Tuesday, 8 August 2023

పడిశం పట్టి (జలుబు చేసి) ముక్కులు మూసుకుపోయినప్పుడు ఉపశమనం కోసం ఆట్రివిన్, నేసీవియాన్ వంటి స్ప్రేలు వాడటం ద్వారా దీర్ఘకాలంలో ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా?

*పడిశం పట్టి (జలుబు చేసి) ముక్కులు మూసుకుపోయినప్పుడు ఉపశమనం కోసం ఆట్రివిన్, నేసీవియాన్ వంటి స్ప్రేలు వాడటం ద్వారా దీర్ఘకాలంలో ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా?వైద్య నిలయం సలహాలు అవగాహనా కోసం*

             జలుబు చేసినప్పుడు మూసుకుపోయే నాసిక రంధ్రాలను తెరవడానికి మెదడు అనుక్షణం పోరాడుతూనే ఉంటుంది. శరీరంలోని చాలా కణాలను సైన్యంగా మార్చి జలుబుపై యుద్ధాన్ని ప్రకటిస్తుంది. అందుకే, మీరు గమనించినట్లైతే జలుబు చేసిన సమయంలో మనకు మామూలు సమయాల్లో కంటే ఎక్కువగా ఆకలి, దాహం వేస్తాయి. కారణం ఆ యుద్ధమే. ఇలాంటి స్ప్రేలు అలవాటు చేసుకోవడం వల్ల ఆ యుద్ధాన్ని మెదడు విరమిస్తుంది. తద్వారా, అవి వాడితే తప్ప నాసిక రంధ్రాలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా వాటికి మనం బానిసలయ్యే ప్రమాదముంది. అందుకే, వాటిని ఎక్కువగా వాడకూడదు. గట్టిగా చెప్పాలంటే అసలు వాడనేకూడదు. వాటి అవసరమూ లేదు.

*జలుబు నుండి ఉపశమనం కోసం ఆది నుండీ పాటించే నవీన్ రోయ్ సలహాలు ఉత్తమం.*

1.-‘లంకణం పరమౌషధం’ అని ఒక నానుడి ఉంది. అది జలుబుకి బలమైన ప్రత్యర్థి. జలుబు చేసిన రోజు రాత్రి ఘన పదార్థాలేమీ పుచ్చుకోకుండా పడుకుంటే మరుసటి రోజు ఉదయం కల్లా ఉపశమనం లభించడమే కాక ఆ రాత్రి గాఢ నిద్ర పట్టడం వల్ల నూతనోత్సాహం లభిస్తుంది శరీరానికి. పరకడుపుతో కాక పళ్ళరసాలు పుచ్చుకొని పడుకోవచ్చు. విటమిన్ సీ లేదా సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉన్నవి పుచ్చుకుంటే మరీ మంచిది.
2.-ఒకప్పుడు (ఇప్పుడు కూడా కొంతమంది పాటిస్తున్నారు) పసి పిల్లలకు జలుబు చేస్తే పెద్దలు వాళ్ళని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని వేడినీళ్ళతో తలంటు పోసేవారు. అప్పుడు దోసిలితో నీళ్ళు తీసుకొని తలపైన బలంగా కొడతారు. దాంతో నాసిక రంధ్రాలు తెరుచుకొని వారికి ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా పెద్దలకు కూడా పనికొస్తుంది. ఇప్పుడ అందరి ఇళ్ళలో బాత్రూములో వాటర్ హీటర్లు సహజం కాబట్టి షవరు క్రింద వేడినీళ్ళతో స్నానం చేస్తే యిట్టే ఉపశమనం లభిస్తుంది.
3.-వేడి పాలలో పసుపు కలుపుకొని త్రాగినా మంచిదే.
4.-మరిగే నీళ్ళలో పసుపు వేసుకుని దుప్పటి కప్పుకుని ఆ ఆవిరి పీల్చినా మంచిదే.
5.-త్రిఫల చూర్ణం తీసుకున్నా మంచిదే.
జలుబుకి ఎటువంటి మందులూ అవసరం లేదు. ఈ చిట్కాలన్నీ నేను పరిశోధించి, తరచూ పాటించి లాభం పొందిన స్వానుభవంతో చెప్పినవి. ఎందుకంటే, నాకు dust allergy ఉండడం మూలాన జలుబు నిత్యం నా వెంట నడిచే నా ప్రియమైన శత్రువు. 😁
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://chat.whatsapp.com/BaoQcypgukF0O1MguKifMx
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment