Wednesday 27 September 2023

గోంగూర ఆరోగ్యం

*🌱గోంగూర ఆరోగ్యం🌱*


గోంగూరతో చేసే వంటకాలు చాలా ప్రత్యేకం. గోంగూరతో ఏ వంట చేసినా.. నోరూరాల్సిందే. ఇందులో దేశవాళీ గోగు, పుల్ల గోగు అని రకాలు ఉంటాయి. గోంగూరలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌-ఎ, సి, రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, పీచు ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఐరన్‌ అధికం. ఇలా గోంగూరలో పలు ఔషధ గుణాలున్నాయని పరిశోధకులు చెబుతారు. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంతో నూరి, వెచ్చగా చేసి వేస్తే త్వరగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట సరిగా చూపు కనపడక పోవటం, రేచీకటిలాంటి సమస్యలతో బాధపడేవారు భోజనంలో ఆకుకూరగానో,పచ్చడిగానో,ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. విరోచనాలు అధికంగా అవుతుంటే కొండ గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి, తాగితే ఫలితముంటుంది. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూరను అన్నంతో తిన్నా విరోచనాలు తగ్గిపోతాయి. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఆహారంలో తీసుకుంటే స్వస్థత ఉంటుంది. శరీరంలో నీరు చేరినప్పుడు గోంగూర మేలు చేస్తుంది. అయితే అధిక ఉష్ణ శరీరతత్వం ఉన్నవారు గోంగూరను మితంగా తింటేనే మంచిది.

💠💠💠💠💠💠💠

No comments:

Post a Comment