Sunday, 3 September 2023

మానసిక ఆరోగ్య సమస్య అనగాఏమిటి? ఈ సమస్య ఎందుకు వస్తుంది ? తగ్గాలి అంటే ఏమిచెయ్యాలి?

*👆Psychiatry Awareness.  4.9.2023.*
*మానసిక ఆరోగ్య సమస్య అనగాఏమిటి? ఈ సమస్య ఎందుకు వస్తుంది ? తగ్గాలి అంటే ఏమిచెయ్యాలి?నవీన్ నడిమిటి వైద్య నిలయం సలహాలు*
మీ మనసుకు నచ్చిన పని చెయ్యండి ….. అది ఎవరిని బాధించనంతవరకు (మీరు సంతోషంగా ఉంటే బాధపడేవారి గురించి కాదు)

మీరు ఏది చేసినా అందులో తప్పులు వెతుకుతూ … మీ చేతగానితనం అని ఎత్తి చూపేవారికి దూరంగా ఉండండి ….

అనవసరమైన వాగ్వివాదాలకు దూరంగా ఉండండి … ముఖ్యంగా కయ్యానికి కాలుదువ్వేవారికి….

మీ కంటూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోండి …. మీ మనసు మీకు తెలియకుండానే మీ లక్ష్యం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది ….

కుదిరితే దూర ప్రయాణాలు చెయ్యండి … వీలైతే ఒంటరిగా వెళ్ళండి ..… మిమ్మల్ని మీరు అర్ధం చేసుకునే వీలు కలుగుతుంది ….

మీకు ఇష్టమైన వారితో ..మిమ్మల్ని ఇష్టపడేవారితో ……తరచూ మాట్లాడండి …..

నేను… నాది …. అనే ఆలోచలను పక్కనెట్టి… మనము …మనది …అనే ఆలోచనలవైపుకు మనసును మళ్లించండి …..

మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారితో సమయాన్ని గడపండి … వారికన్నా గొప్ప మానసిక వైద్యులు ఎవరూ లేరు …. !!!
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
వైద్య నిలయం లింక్స్
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment