Wednesday 9 August 2023

కీళ్లవాతం (#రుమటాయిడ్ ఆర్తరైటిస్) #rheumatoidarthritis

#కీళ్లవాతం (#రుమటాయిడ్ ఆర్తరైటిస్) #rheumatoidarthritis 
అంటే మన శరీరంలోని అన్ని కీళ్ళు, వేళ్ళు, మోకాళ్లు,  మోచేతులు, తుంటి, మరియు చీలమండలాల్లో వాపులతో కూడిన నొప్పితో బాధిస్తూ ఉండడం. నొప్పి, వాపు ఉన్న చోట ఎరుపురంగుదేలి ఉండడం కూడా కీళ్ళ వాతం యెక్క లక్షణం.

కీళ్లనొప్పులు అనేవి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కణాలను మరియు ఉపాస్థి (కీళ్లలో గట్టినరాలు’ లేదా ‘cartilages) నరాలను నాశనం చేయడం ప్రారంభిస్తాయి. ఇలా కీళ్ళు, వాటిసమీప ప్రాంతాలపై కీళ్లనొప్పులు దాడి జరిపి రోగిని నొప్పిస్తాయి. కదలినప్పుడల్లా కీళ్లలో తీవ్ర నొప్పిని కలుగజేసి కష్టాలు తెచ్చి పెడతాయి.

మాములుగా వయసు పైబడిన వారిలో కనిపించే వాతం నొప్పులకు విరుద్ధంగా ఈ వ్యాధి అన్ని వయసుల వారికీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక ఈ వ్యాధి ముదిరి కీళ్లలో వ్యకల్యాన్ని కూడా కలిగిస్తుంది. 

©కారణాలు 
ఏ విధమైన తీవ్రమయిన ఇన్ఫెక్షన్స్ వచ్చినపుడు, వ్యాధి నిరోధక శక్తి లో మార్పులు జరిగినపుడు,  ఎక్కువకాలం వ్యాధి నిరోధక శక్తి పై ప్రభావం చూపే మందులు స్టెరాయిడ్స్ వాడినపుడు, పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలని నిర్లక్ష్యం చేయడం, వంశ  పరంపరంగా కుడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

®చికిత్స 
దీనికి ఆయుర్వేదం లో చాలా రకాల మంచి మందులు ఉన్నాయి. రోగి రోగ వ్యవస్తను బట్టి వారి తగిన మందుల ద్వార మంచి పరిష్కారం అందించవచ్చు. 
పథ్యం ఆహార వ్యవహారాల్లో మార్పులు, సరైన చికిత్స విధానాలతో ఈ మొండి వ్యాధిని మనం అధిగమించవచ్చు. 

మరన్ని వివరాలకు సంప్రదించండి 
9949363498

No comments:

Post a Comment