*Dental Problems in Children &How to brush children without eating toothpaste?awareness.3.11.2023.*
*చిన్నారుల దంతాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూడటం ఎలా?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
చాక్లెట్లు, తీపు పదార్థాలు పరిమితం గా ఇవ్వడం, భోజనం లో ముందు తీపు తినడం, చివర కాకుండా. మనకు పమాన్నం, భక్ష్యాలు చివర తినే చెడ్డ అలవాటు. మొదట్లో తింటే భోజనం తిన్న పుడు చక్కెర పదార్థాలు పళ్ళ సందుల్లో ఇరుక్కోకుండా లోపలికి వెళ్ళి పోతాయి. చక్కెర బాక్టీరియా కు గొప్ప ఆహారం, చక్కగా ప్రవర్ధమానమై నళ్ళు పుచ్చిపోయేట్లు చేస్తాయి.
పిల్లలు ఎప్పుడు పాలు తాగినా నోరు శుభ్రం చేసుకోడం నేర్పించాలి. రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకోవడం చాలా మంచి అలవాటు.
ఏంచేసినా సమస్య రావచ్చు. అవసరం అయితే దంతవైద్యుణ్ణి సంప్రదించాలి.
*పిల్లలు టూత్ పేస్ట్ తినకుండా బ్రష్ చేయించడం ఎలా?*
చిన్న పిల్లలకు సాధారణంగా దంతాలు రావడమనేది 8–9 నెలల వయసు నుంచి జరుగుతుంది . కొంత మందికి ముందుగా రావచ్చు. కొంత మందిలో ఆలస్యం అవచ్చు. పాలు తాగే వయసులో తొలిసారిగా వచ్చిన ఈ దంతాలను "పాల దంతాలు" ( milk teeth) అంటారు.
ఈ దశలో వీరికి వచ్చే దంతాలు అంతగా శుభ్రపరచవలసిన అవసరం లేదు. ఒక సంవత్సరం లోపు పిల్లలకు దంతాల కంటే ముఖ్యంగా నాలుకను శుభ్రపరచాలి, లేదంటే పాచి ఎక్కువగా ఉండి పాలు సరిగా తాగరు.
నాలుకను శుభ్రపరచడానికి పెద్ద వాళ్ళు వేలిని పసుపులో అద్ది నాలుకపై రాస్తూ శుభ్రం చేస్తారు. లేదంటే మెత్తటి గుడ్డపై మౌత్ పేయింటు వేసి నాలుకపై రాసి శుభ్రం చేయొచ్చు.
సంవత్సరం దాటిన పిల్లలకు కూడా పూర్తి సంఖ్యలో దంతాలు రావు. వీరికి దంతధావనం చేయించడానికి సాధారణ బ్రష్ బదులు ఫింగర్ బ్రష్ ఉపయోగించడం మంచిది . ఇది రబ్బరులా మెత్తగా ఉండడం వల్ల వారి దంతాలకు , చిగుళ్ళకు ఎటువంటి హానీ జరగదు.
సాధారణంగా పిల్లలకు తీపి పదార్థాలు అంటే మక్కువ ఎక్కువ కాబట్టి టూత్ పేస్ట్ ను కూడా తింటారు.
దీనికి నివారణగా మనం చేయాల్సింది తియ్యగా ఉన్న టూత్ పేస్ట్ ఉపయోగించకపోవడమే. కొద్దిగా కారంగా / ఘాటు రుచి గల టూత్ పేస్ట్ వాడాలి. లేదా తీపి లేని టూత్ పౌడర్ ను వాడడం ఉత్తమం.
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఇంట్లో తయారుచేసినవి పెట్టడానికే ఇష్టపడతారు. అలాగే టూత్ పౌడర్ ను ఇంట్లో తయారు చేసుకుని వాడడం శ్రేయస్కరం. హోం మేడ్ టూత్ పౌడర్ తయారీ విధానం యూట్యూబ్ లో వీడియోలు రూపంలో అందుబాటులో ఉన్నాయి.
ఏది మీకు, మీ పిల్లలకు సరిపడుతుందో లేదా నచ్చుతుందో దానిని తయారు చేసుకుని వాడుకోవచ్చు.
మీరు పేస్ట్ తో బ్రష్ చేస్తూ , వాళ్ళని పౌడర్ తో చేయమంటే ఊరుకోరు సరికదా ఇంకా ఎక్కువ పేచీ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పడుకున్నప్పుడు బ్రష్ చేయడమో, లేదా ఇంటిల్లిపాదీ కూడా ఇంట్లో తయారుచేసిన పళ్ళ పొడి (టూత్ పౌడర్) ని వాడడం అన్ని విధాలా శ్రేయస్కరం.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment