*చర్మం తొడలు గజ్జలో పై ముఖం పైనా పులిప్రల్లు పోవాలి అంటే నవీన్ నడిమింటి వైద్య సలహాలు*
పులిపిర్లు శాశ్వతంగా పోవడానికి ఈమ్ చేయడం ఒక మార్గం. పులిపిర్లకు కారణమయ్యే హ్యూమన్‌పాపిలోమావైరస్ (HPV) నుండి రక్షించడానికి ఈమ్‌లు రూపొందించబడ్డాయి. పులిపిర్లు ఇంకా పెరగకముందే ఈమ్‌లు వాటిని నివారించడంలో సహాయపడతాయి. అయితే, పులిపిర్లు ఇప్పటికే ఉన్నట్లయితే, ఈమ్‌లు వాటిని తొలగించడంలో సహాయపడవచ్చు, కానీ అవి శాశ్వతంగా పోవడానికి ఖచ్చితంగా హామీ ఇవ్వవు.
*ముఖంపై పులిపిర్లను తొలగించడానికి ఉపయోగించే కొన్ని సాధారణ ఈమ్‌లు:*
*1.-Aldara (imiquimod):* ఇది ఒక అలర్జీ ప్రతిచర్యను రేకెత్తిస్తుంది, ఇది పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది.
*2.-Cidofovir (Visudyne):*
ఇది పులిపిర్ల కణాలను చంపడానికి సహాయపడే ఒక యాంటీవైరల్ మందు.
*3.-Imiquimod (Aldara):* ఇది పులిపిర్ల కణాలను చంపడానికి సహాయపడే ఒక యాంటీవైరల్ మందు.
*4.-Podofilox (Condylox):*
ఇది పులిపిర్లను నాశనం చేయడానికి సహాయపడే ఒక క్రిమిసంహారక.
*5.-Trichloroacetic acid (TCA):*
ఇది పులిపిర్లను నాశనం చేయడానికి సహాయపడే ఒక ఆమ్లం.
ఈమ్‌లను ఉపయోగించడానికి ముందు, మీరు మీ వైద్యుడితో మాట్లాడాలి. వారు మీకు ఏ ఈమ్ మీకు సరైనదో మరియు దానిని ఎలా సురక్షితంగా ఉపయోగించాలో సలహా ఇవ్వగలరు. దయచేసి ఉత్తమ ఆఫర్‌లు, డీల్‌లు, లూట్ ఆఫర్‌ల కోసం మా డీల్స్ స్టోర్‌ని సందర్శించండి మరియు
పులిపిర్లను తొలగించడానికి *ఈమ్‌లతో పాటు, మీరు క్రింది వాటిని కూడా ప్రయత్నించవచ్చు*
*హెర్బల్ ట్రీట్మెంట్స్:* కొన్ని హెర్బల్ ట్రీట్మెంట్‌లు, వంటి టీట్రీ ఆయిల్ మరియు బే ఆయిల్, పులిపిర్లను తొలగించడంలో సహాయపడతాయి.
*మెడికేషనల్ ట్రీట్మెంట్స్:* మీ వైద్యుడు పులిపిర్లను తొలగించడానికి టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లను కూడా సూచించవచ్చు.
*పులిపిర్లను నివారించడానికి, మీరు క్రింది వాటిని చేయవచ్చు:*
మీ చేతులను తరచుగా కడగాలి.
గాయాలు లేదా గీతాలను కవర్ చేయండి.
మీ శరీరాన్ని కవర్ చేయడానికి దుస్తులు ధరించండి.
పులిపిర్లు చాలా సాధారణమైనవి మరియు చాలా సందర్భాల్లో హానికరం కావు.వైద్య సలహాలు కోసం
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0egkENo6yWNxwkGX8vwdYcXVoXrip39EABVRaFW4o9TGjDNCV1xaZVK9pU4f5cWWxl&id=100057505178618&mibextid=Nif5oz
*తొడలు,గజ్జల్లో పులిపిరాళ్లు వచ్చే భయంకరమైన గజ్జి,తామర,దురద నివారణ కు నవీన్ నడిమింటి సలహాలు*
మనం కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు.. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. వీటిని చాలావరకు నివారించుకోవచ్చు. ఒకవేళ వచ్చినా తగు చికిత్సలతో తీవ్రం కాకుండానూ చూసుకోవచ్చు. అయితే వీటిని సత్వరం గుర్తుపట్టి..
చర్మం మన శరీరంలోనే అతిపెద్ద అవయవం. చూడటానికి ఒకేటేనని అనిపించినా ఇది మూడు పొరల సమాహారం. పైపొర- ఎపిడెర్మిస్ నిరంతరం కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేస్తూ చర్మం నవయవ్వనంతో కళకళలాడేలా చేస్తుంటుంది. రెండోపొర- డెర్మిస్ అవసరమైన పోషకాలు అందేలా చూస్తూ చర్మం నిగనిగలాడటానికి తోడ్పడుతుంటుంది. ఇక అన్నింటికన్నా అడుగున ఉండే సబ్‌క్యుటేనియస్ పొర- శరీరాన్ని వేడిగా ఉంచుతుంటుంది. ఇవన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ.. హానికారక సూక్ష్మక్రిముల బారినపడకుండా నిరంతరం కాపాడుతుంటాయి. చిత్రమేంటంటే.. చర్మం మీద కూడా బోలెడన్ని సూక్ష్మక్రిములుంటాయి. ఇవి చర్మకణాలతో కలిసిపోయి, వాటితో సహ జీవనం చేస్తూ.. హానికారక క్రిములను నిలువరిస్తూ.. ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండానూ చూస్తాయి. అయితే కొన్నిసార్లు ఇవి అదుపు తప్పి పోవచ్చు. లేదూ ఇతరత్రా సూక్ష్మక్రిములను అడ్డుకోలేకపోవచ్చు. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. దీంతో నీటి పొక్కులు, చీము పొక్కులు, పులిపిర్లు, గజ్జి వంటి పలు సమస్యలు ముంచుకొస్తుంటాయి. తగు చికిత్స తీసుకోకపోతే కొన్ని తీవ్ర సమస్యలుగానూ పరిణమిస్తాయి. కాబట్టి వీటిపై అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. చాలావరకు వీటిని కంటితో చూసే గుర్తుపట్టొచ్చు కూడా.
*1.-ముత్యం పొక్కులు (మొలస్కం కంటాజియోజమ్)*
ముత్యాల్లా లేదా లేత గులాబీ రంగు పొక్కులతో వేధించే సమస్య ఇది. పొక్కుల మధ్యలో సొట్ట ఉండటం వీటి ప్రత్యేకత. వీటి లోపల నీరుండదు. తాకితే గట్టిగా తగులుతాయి. దురద, మంట వంటివేవీ ఉండవు. పొక్కులు సూది మొన సైజు నుంచి బఠాణీ గింజ సైజు వరకూ ఉండొచ్చు. సాధారణంగా ముఖం, కడుపు, కాళ్లు, చేతులు, మెడ మీద ఇవి వస్తుంటాయి. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా ఎవరికైనా రావొచ్చు. కాకపోతే పిల్లల్లోనే ఎక్కువ. దీనికి మూలం మొలస్కం కంటాజియోజమ్ వైరస్. పొక్కులను నేరుగా తాకటం.. పొక్కులు గలవారు వాడిన బొమ్మలు, వస్తువులు, దుస్తుల వంటివి వాడటం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. చేత్తో గీరి మరో చోట తాకినా కూడా పొక్కులు బయలుదేరొచ్చు. వ్యాక్సింగ్, థ్రెడింగ్ వంటి సౌందర్య ప్రక్రియల్లో వాడే సాధనాలు.. సెలూన్లలో వాడే బ్లేడ్ల వంటివి సరిగా శుభ్రం చేయకపోయినా ఇతరులకు వ్యాపించొచ్చు. ఒకరకం మొలస్కం ఇన్‌ఫెక్షన్ లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. దీంతో జననాంగాల వద్ద పొక్కులు ఏర్పడతాయి.
*👉🏿చికిత్స:*
సాధారణంగా 2 నెలల్లో పొక్కులు తగ్గిపోతాయి. కానీ కొందరిలో నాలుగేళ్ల వరకూ కొనసాగుతూ వస్తుండొచ్చు. వీరికి ట్రైక్లోరోఅసిటిక్ ఆమ్లం లేదా పొటాషియం హైడ్రాక్సైడ్‌ను పొక్కుల మీద పెడితే కొద్దిరోజుల్లోనే వూడిపోతాయి. అయితే వీటితో మచ్చలు ఏర్పడొచ్చు. అందువల్ల అవసరమైతే లేజర్, క్రయోథెరపీలు చేస్తారు. ఇమికోమిడ్, క్యాంథార్డిన్ వంటి మలాములు కూడా పొక్కులు తగ్గటానికి ఉపయోగపడతాయి. సూదితో పొక్కును పెకిలించినా వూడి వచ్చేస్తాయి. ఇది చాలా తేలికైన పద్ధతి.
*2.-శోభి మచ్చలు/క్షుబ్బెం(టీనియా వెర్సికోలర్)*
తెల్లగా లేదా వూదారంగు మచ్చలతో ఇబ్బంది పెట్టే సమస్య శోభి. దీన్నే టీనియా వెర్సికోలర్ అంటారు. రకరకాల సైజుల్లో ఉండే ఇవి కొందరిలో చిన్న బిందువుల్లా ఏర్పడితే.. మరికొందరిలో పటం మాదిరిగా విస్తరిస్తుంటాయి. ఇవి ఎక్కువగా ఛాతీ, వీపు, భుజాలపై, చంకల్లో కనబడుతుంటాయి. కొందరిలో ముఖం మీదా రావొచ్చు. చూడటానికి ఇబ్బందిగా అనిపించటం తప్ప ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఒకరి నుంచి మరొకరికి అంటుకోవు కూడా. మనతో పాటే సహజీవనం చేసే మాలాసెజియా పర్పర్ అనే ఫంగస్ మూలంగా శోభి మచ్చలు ఏర్పడతాయి. ఈ ఫంగస్ చెమట, నూనె అధికంగా విడుదలైనప్పుడు మరింతగా వృద్ధి చెందుతుంది. దీంతో చర్మం రంగు మారి మచ్చలు తలెత్తుతాయి.
*👉🏿 శోభి మచ్చలకు చికిత్స*
చాలా తేలిక. సెలీనియం సల్ఫైడ్, కీటోకొనజోల్ వంటి యాంటీ ఫంగల్ లోషన్లు, షాంపూలను క్రమం తప్పకుండా వాడితే 2, 3 వారాల్లోనే పూర్తిగా తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గకపోతే ఫ్లూకోకొనజోల్, హైడ్రోకొనజోల్ వంటి మాత్రలు కొద్దిరోజుల పాటు వేసుకోవాల్సి ఉంటుంది.
*3 -సెగ్గడ్డలు (బాయిల్స్)*
సెగ్గడ్డలంటే తెలియని వారుండరు. తీవ్రమైన నొప్పి, మంట, ఎరుపుతో వేధించే వీటిని చాలామంది వేడి గడ్డలని భావిస్తుంటారు. మామిడిపండ్ల వంటివి తినటం వల్ల వస్తాయని అనుకుంటుంటారు. కానీ వీటికి మూలం స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియా. వెంట్రుకల కుదుళ్లలో ఇన్‌ఫెక్షన్ తలెత్తినపుడు ముందు చిన్న చీము పొక్కులు ఏర్పడి.. క్రమంగా పెద్దగా అవుతాయి. చర్మంపై గాట్లు, చెమట ఎక్కువగా పోయటం, బాగా ఒత్తిడి పడటం వంటి సందర్భాల్లో చర్మం మెత్తబడి.. అక్కడ్నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది. ఇది ఇన్‌ఫెక్షన్‌కు దారితీసి గడ్డలు ఏర్పడతాయి. చీము బయటకు వెళ్లిపోయేంతవరకూ నొప్పి వేధిస్తుంది. పిరుదులు, తొడలు, చుబుకం, తల, ఛాతీ, వీపులో తరచుగా సెగ్గడ్డలు ఏర్పడుతుంటాయి. వూబకాయలు, మధుమేహులు, రోగనిరోధకశక్తి క్షీణించినవారికి, ఎక్కువసేపు కూచొని పనిచేసేవారికి వీటి ముప్పు ఎక్కువ. మధుమేహుల్లో సెగ్గడ్డలు తీవ్రమై రాచపుండుగానూ (కార్బంకుల్) మారొచ్చు.
*👉🏿 చికిత్స:*
ఆమాక్జసిలిన్ వంటి యాంటీబయోటిక్ మందులు బాగా ఉపయోగపడతాయి. వీటిని పూర్తికాలం వాడితే కొద్దిరోజుల్లోనే నయమవుతాయి.
నివారణే కీలకం
చర్మ ఇన్‌ఫెక్షన్లు వచ్చాక బాధపడేకన్నా నివారించుకోవటమే ఉత్తమం. ఇందుకు శుభ్రత చాలా కీలకం. ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డవారికి దూరంగా ఉండటం.. వీరి వస్తువులు, దుస్తులు, దుప్పట్ల వంటివి వాడకుండా చూసుకోవటం.. తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవటం మంచిది. గజ్జి, సెగ్గడ్డలతో బాధపడేవారు తమ దుప్పట్లు, దుస్తులను వేడి నీటిలో ఉతికిన తర్వాతే వాడుకోవాలి. హెచ్‌పీవీ నివారణకు టీకా అందుబాటులో ఉంది. దీన్ని యుక్తవయసులోనే బాలికలకు ఇప్పిస్తే వైరల్ వార్ట్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే అసురక్షిత లైంగిక సంపర్కం, ముఖరతికి దూరంగా ఉండాలి.
*4 -తామర (రింగ్‌వామ్)*
ఎర్రగా, గుండ్రటి రింగులా ఏర్పడే పొక్కులు.. దురదతో తామర తెగ వేధిస్తుంది. హాస్టళ్లలో చేరేవారు పెరుగుతుండటంతో ఇది ఇటీవల చాలా ఎక్కువగా కనబడుతోంది. ఒకే గదిలో ఎక్కువమంది ఉండటం.. ఒకరి దుస్తులు, వస్తువులు మరొకరు వాడటం మూలంగా తామర చాలా త్వరగా వ్యాపిస్తోంది. ట్రైకోఫైటాన్, మైక్రోస్పోరమ్, ఎపిడెర్మోఫైటాన్ ఫంగస్/శిలీంధ్రాలు మూలంగా తలెత్తే ఇది మట్టి, జంతువుల నుంచి కూడా సంక్రమించొచ్చు. ముఖ్యంగా పిల్లుల ద్వారా రావటం ఎక్కువ.
* 👉🏿చికిత్స:
యాంటీఫంగల్ క్రీములు, లోషన్లు, మాత్రలను 2 వారాల నుంచి నెల వరకు వాడితే తామర పూర్తిగా తగ్గుతుంది. ఆ తర్వాతా 2, 3 నెలలు పూత మందులు వాడుకోవాల్సి ఉంటుంది. సొంతంగా మలాములు, లోషన్లు, స్టిరాయిడ్ పూత మందులు వాడటం మంచిది కాదు. వీటితో సమస్య మొండిగానూ తయారవుతుంది.
*5 -నీటి పొక్కులు (కోల్డ్ సోర్స్)👇*
కొందరికి పెదవి మీద, పెదవుల చుట్టూ నీటి పొక్కులు ఏర్పడుతుంటాయి. నొప్పి, మంటతో తీవ్రంగా వేధిస్తుంటాయి. ఇవి కొద్దిపాటి జ్వరం, బల్లి మూత్రం పోయటం వల్ల వస్తుంటాయని కొందరు భావిస్తుంటారు. కానీ ఇవి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్‌ఎస్‌వీ) ఇన్‌ఫెక్షన్ మూలంగా వస్తాయి. ఒకటో రకం వైరస్‌తో పెదవి చుట్టూ.. రెండో రకం వైరస్‌తో జననాంగాల వద్ద పొక్కులు బయలుదేరతాయి. ఇటీవలికాలంలో ముఖరతి పెరగటం వల్ల చాలామందిలో రెండు రకాల పొక్కులు కలిసే కనబడుతుండటం గమనార్హం. పొక్కులు గలవారిని తాకటం, ముద్దు పెట్టుకోవటం, వారు తిన్న పళ్లెంలో భోజనం చేయటం వంటి వాటి ద్వారా వైరస్ ఇతరులకు సోకుతుంది. ఈ పొక్కులు తగ్గినప్పటికీ.. రోగనిరోధక శక్తి క్షీణించినపుడు, ఒత్తిడికి లోనైనప్పుడు, స్త్రీలలో నెలసరి సమయంలో ఉన్నట్టుండి విజృంభిస్తుంటాయి. ఇవి ఒకసారి వచ్చినచోటే మళ్లీ మళ్లీ వస్తుండటం విశేషం. పొక్కులు పగిలిపోతే పుండు పడొచ్చు. కొన్నిసార్లు రక్తం కూడా రావొచ్చు. లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే పొక్కులతో హెచ్‌ఐవీ వచ్చే అవకాశమూ ఎక్కువే.
*👉🏿 చికిత్స:*
అసైక్లోవిర్, ఫ్యామ్‌సైక్లోవిర్, వాలాసైక్లోవిర్ మందులను క్రమం తప్పకుండా వాడితే ఇన్‌ఫెక్షన్ పూర్తిగా నయమవుతుంది. అయితే పొక్కులు తగ్గినా కూడా 1-2 సంవత్సరాల వరకూ మందులు వేసుకోవాలి. దీంతో ఇతరులకు వ్యాపించకుండా చూసుకోవచ్చు. జననాంగాల వద్ద పొక్కులు గలవారి భాగస్వాములు కూడా విధిగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
*6.-పులిపిర్లు (వైరల్ వార్ట్స్)*
చిన్న బుడిపెల మాదిరిగా మొలుచుకొచ్చే పులిపిర్లు తరచుగా చూసేవే. సుమారు 2 కోట్ల మంది వీటితో సతమతమవుతున్నారని అంచనా. వీటికి కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ). ఇవి చర్మకణాలను వేగంగా వృద్ధి చెందేలా ప్రేరేపించి పులిపిర్లకు దారితీస్తాయి. ఇవి చేతులు, కాళ్లు, మెడ.. ఇలా ఎక్కడైనా పులిపిర్లు తలెత్తొచ్చు. చెప్పులు వేసుకోకుండా నడిచినపుడు కాలికి ముల్లు గుచ్చుకోవటం, గీరుకుపోయినప్పుడు వైరస్ లోనికి ప్రవేశించొచ్చు. దీంతో అరికాళ్ల పైనా పులిపిర్లు రావొచ్చు. కొందరికి గోరు చుట్టూరా పులిపిర్లు తలెత్తొచ్చు. ఇవి నొప్పితోనూ వేధిస్తాయి. కొన్ని పులిపిర్లు చర్మానికి వేలాడుతూ కనిపిస్తుంటాయి. మరో రకం హెచ్‌పీవీ లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. దీంతో జననాంగాలు, మలద్వారం వద్ద కూడా పులిపిర్లు రావొచ్చు. ఇలాంటివి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, మలద్వార క్యాన్సర్, యోని క్యాన్సర్ వంటి వాటికి దారితీయొచ్చు. అందువల్ల వీటిని నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. భాగస్వాములూ విధిగా చికిత్స తీసుకోవాలి. రోగనిరోధకశక్తి మందగించటం, జన్యుపరమైన కారణాల వల్ల కొందరికి ఒళ్లంతా పులిపిర్లు వస్తుంటాయి. ఇవీ క్యాన్సర్లకు దారితీయొచ్చు. మధుమేహుల్లో పులిపిర్లు ఎక్కువగా కనబడుతుంటాయి. హెచ్‌ఐవీ బాధితులు, రోగనిరోధక శక్తి క్షీణించినవారిలోనూ ఎక్కువే.
*👉🏿చికిత్స:*
సాలిసిలిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం పూత మందులను పులిపిర్లపై రాసి పట్టీ వేస్తే కొద్దిరోజులకు మెత్తబడి, వూడి వచ్చేస్తాయి. అరికాళ్ల మీద తలెత్తే పులిపిర్లకు కార్న్ ప్లాస్ట్ రకం పట్టీలు బాగా ఉపయోగపడతాయి. థర్మల్, క్రయో, లేజర్ థెరపీలతోనూ వీటిని నయం చేయొచ్చు. ఒంటిపై చాలా చోట్ల పులిపిర్లు గలవారికి ఇమ్యూనోథెరపీ బాగా ఉపయోగపడుతుంది. వీరికి బీసీజీ లేదా ఎంఎంఆర్ టీకా, విటమిన్ డి3ని సూది ద్వారా పులిపిర్లలోకి ఇస్తే మంచి ఫలితం కనబడుతుంది.
