Friday 15 December 2023

రక్తం_పెంచుకోవడానికి_ఏమి_తినాలి?

*రక్తం_పెంచుకోవడానికి_ఏమి_తినాలి?*
*తినగానే_వెంటనే_శక్తిని_ఇచ్చే_ఆహార_పదార్థాలు_ఏవి? అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు* 
మన శరీరంలో పోషకాలు, ఆక్సిజన్ ప్రతీ కణానికి సరిగ్గా అందడం లో రక్తం పాత్ర ముఖ్యమైనది. సరైన ఆరోగ్యం కోసం తగినంత రక్తం శరీరంలో ఉండాల్సిన అవసరం ఉంది, ఒకవేళ రక్తం లోపిస్తే ఆ కండిషన్ ని అనేమియా అంటారు. రక్తం సరిగ్గా ఉండటానికి సరైన ఆహారాలు తినటం ఎంత ముఖ్యమో ప్రాసెస్డ్ ఆహారాలు, కృత్రిమ షుగర్స్ గల ఆహారాలు తగ్గించడం కూడా అంతే ముఖ్యం. ఇక రక్తం

*#శరీరానికి_రక్తం_ఇచ్చే_పదార్థాలు….*

 ఐరన్ అనేది ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్‌లో కనిపించే ఒక ఖనిజం. హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావు,

*ఇరన్‌_మూలం…* గుడ్లు, మాంసం, చేపలు, టోఫు, పప్పులు, చిక్కుళ్ళు, ఆకుకూరలు
$ విటమిన్ B12 అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. విటమిన్ B12 లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా పనిచేయలేవు,

*విటమిన్‌_B 12 మూలం*…మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు
$ ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా పెరగలేవు,

*#ఫోలిక్‌_యాసిడ్_మూలం* ..గుడ్లు, మాంసం, చేపలు, ఆకుకూరలు, బీన్స్, చిక్కుళ్ళు
$ ప్రోటీన్లు అనేవి శరీరం యొక్క నిర్మాణాత్మక భాగాలు. ప్రోటీన్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం.

#ప్రోటీన్ల_మూలం….మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, చిక్కుళ్ళు, ధాన్యాలు
 సరయిన నిద్ర వైద్య నిలయం సలహాలు
https://m.facebook.com/story.php?story_fbid=836233271636838&id=100057505178618&mibextid=RtaFA8
*శరీరం_లో_పెరగడానికి_తినాల్సిన_ఐదు_ముఖ్యమైన_ఆహారాలు_చూద్దాం.*

*1.#ఆకుకూరలు*

పాలకూర మరియు కేల్ వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఈ ఐరన్ మన రక్తం లోని హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో ముఖ్యమైనది. ఆకు కూరల్లాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల రక్తం పెరిగి అనేమియా వంటి సమస్య రాకుండా ఉంటుంది.

*2.చిక్కుళ్ళు మరియు పప్పు దినుసులు*

చిక్కుళ్ళు మరియు పప్పు దినుసుల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉన్న ప్లాంట్ బేస్డ్ ఐరన్ బ్లడ్ పెరగడానికి సహాయపడాలంటే వీటితో పాటు విటమిన్ సి అధికంగా ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోవాలి. అలాగే వీటిలో ఫోలియేట్ మరియు విటమిన్ బి6 కూడా ఉండటం వల్ల రక్తం తయారవ్వటానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి.

*3.నట్స్ మరియు సీడ్స్*

బాదం, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు వంటి నట్స్ మరియు సీడ్స్ లో ఫోలియేట్, ఐరన్ మరియు విటమిన్ E ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ E అనేది ఎర్ర రక్తకణాలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే ఐరన్ మరియు ఫోలియేట్ కూడా రక్తం పెరగడానికి సహాయపడతాయి.

*4.బీట్ రూట్*

ఇక బీట్ రూట్స్ లో ఐరన్ మరియు విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. అందుకని మన శరీరం లో బ్లడ్ లెవల్స్ పెరగడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఈ బీట్ రూట్స్ లో ఉండే నైట్రేట్స్ రక్త ప్రసరణ సవ్యంగా జరగడానికి అలాగే రక్తంలో ఆక్సిజన్ సరిగ్గా ఉండటానికి సహాయపడతాయి.

*5. సిట్రస్ పండ్లు*

నారింజ పళ్ళు, ద్రాక్ష, నిమ్మకాయాలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. విటమిన్ C అనేది మన శరీరంలో రక్తం పెరగడానికి అవసరం అయ్యే ఐరన్ అబ్జర్బ్ అవ్వడానికి సహాయపడుతుంది. అందుకనే ఐరన్ రిచ్ ఫుడ్స్ తో పాటు ఈ సిట్రస్ పండ్లు కూడా తీసుకోవటం మంచిది.

శరీరానికి రక్తం ఇచ్చే పదార్థా
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti*,
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment