Saturday 16 September 2023

దగ్గు-ప్రకృతి చికిత్స

దగ్గు-ప్రకృతి చికిత్స
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! 
సాధారణముగా దగ్గులు రెండు విధాలుగా వుంటాయి. 1) ప్రత్యక్ష దగ్గు 2)పరోక్ష దగ్గు 

1. ప్రత్యక్ష దగ్గు

* ఛాతీ సంబంధిత భాగాలైన కంఠనాళాలు శ్వాసనాళాలు, శ్వాసకోశాలు , పార్శ్వశూల,
పో రలు మొదలగు వాటికి అస్వస్థత చేకూరినపుడు ఈ దగ్గు వస్తుంది. ఛాతీలో శ్లేష్మము నిలిచినపుడు కూడా ఈ దగ్గు వచ్చును. దీనిని అప డానికి  ప్రయత్నించరాదు.

👨🏻‍⚕️చికిత్స

* రోగి స్నానము చేయగానే మెడ, ఛాతీ ఎర్రబడి, వేడిపుట్టేట్లుగా చేతులతో మర్ధన గావించాలి. స్నానము చేయలేని దుర్బలులు తడిగుడ్లతో ఒళ్ళంతా - తుడుచుకోవాలి.

👉ఎంత దగ్గినను ఛాతీలోని శ్లేష్మము బయటకు రానపుడు ఛాతికి తడిగుడ్డతో ఒక అరగంట సేపు కట్టు వేయాలి. కట్టువేసే ముందు ఛాతీకి మర్దన గావించి వేడి పుట్టించిన ఉపయుక్తముగా వుంటుంది.

👉 గోరువెచ్చని నీటిని ధారగా ఛాతిమీద, వీపుమీద పడేటట్లు చేస్తూ చేత్తో గట్టిగా
వేగముగా మర్దన గావించినా దగ్గు శాంతించును.

👉 తల చన్నీటిలో తడిపి, నోరు మూసి, ముక్కులతో ఆవిరి పీల్చిన మంచి ఉపయోగకరముగా వుంటుంది. ఆవిరి పట్టిన తదుపరి స్నానముగానీ, తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుటగానీ చేయాలి.

👉 దగ్గు తగ్గే వరకు ఆహారము ఎక్కువగా ద్రవరూపములోనే తీసుకోవాలి.

2. పరోక్ష దగ్గు🥵

క్షయ, న్యూమోనియా, ప్లూ రసీ, ఉబ్బసము మొదలగు వ్యాధులు ఆయా శరీర భాగాలు అస్వస్థత చెందినపుడు వస్తాయి. ఈ వ్యాధులలో వచ్చే దగ్గునే పరోక్ష దగ్గు అని అంటారు. వాత వ్యాధులు, గుండెజబ్బు లాంటి వ్యాధులతో కూడి కూడా వుంటుంది. ఈ దగ్గు ఉదయము నిద్రలేవగానే వస్తుంది.
👨🏻‍⚕️ చికిత్స :-

👉ఆయా వ్యాధులను గుర్తించి తగిన చికిత్సలను చేస్తూ దగ్గు నివారించుటకు ఛాతీకి తడికట్లు వేయాలి.

👉 ఏ దగ్గు అయినా సరే ప్రారంభించినప్పుడు ముందు కొద్ది రోజులు నిమ్మ రసముతో ఉపవాసము చేయాలి. తదుపరి సీజన్లో వచ్చు పళ్లరసము
కొద్దికాలము తీసుకోవాలి.

👉క్రమక్రమముగా కూరలు, అన్నము తీసుకోవాలి.

👉 దగ్గు నివారించే వరకు పాలు, టి, కాఫీ, పంచదార, పప్పు, క్రొవ్వు పదార్థాలు పూర్తిగా మాని వేయాలి.

🍀☘️ ఆయుర్వేదంలో చికిత్స:-

తులసి ఆకులు -10
 అల్లం -5 గ్రాములు 
మిరియాలు -6
పసుపు 2చిటికెడు
పటిక బెల్లం/కలకండ 10 గ్రాములు
నీళ్లు 200ml (ఒక గ్లాసు) వేసి సగం అయ్యే వరకు మరిగించి వడపోసుకొని రోజు రెండు పూటలా తాగాలి.

👉 రాత్రి నిద్రించే ముందు అరికాళ్లకు ఛాతీ కి గొంతుకు ఆవాల నూనె గోరువెచ్చగా చేసి రాయాలి

No comments:

Post a Comment