Monday 30 October 2023

పక్షవాతం

పక్షవాతం ::శరీరములోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను 'పక్షవాతము' (Paralysis) అంటారు. శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరిగి పోవడం, కాళ్లు చేతులు మెలితిరిగి పోవడం, గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాతప్రభావం ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి వారి జీవిత కాలంలో పక్షవాతం వస్తోంది.పక్షవాతం.. ప్రస్తుతం సమాజంలో అప్పటివరకు సంతోషంగా గడిపిన వారు, అప్పటికప్పుడు ఉన్న పళంగా కుప్పకూలిపోతున్నారు. కాళ్లు చేతులు చచ్చుబడిపోయి వికలాంగుల్లా మారుతున్నారు. అందుకు కారణం పక్షవాతం. పక్షవాతం ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తుంది. ఎంతోమందిని బతికుండగానే జీవశ్చవాలుగా మార్చి మంచానికి పరిమితం చేస్తుంది. అసలు ఈ పక్షవాతం ఎందుకు వస్తుంది? పక్షవాతం లక్షణాలను గుర్తించడం ఎలా? వంటి అనేక విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాం.ఆందోళనకరంగా పెరుగుతున్న పక్షవాతం బాధితులు
మన దేశంలో లక్ష మందికి సగటుగా 150 మంది పక్షవాతం బారిన పడుతున్నట్టుగా అంచనా. ఇక ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత పోస్ట్ కోవిడ్ సమస్యలలో భాగంగా చాలామంది పక్షవాతం బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి కారణంగా, ఉద్యోగాలలో రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడి కారణంగా చిన్నచిన్న వయసుల వారి పక్షవాతం బారిన పడటం ప్రధానంగా కనిపిస్తుంది.

ఇక పక్షవాతం రెండు రకాలుగా వస్తుంది. ఒకటి మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాలలో అవరోధాలు ఏర్పడడం వల్ల వస్తుంది. దీనిని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఎక్కువ శాతం బ్రెయిన్ స్ట్రోక్ కేసులలో 85% ఈ తరహా కేసులే ఉంటాయి. రెండవది హేమరేజిక్ స్ట్రోక్ మెదడులో రక్తనాళాలు పోవడం వల్ల రక్తస్రావం జరిగి ఇది వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ కేసులలో ఈ తరహా కేసులు 15% మాత్రమే.పక్షవాతం రావటానికి కారణాలు ఇవే
పక్షవాతం ముఖ్యంగా మధుమేహం, రక్త పోటు ఉన్నవారిలో అవి నియంత్రణలో లేకపోతే వస్తుంది. ఇంకా ధూమపానం, మద్యపానం, ఊబకాయం వంటి కారణాలతో పాటు, వారసత్వ లక్షణాలలో భాగంగా కూడా కొంతమందికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. పక్షవాతం రాకుండా ఉండాలి అంటే కచ్చితంగా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా 50 సంవత్సరాలు వయసు దాటుతున్న వారిలో పక్షవాతం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి పక్షవాతం విషయంలో ఎప్పటికప్పుడు బీపీ, షుగర్ కంట్రోల్ లో ఉందా లేదా చెక్ చేసుకుంటూ జాగ్రత్త వహించాలి. లేదంటే పక్షవాతం బారిన పడే అవకాశం ఉంటుంది.ఊబకాయంతోనూ డేంజర్ ..
ఇక అంతే కాదు ఊబకాయంతో కూడా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఊబకాయంతో బాధపడేవారు ప్రతిరోజు వ్యాయామం చేసి శరీర బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మన శరీర పరిస్థితిని బట్టి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. డాక్టర్లు సలహాలు సూచనల మేరకు మందులు వాడాలి. ఇవేవీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే ఊబకాయం కూడా పక్షవాతానికి కారణం కావచ్చు.పక్షవాతం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి
పక్షవాతం రాకుండా జాగ్రత్త పడటం కోసం ముఖ్యంగా బీపీ 140/80 కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మధుమేహంతో పాటు ఇతరత్రా వ్యాధులు ఉన్నవారు ఎప్పటికప్పుడు బీపీని, మధుమేహాన్ని పరిశీలించుకోవాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. రక్తంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవారు కూడా, కొవ్వు తగ్గడం కోసం డాక్టర్లను సంప్రదించి మందులను వాడాలి. ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఆహారంలో ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు బదులు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.పక్షవాతం వారికే ఎక్కువగా వచ్చే అవకాశం
ఇక పక్షవాతం వచ్చే అవకాశం మహిళలలో కంటి పురుషులలోనే ఎక్కువగా ఉంటుంది. అధిక శాతం పురుషులు ధూమపానం మద్యపానం చేస్తూ ఉండటం వల్ల, వారే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతారు. ఇక 50 ఏళ్లు పైబడిన వారిలో పక్షవాతం వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే 70 ఏళ్లు పైబడిన స్త్రీ పురుషులలో సమానంగా పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

No comments:

Post a Comment