Thursday 28 September 2023

_మద్ది ( TERMINALIA ARJUNA) అర్జున

*_మద్ది ( TERMINALIA ARJUNA) అర్జున :_* *_ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు. దీనిని ‘మద్ది’ అని కూడా అంటారు. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. వీటితో ఏదెైనా ఒకదాని బెరడు నూరి ఆ మూలకమును వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములెైనా తగ్గిపోతాయి._*

*_బెరడును కోస్తే తెల్లని స్రావం వస్తుంది._*

*_ఈ ఆకు తెలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది._*

*_అర్జున బెరడులో కాల్షియం, అధికంగా ఉంటుంది. అల్యూమినియ మెగ్నీషియం కూడా ఉంటాయి. అర్జునిన్, లాక్టోజ్, అర్జునెంటిన్అనే రసాయనాలు ఉంటాయి._*

*_దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది "కార్డియాక్ టానిక్ " గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. ఇది ఇతర రకాలైన నొప్పులలో ఉపయోగపడుతుంది. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది.ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది. ఇదే కాకుండా నొప్పి మందుల వలన కడుపులో పుండు నుండి రక్షిస్తుంది._*

*_అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల వారికి ఉపశమనంగా ఉంటుంది._*

*_అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి._*

*_నడి వయసు స్త్రీలలో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ అనే సమస్యకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది.అర్జునలో ఉన్న నేచురల్ కాల్షియం వలన ఈ ఉపయోగాలున్నాయి._*

*_అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యవర్థకం. ఎముకలపుష్టి,బీపీ ,గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది._*

*_అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని  మంచుకు పెట్టి తింటే ఆస్తమా తగ్గుతుంది._*

*_ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి._*

*_అర్జునబెరడు కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి._*
 *మా వద్ద tablets , కషాయానికి బరక చూర్ణం దొరుకుతుంది
Call.9949363498* 
*_ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది._*

No comments:

Post a Comment