Friday 6 October 2023

మూత్ర_విసర్జనలో_బాధ_కొంతమంది_కు_నురగ_రావడం (సిస్త్టెటిస్) అవగాహనా_కోసం Naveen Nadiminti సలహాలు

*మూత్ర_విసర్జనలో_బాధ_కొంతమంది_కు_నురగ_రావడం (సిస్త్టెటిస్) అవగాహనా_కోసం Naveen Nadiminti సలహాలు*                           మూత్రవ్యవస్థలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి.
1. మూత్రపిండాలు. ఇవి రక్తాన్ని వడగట్టి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి.
2. మూత్రకోశం. మూత్రపిండాల్లో తయారైన మూత్రం.. విసర్జనకు ముందు దీనిలో నిల్వ ఉంటుంది.
 3. మూత్రమార్గం. దీని ద్వారా మూత్రం బయటకు విసర్జితమవుతుంది. వీటిలో మూత్రకోశం ఇన్ఫెక్షన్‌కు గురవటాన్ని 'సిస్త్టెటిస్‌' అంటారు.

                   పురుషులకన్నా స్త్రీలు తేలికగా ఈ రుగ్మత బారినపడుతుంటారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. పురుషులకన్నా స్త్రీలలో మూత్రమార్గం పొడవు చాలా తక్కువ. గర్భధారణ సమయంలో పిండం తల మూలంగా ఇది సాగి ఉండడం రెండవ కారణం. స్త్రీలలో మూత్రమార్గం.. మలవిసర్జన ద్వారానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కారణాల మూలంగా ఈ-కోలై క్రిములు మూత్రకోశంలో చోటుచేసుకుని తరచుగా సిస్త్టెటిస్‌కు గురికావడం జరుగుతుంది.

*మీకు_మూత్రంలో_నురగ_ఉంటోందా*
              మూత్ర విసర్జన చేసినప్పుడు నురగ కూడా రాకూడదు.వీటిలో ఏవి ఉన్నా, అది అనారోగ్యానికి సంకేతమే.

మూత్రంతో కూడా సమస్యలు తెలుసుకోవచ్చు కాబట్టే మూత్రపరీక్షలు చేస్తారు.

*ప్రస్తుతానికి మనం మూత్రంలో నురగ ఎలా వస్తుందో, అది ఎలాంటి సమస్యలకు ప్రమాద హెచ్చరికో చూద్దాం.*

1.-గర్భం దాల్చిన స్త్రీల మూత్రంలో నురగ వస్తే మరీ ఎక్కువ కంగారుపడవద్దు.ఆ సమయంలో ఇలా జరగడం కామన్.

2.-ప్రోటీన్‌లు ఎక్కువగా మూత్రంలోకి వెళ్ళడం వలన, ఊపిరితిత్తుల మీద ఒత్తిడి వలన ఇలా జరుగుతుంది.* మీరు మంచినీళ్ళు సరిగా తాగట్లేదు అంటే డిహైడ్రేట్ అవుతారు.

డీహైడ్రేషన్ వలన కూడా మూత్రంలో నురగ రావొచ్చు.కాబట్టి నీళ్ళు బాగా తాగాలి.

4.- డయాబెటిస్ సమస్య ఉన్నవారికి కూడా మూత్రంలో నురగ రావొచ్చు.మీకు అలాంటి అనుమానం ఉండి, మూత్రంలో నురగ వస్తోంటే వెంటనే పరీక్ష చేయించుకోండి.

5.- ప్రోటీన్లను మూత్రపిండాలు సరిగా ఫిల్టర్ చేయలేకపోతే ప్రోటీన్లు మూత్రంలో కలిసిపోతాయి.దాంతో నురగ వస్తుంది.

ఈ సమస్యని ప్రొటినూరియా అని అంటారు.ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు.

6.- మూత్రపిండాల్లో సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రోటిన్లు నురగని తీసుకొస్తాయి.మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకూడదు.

బ్లాడర్ మీద ఒత్తిడి పెంచకూడదు.మూత్రంలో ప్రోటిన్, అల్బమిన్ కలిస్తే నురగని ఆపడం కష్టం.

7.- స్త్రీలలో ఉండే UTI ఇంఫెక్షన్లు కూడా మూత్రంలో నురగకి కారణం కావచ్చు.ఎందుకైనా మంచిది, ఆ దిశగా కూడా పరీక్షలు చేయించుకోవాలి.వైద్య సలహాలు కోసం
https://m.facebook.com/story.php?story_fbid=797897022137130&id=100057505178618&mibextid=Nif5oz

      మూత్రకోశంలో చోటు చేసుకున్న ఇన్ఫ్‌క్షన్‌ పైన ఉన్న మూత్రపిండాలకు కూడా సోకటం చాలా తీవ్రమైన వ్యాధి. పెద్దపెట్టున జ్వరం, చలి, నిస్త్రాణ   చోటుచేసుకుంటాయి.  మూత్రాశయం ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు మాటిమాటికీ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావటం, విసర్జన సమయంలో మంట, తెలియకుండానే మూత్రంపడిపోతుండటం వంటి లక్షణాలు అధికంగా కనబడుతుంటాయి. అయితే కొన్నిసార్లు అత్యుత్సాహంగా రతి సల్పిన కేసుల్లో కూడా మూత్రకోశం ఇన్ఫెక్షన్‌కు గురికావచ్చు. నూతన దంపతులు ఈ బాధకు తరచూ గురికావడం జరుగుతుంది. దీనినే ''హనీమూన్‌ సిస్త్టెటిస్‌'' అంటారు.

*యూరిన్_ఇన్ఫెక్షన్_ఎలా_తగ్గించుకోవాలి?*

యూరిన్ పరీక్ష తరువాత, డాక్టర్ సలహా మేరకు మందులన్నీ కోర్స్ ప్రకారం తప్పనిసరిగా వాడాలి. ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టింది కదా అనుకుని మందులు వేసుకోవడము మధ్యలో ఆపగూడదు.

1.-ప్రతి రోజూ శరీరానికి అవసరం అయ్యే నీరును తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవచ్చు. అంతే కాదు నీళ్ళు మూత్రంలో కలిసిపోయి కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా, నివారిస్తుంది. మరియు కిడ్నీలలో ఉండే టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ చేస్తుంది.ఎక్కువ నీళ్లు తాగి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉండాలి.

2.-మూత్ర విసర్జన చేయాలనిపించినప్పుడు బలవంతంగా ఆపుకోకూడదు. ఆపుకోవటం వల్ల మూత్రాశయంలోని బ్యాక్టీరియా రెట్టింపై యుటిఐ కి దారితీస్తుంది.

3.-సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కువ నీళ్లు తాగటం వల్ల బ్యాక్టీరియా, మూత్రం ద్వారా కొట్టుకుపోయి ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.
4.-మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవటం వల్ల మూత్రాశయ పనితీరు దెబ్బతినవచ్చు. అందుకే వెంటనే మూత్ర విసర్జన చేస్తూ ఉండాలి.

5.-లోదుస్తుల శుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడ చాలా ముఖ్యం.

6.-క్రాన్ బెర్రీ జ్యూస్ త్రాగడం వల్ల యూరినరీ బ్లాడర్ లోని బ్యాక్టీరియాను నివారిస్తుంది . అందువల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ని నివారించడానికి క్రాన్ బెర్రీ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి.

7.-అల్లం చాలా పాపులర్ హెర్బ్ . వంటలలో అల్లం వాడడం మంచిది. అల్లంలో జింజరోల్ అనే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్, బ్యాక్టీరియాను కిడ్నీలో వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది.

8.-పెరుగులో ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా)అధికంగా ఉండటం వల్ల, యిది కిడ్నీ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో బాగా సహాయపడుతుంది .అందుకని పెరుగుని వాడితే మంచిది.

9.-పసుపు నేచురల్ రోగనివారక ఔషధం.. ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ని నివారిస్తుంది. మరియు ఇది చాలా త్వరగా కోలుకునేలా చేస్తుంది. పాలలో కొద్దిగా పసుపు మిక్స్ చేసి తీసుకోవాలి. వంటలలో కూడా వాడుకుంటే ఇన్ఫెక్షన్ నివారణ కు బాగా వుపయోగపడుతుంది.

*Naveen_Treatment :*

నీరు ఎక్కువగా త్రాగాలి,
Tab . ----- time /day  for 7-10 days,
Tab . --==
Rest for 7-10 days .
Avoid sexual activities for 10 days.
Avoid spicy foods like Biriyani.
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
ఫోన్ -9703706660      
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
      ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment