Tuesday 19 September 2023

కేశసౌందర్యానికి మంచి ఆహారం

*కేశసౌందర్యానికి మంచి ఆహారం*
--------------------------------------------
👉నువ్వులతో - కారం పొడి

కరివేపాకుతో కారంపొడి ఎలా చేసుకుంటామో అదేవిధంగా దోర వేయించిన నువ్వులు పొడి మిగిలిన పదార్థాలన్నీ కలిపి తయారు చేసిన  నువ్వుల కారం పొడి చాలా రుచికరంగా గొప్ప ఔషధం లాగా పనిచేస్తుం ది. ప్రతిరోజూ రెండుపూటలా ఆహారంలో పరిమితంగా కారంపొడి. వాడుతూవుంటే దీని వల్ల నల్లదనం వెంట్రుకలకు అందుతుంది

👉నువ్వుల లడ్డు - నూతన వెంట్రుకలు 

నువ్వులు, బెల్లం కలిపి చేసిన లడ్డు గానీ నువ్వుల జీడీలుగానీ నియమ  బద్ధంగా ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తింటూవును టే  వెంట్రుకలు అందంగా పెరగడమేకాక శరీరానికి శక్తికూడా పెరుగుతయ్ దృఢత్వం యవ్వన శక్తి కూడా పెరుగుతుంది. దీనిలో కాల్షియం అత్యధికంగా ఉంటది. పురుషుల సమస్యలు కు కూడా పనిచేస్తుంది

👉బాదంపాలు - భలేవెంట్రుకలు

బాదంపప్పులు నానబెట్టి పైతోలు తీసి చితక్కొట్టి ఎండించి దు పొడి దానికి సమంగా కండచక్కెర పొడి కలిపి వుంచుకొని రాత్రి నిద్రించే ముందు ఒక చెంచాపొడి ఒక గ్లాస్  వేడిపాలలో కలుపుకొని సేవిస్తుంటే బాదంలోని బలమైన శక్తి వెంట్రు కుదుళ్ళకు చేరి వెంట్రుకలను నల్లగా దృఢంగా నిగనిగ లాడి పోరి తీర్చిదిద్దుతయ్. అంతేగాకుండా, ఇంకా మెదడుకు, కళ్ళకు ఎముక కూడా బలమిస్తయ్. ముఖ్యంగా విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
👉 గోంగూర తో ఏ లా పచ్చడి చేసుకుంటామె  అదే విధంగా గుంటగలగరాకు తో పచ్చడి చేసుకుని వారానికి ఒకటి లేదా రెండు సార్లు పరిమితంగా కానీ ప్రతిరోజూ అయినా సరే తిని ఉంటే
 ఆహార ఔషధ ప్రభావము వలన దివ్యమైనది ఆరోగ్యం కలగడమే కాక క్రమంగా నెరసిన వెంట్రుకలు నల్లబడము బలమైన వెంట్రుకలు పలచగా ఉన్న జుట్టు దట్టంగా మారడం జరుగుతుంది ఒక సంవత్సరం పాటు విడవకుండా వాడగలిగితే ఆసక్తి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. 
👉 విధిగా ప్రతి రోజు వండుకునే కూరలో నువ్వుల నూనె తాళింపు పెడుతూ ఉంటే నువ్వుల నూనెలో ఉండే సహజమైన నల్లద నం ధృఢత్వం మెరుపు ద నం ఇవ్వన్ని  ఆహారం ద్వారా క్రమక్రమముగా లోని అనువనువు లోకి విస్తరిస్తూ వెంట్రుకలు అందంగా పెంచుతూ ఉంటాయి. 
💚💚💚💚💚💚💚💚💚💚💚

No comments:

Post a Comment