🩺 ఆరోగ్య దీపిక 🩺
తమలపాకు ఆరోగ్య ఔషధం
భోజనం అరగడానికి మాత్రమే అనుకుని నమిలే తమలపాకును ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధులకు ఔషధంలా వాడతారు ఆయుర్వేద వైద్యులు. దీన్నే నాగవల్లి అనీ పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, థైమీన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, కెరోటిన్.. వంటి విటమిన్లతోబాటు కాల్షియం కూడా సమృద్ధిగా లభ్యమవ్ఞతుంది.
ఇది జీవక్రియావేగాన్ని పెంచడంతో పాటు కొవ్ఞ్వని తగ్గిస్తుంది. మధుమేహం, ఊబకాయం తగ్గడానికి ఎంతో దోహదపడుతుంది. నోటి క్యాన్సర్లనీ అడ్డుకుంటుంది. ఈ ఆకుని నోట్లో పెట్టుకోగానే మండినట్లుగా అనిపించడానికి కారణం అందులోని చవికాల్ అనే ఫినాలిక్ పదార్థమే. ఇది యాంటీసెప్టిక్ గా పనిచేసి పుండ్లను నివారిస్తుంది. అందుకే దీన్ని గాయాలూ, కాలిన పుండ్లమీద పెట్టి కట్టుకడితే త్వరగా తగ్గుముఖం పడతాయి.
తీవ్రమైన తలనొప్పితో బాధపడేవాళ్లు ఈ ఆకులు నమిలితే ఫలితం ఉంటుంది. లేదా దీని రసాన్ని నుదుట పట్టించినా నొప్పి తగ్గుతుంది. – బాగా అలసటగా అనిపించినప్పుడు తమలపాకు రసంలో టీస్పూను తేనె వేసి రోజుకి రెండుసార్లు తీసుకుంటే మంచి టానిక్‌లా పనిచేస్తుంది. తరచూ జలుబూదగ్గులతో బాధపడే పిల్లలకి గోరువెచ్చని ఆవనూనెలో తమలపాకుల్ని నానబెట్టి ఛాతిమీద పెడితే వెంటనే తగ్గుముఖం పడుతుంది. కాల్షియం లోపంతో బాధపడే వాళ్లు రోజుకి రెండు ఆకుల చొప్పున వరసగా మూడునెలలు తింటే ఫలితం కనిపిస్తుంది. రెండుటేబుల్ సూన్ల కొబ్బరినూనెలో టీస్పూను తమలపాకు రసం కలిపి ఒంటికి పట్టించి పావ్ఞగంట తరవాత వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి. ఆర్థ్రయిటీస్, కీళ్లనొప్పులతో బాటు గాయాలూ పుండ్లతో బాధపడేవాళ్లు తమలపాకు రసాన్ని ఆయా భాగాల్లో రాసి, దానిమీద తమలపాకుని అంటించి కట్టుకడితే తగ్గుముఖం పడతాయి.
సేకరణ
శ్రీనివాస ఆచార్య విశ్వకర్మ
No comments:
Post a Comment