*👆Paracetamol Awareness.27.9.2023.*
*పారాసెటమాల్ టాబ్లెట్ల గురించి ఇవి తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు..జాగ్రత్త!అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
పారాసెటమాల్.జ్వరం వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ మొదట వేసుకునే టాబ్లెట్ ఇదే.
పైగా ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో.దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఏం ఉన్నా లేకపోయినా పారాసెటమాల్ టాబ్లెట్ షీట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి.
*జ్వరానికే కాకుండా దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలకు సైతం పారాసెటమాల్ టాబ్లెట్లను విరి విరిగా వాడేస్తున్నారు.అయితే పారాసెటమాల్ టాబ్లెట్లను విచ్చలవిడిగా వేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.*
పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్న వెంటనే జ్వరం తగ్గకుంటే మళ్లీ మరో టాబ్లెట్ వేసుకోవడం చేయరాదు.అలాగే జ్వరం వచ్చిన నాలుగు నుంచి ఆరు గంటల మధ్య వ్యవధిలో *పెద్దలకైతే 650 మిల్లీ గ్రాములు, పన్నెండు సంవత్సరాలు వయస్సు అంత కన్నా లోపు ఉన్న పిల్లలకైతే 15 మిల్లీ గ్రాముల పారాసెటమాల్ మోతాదును ఇవ్వాలి.*
ఇవేమి పాటించకుండా వీటిని ఎలా పడితే అలా వాడితే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా పారాసెటమాల్ టాబ్లెట్లను పరిమితికి మించి తీసుకోవడం వల్ల అధిక చెమటలు, మోషన్స్, కళ్లు తిరగడం, వాంతులు, చర్మ సంబంధిత సమస్యలు, ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి, అలర్జీలు వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.అలాగే పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లలో స్టెరాయిడ్స్ ఉంటాయి.అందువల్ల వీటిని అధికంగా తీసుకుంటే మూత్ర పిండాలు, కాలేయం వంటి అవయవాలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఒకవేళ మూత్ర పిండాలు, కాలేయం సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న వారైతే.వైద్యులను సంప్రదించకుండా పారాసెటమాల్, డోలో, క్రోసిన్ వంటి టాబ్లెట్లను పొరపాటున కూడా వేసుకోరాదు.సో.ఇకపై పారాసెటమాల్ టాబ్లెట్ల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించకండి.
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment