Thursday, 12 October 2023

అరికాళ్ళ_మంటలు_ఎందుకు_వస్తాయి?

*అరికాళ్ళ_మంటలు_ఎందుకు_వస్తాయి?*
*ఆయుర్వేదం లో  Naveen Nadiminti సలహాలు*
     
          సాధార‌ణంగా ఎక్కువ శాతం మంది అరికాళ్ల మంట‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. రకరకాల కారణాల వలన ఈ సమస్యని ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూ ఉంటారు. అరికాళ్లు మంట‌లు అంటే న‌రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌. అరికాళ్లు వ‌ర‌కు న‌రాలు ప‌నిచేసేట‌ప్పుడు వాటి శ‌క్తి త‌గ్గుతుంది. వీటివలన వేడిగా, సూదులు గుచ్చినట్లుగా నొప్పులతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. వాస్త‌వానికి అవయవాలకు రక్త ప్రసరణ తక్కువగా జరగడంవలన ఈ పాదాల మంటలు ఏర్పడతాయి.

అదే విధంగా యంగ్ ఏజ్‌లో విట‌మిన్ బి12 లోపించ‌డం వ‌ల్ల వ‌స్తుంది. విట‌మిన్ బి12 త‌గ్గిపోతే ఇలా కాళ్లు మండుతాయి. ఇంకొ ముఖ్య కార‌ణం డ‌యాబెటీస్‌. షుగ‌ర్ ఉన్న‌వాళ్ల‌కి కూడా అరికాళ్లు మండుతాయి. మూడ‌వ‌ది వెన్నుపూస అరిగిపోవ‌డం. ఇలా ఎన్నో కార‌ణాల వ‌ల్ల అరికాళ్లు మంట‌లు వ‌స్తాయి. దీనికి చెక్ పెట్టాలంటే

రక్తంలో అధిక చక్కెర డయాబెటిక్ కారణమవుతుంది. అది మీ చేతులు మరియు కాళ్ళ నుండి సంకేతాలను పంపే నరాలను దెబ్బతీస్తుంది. ఈ డయాబెటిక్ న్యూరోపతి మీ వేళ్లు, కాలి, చేతులు మరియు పాదాలలో తిమ్మిరి లేదా జలదరింపును కలిగిస్తుంది. మరొక లక్షణం అరికాళ్ళలో మంటలు లేదా సూదులతో గ్రుచ్చిన నొప్పి. దీని ని డయాబెటిక్ నరాల నొప్పి అని కూడా అంటారు.
వైద్య సలహాలు కోసం
https://m.facebook.com/story.php?story_fbid=801362648457234&id=100057505178618&mibextid=Nif5oz

బర్నింగ్ పాదాలకు, కారణం విటమిన్ బి 12 లోపం అయితే, ఈ లక్షణమే నరాల నష్టం సంభవిస్తుందని సూచిస్తుంది. విటమిన్ బి 12 లోపం అలానే కొనసాగితే, ఆ నరాలలో కోలుకోలేని మార్పులు ఒస్తాయి. మద్యపానంతో సంభవించే అరికాళ్ళలోని మంటలు విటమిన్ బి 1 లోపం వల్ల ఏర్పడతాయి.

*#ఈ_సమస్యకు_ఏమి_చేయవచ్చు??*

1.-పాదాలను చల్లని నీటిలో కనీసం 15 నిమిషాలు నానబెట్టండి. ఇది తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు.
పాదాలను వేడికి దూరంగా ఉంచండి.
2.-పడుకునేటప్పుడు మీ కాళ్ళు మరియు కాళ్ళను కాస్త ఎత్తులో పెట్టండి.
3.-మెడికల్ షాపులో దొరికే నొప్పిని తగ్గించేందుకు మందులు (అనాల్జిసిక్స్) తీసుకోండి.
4.-మంటలు తగ్గడానికీ ఆయింట్మెంట్లు వాడండి.
వీటితోపాటుగా డాక్టర్ గారితో సంప్రదించి షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుని మందులు క్రమం తప్పకుండా వాడాలి.

5.-గోరువెచ్చని నీటిలో అరికాళ్ళను ఉంచితే పావుగంటలో అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. ఈ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే పాదాల నొప్పులు కూడా తగ్గిపోతాయి.

6.- ప్రతిరోజూ పది నిమిషాలు అల్లం రసం, ఆలివ్‌ లేదా కొబ్బరినూనె కలిపిన వెచ్చని మిశ్రమంతో పాదాలను, కాళ్లను మర్దన చేయటం వలన నొప్పి తగ్గుతుంది. రక్త ప్రసరణ చురుగ్గా జరిగి ఉపశమనం కలుగుతుంది.

7.-- విటమిన్‌ బి3 పుష్కలంగా ఉన్న గుడ్డు పచ్చసొన, పాలు, బఠాణీలు, చిక్కుళ్ళు వంటి పోషక ఆహార వినియోగాన్ని పెంచడం వలన పాదాల మంటలకు ఒక సాధారణ సహజపద్ధతిలో నివారణ కలుగుతుంది.

9.- ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాన్ని ముఖ్యంగా పత్తులు, నట్స్‌, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవటం వలన క్రమంగా అరికాళ్ళ మంటలు తగ్గుతాయి.

10- వ్యాయామాలు, మసాజ్‌ వాకింగ్‌, జాగింగ్‌, పరిగెత్తటం వంటి రెగ్యులర్‌ వ్యాయామాలు ఖ‌చ్చితంగా చేయటం వల్ల‌ కాళ్ళ మంటలు తగ్గుతాయి.

*నడుమునుండి_అరికాలు_మడము_వరకు_విపరీతమైన_నొప్పి_కారణము?*
నడుము నుండి అరికాలు మడమ వరకు విపరీతమైన నొప్పి అన్నారు పై లక్షణాన్ని అనుసరించి లేదా పై లక్షణాన్ని ఆధారంగా దాని యొక్క నొప్పి తీవ్రత మరియు మరికొన్ని వైద్య పరీక్షలు( not CT and MRI) ద్వారా సమస్య ఏమిటనేది ఖచ్చితమైన నిర్ధారణకు రావడం…, తరువాత అందుకు తగ్గ పరిష్కారాలను కనుగొనడం జరుగుతుంది. కచ్చితంగా పై సమస్యకైతే మామూలు వైద్యం(Orthopaedic doctor) తో పాటుగా ఫిజియోథెరపీ మరియు మీ దైనందిన జీవన విధానంలో ( your daily life style)మార్పులు ,చేర్పులు చేస్తూ …, దీర్ఘకాలిక పరీక్ష మరియు పరిశీలన( regular basis of follow up s with throught medical examination under therapist supervision) ద్వారా పై సమస్యను పూర్తిగా కాకపోయినను …., కొన్ని సంవత్సరముల పాటు వాయిదా వేయవచ్చు అది పెద్దగా ఇబ్బంది కలగకుండా …! *ధన్యవాదాలు…!🙏*
మీ Naveen Nadiminti,
*ఫోన్ 097037 06660,*
       
మన గ్రూపులో  పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment