Monday 30 October 2023

Oral Health & Dental Problems awareness

*Oral Health & Dental Problems awareness 31.10.2023.*
*పంటి చిగుళ్ళు వదులుగా అయిపోయి రక్తం వస్తుంటే చిగుళ్ల బలానికి ఏo తినాలి నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

               చిగుళ్ళు వదులుగా అయిపోయి రక్తం వచ్చే వ్యాధిని scurvy అంటారు. ఇది విటమిన్ సి లోపం వల్ల వస్తుంది.

     ఇది సి విటమిన్ తీసుకుంటే తగ్గిపోతుంది. నిమ్మ జాతి పండ్లలో, జామ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, ఉసిరి, టమాట మొదలైన పండ్లు, కూరగాయలలో సి విటమిన్ ఉంటుంది. వేడిచేసినా, ఎక్కువ కాలం నిలువ చేసినా సి విటమిన్ నశిస్తుంది. కాబట్టి తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటేనే సరైన ప్రయోజనం ఉంటుంది.

*చికిత్స :*

1 - 2 గ్రా. రోజుకి 3 రోజులు
500 మి. గ్రా తరువాత 7 రోజులు
100 మి. గ్రా 3 నెలల వరకు
*నివారణ :*

మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ సి తప్పనిసరిగా తగినంత మోతాదులో ఉండాలి.

0–6 నెలలు 40 మి.గ్రా(తల్లిపాల ద్వారా)
7–12 నెలలు 50 మి.గ్రా
1–3 సం. 15 మి.గ్రా
4–8 సం. 25 మి.గ్రా
9–13 సం. 45మి.గ్రా
14–18సం.75 మి.గ్రా(పు) 65మి.గ్రా(స్త్రీ)
19 సం. పైన 90మి.గ్రా(పు) 75 మి.గ్రా(స్త్రీ)
గర్భిణులు 85 మి.గ్రా
పాలిచ్చే తల్లులు 120 మి.గ్రా
ధూమపానం చేసే వారు 35మి. గ్రా అదనంగా తీసుకోవాలి.

*ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం చిగుళ్ళ వ్యాధులకు కారణం శరీరంలో త్రి దోషాలు అస్తవ్యస్తం కావటం. దీని నివారణకు*

1.-ఉత్తరేణి వేరు, లేదా,చండ్ర ,వేప, నేరేడు, మామిడి, వీటి పుల్లలలో ఏదో ఒకటి దంతధావనానికి ఉపయోగించాలి.
2.-ఎల్లప్పుడూ మరిగించి చల్లార్చిన నీరు మాత్రమే త్రాగాలి.
3.-ఎండు ద్రాక్ష, లేదా కిస్మిస్ పండ్లు (10) రాత్రి నానబెట్టి ఉదయాన్నే లేచి,ఆ నీటిని తాగి, పండ్లు తినాలి (సుమారు 2నెలలు).
4.-పరగడుపున ఒక చెంచా చొప్పున నల్లనువ్వులు తిని ,ఒక గ్లాసు పరిశుద్ధమైన నీరు త్రాగితే, కదిలే దంతాలు గట్టి పడును
5.-ఒక రాగి పాత్రలో (250ml) పరిశుద్ధమైన నీరు పోసి, ఉదయాన్నే ముందుగా 6.-పరగడుపున తాగటం వల్ల, జీవితం లో ఏ వ్యాధి దరిచేరదు.
7.-వీలైతే పైన చెప్పిన నీటితో బాటు, రాగి Pushing 1లవంగం,2యాలకులు,ఒక తులసి దళం రాత్రి నానబెట్టి ఉదయాన్నే త్రాగవచ్చు.
*ధన్యవాదాలు🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
      
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
వైద్య నిలయం లింక్స్
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19

No comments:

Post a Comment