*7 -అంటుపుండ్లు (ఇంపెటిగో)*
చిన్న నీటి బుడగలా మొదలవుతాయి. తర్వాత చిట్లిపోయి, తేనెలాగా అట్టుకడతాయి. అంతటితోనే ఆగవు. వీటి రసి ఎక్కడ అంటుకుంటే అక్కడ బుడగలు బయలుదేరతాయి. ఒకరి నుంచి మరొకరికీ వ్యాపిస్తాయి. ఇవే అంటుపుండ్లు. ముక్కులో వేలు పెట్టుకొని తిప్పే పిల్లల్లో ఇవి ఎక్కువ. ముక్కులో నివసించే స్టెఫిలోకాకస్, స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా లోపల ఉన్నంతవరకు ఏమీ చేయవు. బయటకు రాగానే నోరు చుట్టూ పొక్కులకు దారితీస్తాయి. కొన్ని పొక్కులు ఒళ్లంతా పాకొచ్చు కూడా. ఇవి అంటుపుండ్లని తెలియక చాలామంది చెల్ది/కంచుక అని పొరపడుతుంటారు. మంత్రాలు వేయించుకోవటం, జాజు, మట్టి పూయటం వంటివి చేస్తుంటారు. ఇది ప్రమాదకరం. ఎందుకంలే కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్ తీవ్రమైతే రక్తంలోకీ వ్యాపించే ప్రమాదముంది.
*👉చికిత్స:*
అంటుపుండ్లు ఏర్పడిన భాగాన్ని తరచుగా శుభ్రం చేసుకుంటూ.. పైపూత మందులు, పౌడర్లు వాడితే వారంలోనే తగ్గిపోతుంది. అవసరమైతే యాంటీబయోటిక్ మందులు వేసుకోవాల్సి ఉంటుంది.
*8.-గజ్జి (స్కేబిస్)*
తీవ్రమైన దురద. గోకితే హాయి, తర్వాత విపరీతమైన మంట. మనసంతా దురద మీదే. రాత్రిపూట సరిగా నిద్ర కూడా పట్టదు. సరిగ్గా ఇలాగే వేధిస్తుంది గజ్జి. విద్యార్థులు, హాస్టళ్లలో ఉండే పిల్లల్లో ఇది తరచుగా కనబడుతుంది. సూక్ష్మమైన తవిటి పురుగుల మూలంగా ఇచ్చే ఇది చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. హాస్టళ్లలో, ఇంట్లో ఒకరికి ఉంటే అందరికీ రావొచ్చు. నిజానికి ఒంటిపై తవిటి పురుగులు 10-15 మాత్రమే ఉండొచ్చు గానీ వీటి ప్రతిచర్యలు ఒళ్లంతా ప్రభావం చూపుతాయి. సాధారణంగా వేళ్ల మధ్యన, మణికట్టు వద్ద, బొడ్డు చుట్లూ, చంకలో, జననాంగాల వద్ద గజ్జి ఎక్కువగా కనిపిస్తుంది. పగటి పూట కన్నా రాత్రిపూట విపరీతంగా దురద పెడుతుంది. దీంతో విపరీతంగా గోకుతుంటారు. నిద్ర పట్టదు. కొందరిలో పుండ్లు కూడా పడతాయి. ఇవి తీవ్రమైతే ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లకూ దారితీస్తాయి.
*👉🏿చికిత్స:*
రాత్రిపూట స్నానం చేసి.. మెడ దగ్గర్నుంచి కిందికి ఒళ్లంతా పర్‌మిత్రిన్,
బెంజయిల్ బెంజోయేట్ వంటి లోషన్లు రాసుకోవాలి. దాన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే స్నానం చేయాలి. వారం తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. దీంతో గజ్జి చాలావరకు నయమవుతుంది. అవసరమైతే
ఐవర్‌మెక్టిన్ అనే మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. దురదకు క్రీములు వాడుకోవాల్సి ఉంటుంది.
పై మందులు అన్ని మీ ఫ్యామిలీ సలహాలు తీసుకోని వాడాలి
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి
No comments:
Post a Comment