Thursday 17 August 2023

మలబద్ధకం* అన్ని రోగాలకు మూలకారణం

*మలబద్ధకం* 
అన్ని రోగాలకు మూలకారణం 

👉డాక్టర్ గారూ! " కడుపు బరువుగా ఉంది. సరిగ్గా విరేచనం అయి ఐదు రోజులయింది. బద్దకంగా, బరువుగా ఉంది ఒళ్ళు”! ఇది ఒకరిద్దరి సమస్య కాదు. చాలా మందిది

👉మీకు తెలీదు కానీ ఈ విరేచనం సరిగ్గా కాకపోవడం... మనకొచ్చే చాలా వ్యాధులకి కారణమవుతుంది. ఈ మలబద్దకాన్ని constipation అంటారు.

 👉 జీర్ణం తర్వాత మలవిసర్జన సరిగ్గా జరగకపోవటం లేదా కష్టంగా జరగటం లేదా పూర్తిగా జరగకపోవడాన్ని మలబద్దకం అని అంటారు

👉ఇది రోజుకు ఒకటి రెండుసార్లు బయటకు వెళ్ళిపోతుంది. 

👉మలబద్దకం ఉన్నవాళ్ళల్లో ఇది అలా వెళ్ళిపోకుండా 2-7 రోజుల వరకు ఉండిపోతుంది. 

👉కొంత మందిలో మలం పూర్తిగా వెళ్ళకుండా ఉండలు ఉండలుగా కొద్దికొద్దిగా వెళుతూ ఉంటుంది.

👉ఆయుర్వేదం ఈ మలబద్దకానికి దూషించబడ్డ వాతం కారణమంటుంది. వాతం అంటే మన శరీరంలో కదిలే, కదిల్చే శక్తి. అది మార్పుచెందితే ఈ మలబద్దకం అనే సమస్య ఏర్పడుతుంది.

👉ఒక్కొక్కప్పుడు మలం గట్టిపడి, ఎండిపోయి వస్తూ ఉంటుంది. అది మన జీర్ణరసాల సామర్థ్యం తగ్గటంవల్ల వస్తుంది ఇది పిత్తదోషం వల్ల జరుగుతుంది.

👉అలాగే మలం బైటకెళ్ళేటప్పుడు కడుపులో నొప్పి రావడం, మలం జిగురుగా అంటుకుంటూ ఉండటం కఫ దోషానికి సూచన. దీంట్లో జిగురు కల్గిన పదార్థం మలద్వారాన్ని అడ్డుకోవటం వల్ల మలబద్దకం కలుగుతుంది..

✍️ఈ సమస్య ఎలా వస్తుంది

👉నోటిగుండా మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత మిగిలిన వ్యర్థపదార్థం పెద్దప్రేవుల ద్వారా కదులు తున్నప్పుడు ఆ ప్రేగు గోడలు దానిలోని నీటిని పీల్చే స్తాయి. ఆ మిగిలిన గట్టిపదార్థాన్ని మలం అంటాం.

👉 అదే ప్రేగు తన గోడలు కదిల్చి దాన్ని క్రిందకి పాయువు దాకా నెడుతుంది. అప్పటికి అది గట్టిపడి ఉంటుంది. 

👉ఆ నీరు మరీ ఎక్కువగా పీల్చబడితే మలం బాగా రాయిలా అయి క్రిందకు జారదు. దానివల్ల మలం క్రిందకి రావటం చాలా ఆలస్యమవుతుంది. అదే మలబద్దకం. 

✍️ఈ సమస్య రావడానికి కారణాలు:

 👉ఏ కారణంచేతనైనా ద్రవం శరీరంలో ఇంకిపోవడం. 

✍️అలాగే ఈ క్రింది వ్యాధులు కూడా మలబద్దకం
రావడానికి కారణమవుతాయి:

👉పక్షవాతం, నరాలబలహీనత వంటి వ్యాధులు.

