, దోషాలు పక్వం కాకుండా విరేచనానికి వేసినా అలానే బైటకి పోవని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది._*

*_✍🏻 "విరేచనం ఫ్రీగా అవటం అంటే ఏమిటి"?_*

*_👉🏼 ఫ్రీగా విరేచనం అయ్యిందంటే, అది మృదువుగా ఉంటుంది. అందులో ఆహార పదార్థాలేవీ కన్పించకూడదు. జిడ్డుగా ఉండి కడుక్కున్నప్పుడు వేళ్ళకు అంటుకొని పోవటం, ఎన్ని నీళ్ళు కొట్టినా లెట్రిన్ ప్లేట్కు అంటుకొని వదలకపోవటం ఇవి రెండూ జీర్ణశక్తి ఫెయిలయ్యిందనడానికి గుర్తులు._*

*_👉🏼 జిగురు, బంక, చీము, రక్తం, రక్తపు చారలు కన్పిస్తే పేగుల్లో ఏదో వ్యాధి ఉందన్నట్లు, రోజూ సరిగ్గా సమయానికి వెళ్లగానే విరేచనం అయి, ఇంకా వస్తుందేమోననే అనుమానంతో ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరగా ఆపని పూర్తయి సుఖంగా బైటకు రాగలిగినప్పుడు విరేచనం ఫ్రీగా అయ్యిందని అర్థం. విరేచనంలో ఏమాత్రం మార్పు కన్పించినా పేగుల సంరక్షణ కోసం మనం తక్షణం జాగ్రత్త తీసుకోవాలని అర్ధం చేసుకోవాలి._*

*_👉🏼 రోజూ ఒకసారిగాని, ఉదయం, రాత్రి రెండు సార్లుగానీ ఆరోగ్యవంతంగా విరేచనం కావాలి._*

*_👉🏼 కడుపులోకి ఆహారం తీసుకున్నపుడల్లా విరేచనం కావటం, ఎప్పుడు పడితే అప్పుడు విరేచనం కావటం, మంటగానో, పోటు పెడుతూనో, కడుపులో నొప్పితోనో, పుల్లటి వాసనతోనో, దుర్గంధంతోనో చీము వాసనతోనో, మలం లేకుండా, బియ్యపు కడుగునీళ్ళలానో విరేచనం అవుతోందంటే కడుపులో ఏదో జబ్బు ప్రవేశించిందని గ్రహించి వెంటనే మలాన్ని శోధించి, జీర్ణశక్తిని సరిచేసి, పేగుల్ని శక్తివంతం చేసే ఔషధం వాడవలసి ఉంటుంది._*

*_✍🏻 "ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ సమస్య":_*

*_👉🏼 మలబద్ధత అనేది ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ వ్యాధిలో పరాకాష్టకు చేర్తుంది._* 

*_👉🏼 విరేచనం మేక పెంటికలు వెళ్ళినట్లు పిట్టంకట్టి గట్టిరాయిలాగా అయి బలవంతంగా ముక్కిముక్కి వెళ్ళవలసి వస్తుంది._* 

*_👉🏼 ఒక్కోసారి అసలే అవకపోవటం, ఇంకోసారి పల్చగా నీళ్ళలాగా అవటం ఇలా బాధిస్తూ ఉంటుంది. ఇది వాతం వలన వచ్చే వ్యాధి._* 

*_👉🏼 ఈ వ్యాధిలో మలబద్ధతని పోగొట్టడానికి కేవలం విరేచనాల మందులు వేయడం వలన పేగులు మరింత బలహీనమై వ్యాధి పెరుగుతుందే గానీ తగ్గదు. దీనికి తోడు మానసిక లక్షణాలు కూడా ఈ వ్యాధిలో తోడవుతాయి._*

*_✍🏻 "మొలల వ్యాధికి మలబద్ధత ముఖ్యకారణం":_*

*_👉🏼 విరేచనం సరిగా అవక బలవంతంగా ముక్కవలసి రావడం, లోపల ఏదో బంధించినట్లు అతికష్టంమీద కొద్దిగా విరేచనం అవడం, ఇంకా లోపల చాలా విరేచనం మిగిలిపోయినట్టే అన్పించటం బాగా వత్తిడినిస్తే జిగురుగానీ, రక్తంగానీ పడటం... ఇవన్నీ మొలల వ్యాధిలో తరచూ కన్పించే లక్షణాలే!!_*

*_👉🏼 మొలలు వచ్చి తగ్గినవారూ, మొలల ఆపరేషన్ చేయించుకున్నవారు కూడా విరేచనం విషయంలో సరయిన కేర్ తీసుకోకపోతే మొలలు తిరగబెడ్తుంటాయి._* 

*_✍🏻 "పేగు జారడానికి మలబద్ధతే కారణం":_*

No comments:

Post a Comment