Tuesday 19 September 2023

విపరీతమైన_మోకాలి_నొప్పి_వేధిస్తుందా?* *#నడవలేకపోతున్నారా? *అయితే #ఈ_పని_చెయ్యండి

*విపరీతమైన_మోకాలి_నొప్పి_వేధిస్తుందా?* *#నడవలేకపోతున్నారా? *అయితే #ఈ_పని_చెయ్యండి*
*అవగాహనా కోసం Naveen Nadiminti సలహాలు*

          చాలామంది విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా మోకాలు సహకరించకపోవడంతో నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. నడవాలన్నా, మెట్లు ఎక్కాలి అన్నా, పరిగెత్తాలి అన్నా, పని చేయాలన్నా మోకాలు నొప్పి ఎక్కువగా ఉన్నవారు తీవ్ర ఇబ్బంది అనుభవిస్తూ ఉంటారు.

*1.మోకా లు నొప్పి తగ్గడం కోసం*
ఆయుర్వేదంలో మొట్ట మొదట మందు అన్నింటికీ ఉపయోగపడేది కలబంద. కలబంద గుజ్జు నీ తీసుకుని అందులో ఆవనూనె కలిపి మర్ధన చేస్తే తగ్గుతుంది. లేదా కలబంద గుజ్జును వేడి చేసి దూదితో తీసుకొని మర్ధన చెయ్యాలి. మరొకటి యూ కలిప్తస్ నూనెని తీసుకొని మర్ధన చేస్తే మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడచ్చు..

*2       #కీళ్లలో_గుజ్జు_శక్తి_పెరగడానికి*                                             

           జువ్వి పండ్లు ( ప్లక్ష వృక్షము)  ఎన్ని దొరికితే అన్ని తెచ్చి వారిని రెండేసి ముక్కలుగా చేసి బాగా ఎండ బెట్టాలి. బాగా మందంగా వున్న కుండను శుద్ధి చేసి బాగా కడగాలి.  కుండను తేమ లేకుండా బాగా ఎండబెట్టాలి.
        ఆ కుండలో ఎండిన పండ్లను పోసి అవి  మునిగేంతవరకు  తేనె పొయ్యాలి.  ఎండిన జువ్వి పండ్లు  తేనెను పీల్చుకుంటాయి. మరలా మునిగే వరకు తేనె పోయాలి.
 కుండ మీద మూకుడు బోర్లించాలి. ఒక గుడ్డకు బంక మట్టిపూసి కుండలోకి గాలి చొరబడకుండా
 మూకుడు, కుండ కలిసే చోట సీల్ చేయాలి.   ఆ కుండను గాలి తగలని .చోట ఒక మూలగా 30 రోజులు ఉంచాలి.  అది బాగా మగ్గి హల్వా లాగా తయారవుతుంది.
       దీనిని ప్రతి రోజు ఒక అర టీ స్పూను తీసుకొని తింటూ వుంటే కీళ్లలో గుజ్జు పెరగడమే కాక వీర్య వృద్ధి, శక్తి 
వృద్ధి జరుగుతుంది.

 *3.-   కీళ్లలో_గుజ్జు_అరిగిపోతే_పెరగడానికి*

       తుమ్మ బంకను తెచ్చి రెండు చుక్కలు  నెయ్యి వేసి వేయించి , దంచాలి . దానికి సమానంగా కలకండ పొడిని కలపి
నిల్వ చేసుకోవాలి .

      ప్రతి రోజు ఉదయం , సాయంత్రం అర టీ స్పూను పొడి చొప్పున తిని పాలు తాగాలి
      ఈ విధంగా చేయడం వలన   కీళ్ళ మధ్య అరిగిపోయిన గుజ్జు బాగా పెరుగుతుంది

*4.-మోకాలి నొప్పి ఉపశమనం కోసం వ్యాయామం అవసరం*

సరైన పోషకాహారం తీసుకోవడం, బరువు తగ్గడం పై శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడం, చాలావరకు ఉపశమనాన్ని ఇస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. మోకాలి చుట్టూ ఉండే కండరాలు బలపడితే మోకాళ్ళ పై కొంతమేర ఒత్తిడి తగ్గి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఉన్నవారు మెట్లెక్కడం, ఏటవాలుగా ఉన్న ప్రదేశాలలో నడవడం వంటివి చేయకూడదని ఏరోబిక్స్, జుంబా వంటివి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. మోకాళ్ళు వంచి చేసే వ్యాయామాలు కూడా చేయకూడదని సూచిస్తున్నారు.

*5.-కుర్చీలో సింపుల్ గా చేసే వ్యాయామం*, నౌకాసనం, సూర్య నమస్కారాలు బెస్ట్

మోకాలి కండరాలను బలోపేతం చేసే నౌకాసనం వంటి ఆసనాలు వేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నౌకాసనం తో మోకాలి కండరాలు బలంగా మారడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాదు కుర్చీలో కూర్చుని చేసే సింపుల్ వ్యాయామాలు మోకాలి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయని అంటున్నారు. సూర్య నమస్కారాలు కూడా ఎంతో రిలీఫ్ ను అవుతుంది
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
     This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://m.facebook.com/story.php?story_fbid=760998455826987&id=100057505178618&mibextid=Nif5oz
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment