*చలి_ప్రభావం_నుండి_మీ_పిల్లలు_సురక్షితంగా_ఉండేందుకు_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహనా_కోసం..*
చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే వారికి తరచుగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తుంటాయి. శీతాకాలంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది.
. అందుకని, శీతాకాలంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరి శీతాకాలంలో పిల్లల సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
*అవాల_నూనెతో_మసాజ్..*
ఆవాల నూనెతో అరికాళ్ళపై మసాజ్ చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. మీరు గోరువెచ్చని ఆవాల నూనెతో పిల్లల అరికాళ్ళకు క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే అది వారి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరం వేడెక్కుతుంది.
#చలి_నుంచి_సంరక్షణ..
మస్టర్డ్ ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ నూనెతో అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల పిల్లలు చాలా రిలాక్స్‌గా ఉంటారు. దీని కారణంగా వారి శరీరం లోపలి నుండి వెచ్చగా ఉంటుంది. ఫలితంగా చలి నుండి వారిని సంరక్షించవచ్చు.
#ఉదర_సమస్యలకు..
అరికాళ్లపై అనేక ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి. మన చేతులతో అరికాళ్లను రుద్దడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది జీర్ణవ్యవస్థను సైతం బలపరుస్తుంది. అరికాళ్లకు మసాజ్ చేయడం వలన పిల్లలకు కడుపునొప్పి, గ్యాస్, వాంతులు వంటి సమస్యలు ఏర్పడవు.
*మంచం_తడిగా_ఉంచొద్దు..*
చలికాలంలో పిల్లలు తరచుగా టాయిలెట్ చేస్తుంటారు. అయితే అరికాళ్లకు మసాజ్ చేసి నిద్రపుచ్చితే వారి శరీరంలో వేడి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిలో.. పిల్లలు టాయిలెట్ చేయకుండా ఉంటారు. అంతేకాదు.. మంచి రిలాక్స్‌డ్‌గా ఉంటారు.పూర్తి వివరాలు కు టెలిగ్రామ్ లింక్స్ లో చూడాలి
https://www.facebook.com/1536735689924644/posts/2971313096466889/
*మెదడు_చరుకుగా_మారుతుంది..*
అరికాళ్ళకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల పిల్లల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాదాలలో ఉండే కొన్ని పాయింట్లు మెదడుకు సంబంధించినవి కూడా. మసాజ్ సమయంలో ఈ పాయింట్లను నొక్కితే వారి మనస్సు ఉత్తేజితమవుతుంది. ఇది పిల్లల ఏకాగ్రతను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
*ఇలా_మసాజ్_చేయండి*
ముందుగా పిల్లల పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత నూనెను కొద్దిగా వేడి చేయండి. కొన్ని చుక్కల నూనె తీసుకుని పిల్లల అరికాళ్లపై, గోళ్లపై రాయండి. దీని తరువాత, మీ రెండు చేతులను రుద్దండి. ఆ తరువాత, నెమ్మదిగా పిల్లల అరికాళ్ళను మసాజ్ చేయండి. సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి.
*#పిల్లల్లో_immunity_పెరిగేందుకు..*
పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. ముఖ్యంగా కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలంటే...
కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, బి2(రైబోఫ్లేవిన్) కోడిగుడ్డులో లభిస్తాయి.
ఆకుకూరలు, మునగకాయలు, కొత్తిమీర, పాలకూర వంటివి ఎక్కువగా పెట్టాలి. వీటిలో ఫైబర్‌తో పాటు ఐరన్, జింక్, మినరల్స్ లభిస్తాయి.
పెరుగులో ప్రోబయోటిక్స్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.
కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్ యోగర్ట్, వెజిటబుల్స్ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు.
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ పసుపు ఆహారంలో ఇవ్వడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు.
బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్, అప్రికాట్స్ వంటివి ఎక్కువగా తినిపించాలి. మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్‌జ్యూస్‌లు, చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్‌ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి.
పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. ఉదయం ఒక గంటసేపైనా ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలి
ధన్యవాదములు 🙏
మీ Naveen Nadiminti
ఫోన్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
No comments:
Post a Comment