✍️ *అనారోగ్యాలకు మూలకారణం " *మలబద్దకం* " -
👉మీకు తెలీదు కానీ ఈ విరేచనం సరిగ్గా కాకపోవడం... మనకొచ్చే చాలా వ్యాధులకి కారణమవుతుంది.
👉 ఈ మలబద్దకాన్ని constipation అంటారు.
👉సాధారణంగా జీర్ణం తర్వాత మనం తిన్న ఆహారంలో మిగిలిపోయిన అవసరంలేని పదార్థాన్ని మలం అంటారు.
👉ఇది రోజుకు ఒకటి రెండుసార్లు బయటకు వెళ్ళిపోతుంది.
👉కొంత మందిలో మలం పూర్తిగా వెళ్ళకుండా ఉండలు ఉండలుగా కొద్దికొద్దిగా వెళుతూ ఉంటుంది.
👉ఆయుర్వేదం ఈ మలబద్దకానికి దూషించబడ్డ వాతం కారణమంటుంది. వాతం అంటే మన శరీరంలో కదిలే, కదిల్చే శక్తి. అది మార్పుచెందితే ఈ మలబద్దకం అనే సమస్య ఏర్పడుతుంది.
👉ఒక్కొక్కప్పుడు మలం గట్టిపడి, ఎండిపోయి వస్తూ ఉంటుంది. అది మన జీర్ణరసాల సామర్థ్యం తగ్గటంవల్ల వస్తుంది ఇది పిత్తదోషం వల్ల జరుగుతుంది.
👉అలాగే మలం బైటకెళ్ళేటప్పుడు కడుపులో నొప్పి రావడం, మలం జిగురుగా అంటుకుంటూ ఉండటం కఫ దోషానికి సూచన. దీంట్లో జిగురు కల్గిన పదార్థం మలద్వారాన్ని అడ్డుకోవటం వల్ల మలబద్దకం కలుగుతుంది..
✍️ *ఈ సమస్య ఎలా వస్తుంది?*
👉నోటిగుండా మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయి రక్తంలో కలియటానికి పీల్చ్చబడుతుంది
👉 మిగిలిన వ్యర్థపదార్థం పెద్దప్రేవుల ద్వారా కదులు తున్నప్పుడు ఆ ప్రేగు గోడలు దానిలోని నీటిని పీల్చే స్తాయి. ఆ మిగిలిన గట్టిపదార్థాన్ని మలం అంటాం
👉ఆ నీరు మరీ ఎక్కువగా పీల్చబడితే మలం బాగా రాయిలా అయి క్రిందకు జారదు. అదే మలబద్దకం.
✍️ *ఈ సమస్య రావడానికి కారణాలు:*
👉శరీరానికి తగ్గ వ్యాయామం కొంచెమైనా లేకపోవడం.
👉 జీవనశైలి మారడం,
👉వేగనిరోధం అంటే వస్తున్నట్లున్నా ఆపుకోవడం.
👉ఏ కారణంచేతనైనా ద్రవం శరీరంలో ఇంకిపోవడం.
✍️ *అలాగే ఈ క్రింది వ్యాధులు కూడా మలబద్దకం రావడానికి కారణమవుతాయి:*
👉పక్షవాతం, నరాలబలహీనత వంటి వ్యాధులు.
✍️ *ఈ సమస్య వల్ల కలిగే నష్టాలు:*
👉నోటిపూత, వికారం, వాంతులు, నాలుక తెల్లగా అవడం, బెరడుకట్టినట్లు ఉండడo
👉పాయువు దగ్గర పగులు, ఆర్శమొలలు ఏర్పడతాయి.
👉క్రిందభాగంలో చర్మం ముడుతలు పడుతుంది.
👉చాలాకాలం బాధపడితే మిగిలిన ఈ మలం విషంగా మారి కీళ్ళనొప్పులు, కాళ్ళు లాగటం వంటివి వస్తాయి.
👉గుండెల్లో మంట, ఎసిడిటి, త్రేన్పులు.
👉నిద్రపట్టకపోవడం, ఆదుర్దా, మానసిక గందరగోళం.
👉అనాస, మామిడి, సీతాఫలాలు మంచి విరేచనకారి.
👉మారేడుకాయలు పండిన తరువాత గుజ్జు చక్కటి సహజ మలబద్ధక నివారిణి.
👉త్రిఫలా చూర్ణం రోజూ రెండు చెంచాలు రాత్రి పడుకునేముందు వేడినీళ్ళతో తీసుకుంటే సుఖ విరేచనమవుతుంది.
👉బాగా మగ్గిన అరటిపండును తొక్కతో కలిపి తీసు కుంటే ఎటువంటి మలబద్దకమైనా తగ్గుతుంది.
👉ఒక స్పూన్ కరివేపపొడితో, తేనె కలిపి తీసుకున్నా మలబద్దకం పోతుంది.
👉ఒక చెమ్చా ఆముదాన్ని వేడిచేసి రాత్రిపూట తీసుకుంటే ఎలాంటి మలబద్దకమైనా తగ్గిపోతుంది.
👉మలబద్దకానికి మరో మందు బీట్రూట్ పచ్చిరసం.
👉ఎండుద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి పొద్దుటే పర గడుపున ఆ నీటితో సహా తీసుకోవాలి.
👉జామ, బొప్పాయి వంటి పళ్ళు మలబద్దకాన్ని తగ్గిస్తాయి.
👉ప్రతిరోజూ ఉలవల కషాయం తీసుకుంటే సుఖ విరేచనమవుతుంది.
👉గ్లాసు బార్లీనీళ్ళలో రెండు చెమ్చాల తేనె కలుపుకుని రోజూ త్రాగుతుంటే సుఖ విరేచనమవుతుంది
👉మసాలాలు, వేపుళ్ళు, ఫాస్ట్ఫుడ్స్, డబ్బాలలో నిల్వ ఉంచిన ఆహారం, ఊరగాయలు మానేయాలి.
👉 కాఫీ, టీ, ధూమపానం, మద్యపానం తగ్గించాలి.
👉రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి.
👉రోజూ తాజాపండ్లు లేక పండ్లరసాలు తాగాలి.
👉ప్రతిరోజూ ఉదయం చన్నీటి స్నానం.
👉ఉదయం పరకడుపున ఒకటి, రెండు. గ్లాసుల నీరు తాగడం లాంటివి చేయాలి.
పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. . అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.
✍️ *విన్నపం:*
* ఈ విలువైన సమాచారాన్ని షేర్ చేయడం మరవకండి. ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు.
✍️సమస్య ఏదైనా ఒకసారి మాతో చర్చించండి. మా వంతు సహాయంగా మీకు విలువైన ఆరోగ్య సలహాలు ఇవ్వబడును.
Cell. *9949363498*
🙂 *అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి* 🙂
No comments:
Post a Comment