👉తలలో నరాల కేంద్రంలో లోపాలు, కంపవాతం, వెన్ను పూసకి దెబ్బలు తగలడం లేదా వాటి వ్యాధులు, 

✍️ఈ సమస్య వల్ల కలిగే నష్టాలు:

👉నోటిపూత, వికారం, వాంతులు, నాలుక తెల్లగా అవడం, బెరడుకట్టినట్లు ఉండడం.

👉ముఖ్యంగా కడుపులో గాలి చేరి పొట్ట ఉబ్బి పైకితన్ని గుండె క్రింద, పై కడుపులో నొప్పివస్తూ ఉంటుంది.

 👉పాయువు దగ్గర పగులు, ఆర్శమొలలు ఏర్పడతాయి. 

👉క్రిందభాగంలో చర్మం ముడుతలు పడుతుంది. 

👉చాలాకాలం బాధపడితే మిగిలిన ఈ మలం విషంగా మారి కీళ్ళనొప్పులు, కాళ్ళు లాగటం వంటివి వస్తాయి.

👉గుండెల్లో మంట, ఎసిడిటి, త్రేన్పులు. 

👉నిద్రపట్టకపోవడం, ఆదుర్దా, మానసిక గందరగోళం.

✍️ మలబద్దకం ని నివారించే మార్గాలు:

👉అనాస, మామిడి, సీతాఫలాలు మంచి విరేచనకారి.

👉మారేడుకాయలు పండిన తరువాత గుజ్జు చక్కటి సహజ మలబద్ధక నివారిణి. 

👉త్రిఫలా చూర్ణం రోజూ రెండు చెంచాలు రాత్రి పడుకునేముందు వేడినీళ్ళతో తీసుకుంటే సుఖ విరేచనమవుతుంది.

👉బాగా మగ్గిన అరటిపండును తొక్కతో కలిపి తీసు కుంటే ఎటువంటి మలబద్దకమైనా తగ్గుతుంది.

👉ఒక చెమ్చా ఆముదాన్ని వేడిచేసి రాత్రిపూట తీసుకుంటే ఎలాంటి మలబద్దకమైనా తగ్గిపోతుంది. 

👉రాత్రి పడుకునే ముందు నిల్వ ఉంచిన రాగిచెంబులో నీళ్ళుతాగి, ఉదయాన్నే మళ్ళీ త్రాగితే మంచిది.

👉ఎండుద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి పొద్దుటే పర గడుపున ఆ నీటితో సహా తీసుకోవాలి. 

👉జామ, బొప్పాయి వంటి పళ్ళు పీచుపదార్థాన్ని కలిగి ఉండటంవల్ల మలబద్దకాన్ని తగ్గిస్తాయి.

👉ప్రతిరోజూ ఉలవల కషాయం కాని ఉలవల చూర్ణం కాని తీసుకుంటే సుఖ విరేచనమవుతుంది.

👉గ్లాసు బార్లీనీళ్ళలో రెండు చెమ్చాల తేనె కలుపుకుని రోజూ త్రాగుతుంటే సుఖ విరేచనమవుతుంది

✍️అలవాట్లు మారాలి:

👉మసాలాలు, వేపుళ్ళు, వాడొద్దు

👉రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి.పరగడుపున 2 గ్లాసులు త్రాగాలి
👉రోజూ తాజాపండ్లు లేక పండ్లరసాలు తాగాలి

పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిష్కారం చూపే  మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.

✍️విన్నపం:
మంచి విషయాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు.

✍️సమస్య ఏదైనా ఒకసారి మాతో చర్చించండి. మా వంతు సహాయంగా మీకు విలువైన ఆరోగ్య సలహాలు ఇవ్వబడును

మా ఫోన్ నెంబర్.9949363498

🙂అందరూ బాగుండాలి.. అందులో  మనం ఉండాలి🙂

No comments:

Post a Comment