Thursday 28 December 2023

జుట్టు సమస్యలు - వెంట్రుకలు అధికంగా రాలుట, తెల్ల వెంట్రుకల సమస్య, చిట్లిపోవడం, వెంట్రుకలు దృఢంగా లేకపోవడం, పలుచ పడటం, బంక లాగా అతుక్కుని ఉండడం లాంటి సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద పరిస్కారం

✍️ జుట్టు సమస్యలు - వెంట్రుకలు అధికంగా రాలుట, తెల్ల వెంట్రుకల సమస్య, చిట్లిపోవడం, వెంట్రుకలు దృఢంగా లేకపోవడం, పలుచ పడటం, బంక లాగా అతుక్కుని ఉండడం లాంటి సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద పరిస్కారం:

👉ఒకప్పుడు కేశ సౌందర్యంలో మన భారత  స్త్రీ మరియూ పురుషులు ప్రథమస్థానంలో ఉండేవారు. 

👉కానీ కాలం మారిన తరువాత జీవనశైలి మారింది. క్రమంగా స్వదేశంలో విదేశీ రసాయన పదార్థాల వాడకం ఎక్కువ అయింది. 

👉ఒకప్పుడు కుంకుడుకాయ, శీకాయ, మంగకాయ, చీకిరేణి పొడి, నల్ల రేగడి మన్ను లాంటి వాటితో తల స్నానం చేసే పద్ధతులను అనుసరించిన భారతీయులు క్రమ క్రమంగా విదేశీ షాంపూలు, సబ్బుల వాడకానికి బాగా అలవాటు పడ్డారు.

👉 వెంట్రుకలకు బలం కలిగించే ఆహారం తీసుకోవడం పూర్తిగా పక్కన పడేశారు. 

👉జీవన విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం, సరైన ఆహార విధానాలు పాటించలేక పోవడం, వ్యాయామాలు అనే మాటే లేకపోవడం, మద్యపానం మరియు దూమపాన అధికంగా సేవించడం లాంటివి అలవాటు అయ్యాయి. 

👉ఫలితంగా అతి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం, బట్టతలలు, ఉన్న జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. 

👉ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు నియమాలను ఆచరించి మీ కేశాలను ఆరోగ్యంగా చూసుకోగలరని మనవి.

✍️ వెంట్రుకల ఆరోగ్యానికి ఏ ఆహారపదార్థాలు తీసుకోవాలి.

👉వంటల్లో మేలురకమైన నువ్వులనూనెని వాడాలి.

👉నల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, నల్ల బెల్లము, త్రిఫల రసాయణము కలిపి స్వీట్ లాగా తయారు చేసిన 'కేశామృతం'  రెండు పూటలా ఒక చెంచా మోతాడుతో తినాలి.

👉వారనికి ఒకటి లేదా రెండు సార్లు గుంట గలగర ఆకుతో పచ్చడి చేసి తినాలి.

👉మెంతికూర, వెల్లుల్లి, సునాముఖి, నేల తంగేడు, పాలకూర మొదలైనవి బాగా తినాలి
🌼  కేశవర్ధిని 🌼
***************************

  ఈ తైలం చేయు విధానం :  

1, పచ్చి గుంటగలగరాకు రసం లీటర్
2,  పచ్చి ఉసిరికాయల రసం లీటర్
3, పచ్చి గోరింటాకు రసంలీటర్
4,పచ్చి నీలి ఆకులకషాయం లీటర్
5,పచ్చి మందారపూవుల రసములీటర్
6, గురుగింజల కషాయం లీటర్
7,కరక్కాయల కషాయం లీటర్
8,  మామిడికాయజీడి రసం లీటర్
9, తెల్లఉల్లిగడ్డలరసం లీటర్
10 మర్రిఊడలకషాయం  లీటర్
11,లోహా భస్మం  1/4 kg

ఈ పై చెప్పిన వస్తువులు మహా శక్తివంతమైనవి, , ఈ అన్ని పచ్చివి దంచి రసం తీసుకోవాలి 
        కషాయం చేయడం 
కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని  తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ  మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె,  5 లీటర్లు వేసుకొని   సన్నని మంట పైన  చెయుచూ, పై చెప్పిన కషాయాలు  రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో  భద్రపరుచుకొవాలి  ఈ నూనె  2, 3 లీటర్లు మీకు  మిగలవచ్చును అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ గొప్ప తైలాన్ని  వెంట్రుకల యెక్క కుదుళ్ళకు రాసుకొని మెల్లగా  5 నిముషాలు మర్దన చేయాలి, 

               శీకాకాయ100 గ్రా మరియు కుంకుడుకాయ 400గ్రా మెత్తగా దంచి  కలిపి  తల స్నానం చేయాలి.

✍️ లిక్విడ్ హెర్బల్ షాంపూ:

👉కుంకుడుకాయల పొడి, గుంటగలగర ఆకు పొడి, నిమ్మకాయ చెక్కలు, టీ పొడి, రేగు ఆకుల పొడి అన్ని కలిపి ఒక గ్లాసు వేడి నీళ్లలో వేసి బాగా గిలకొట్టి వడగట్టి ఆ నీటిని షాంపూగా వాడుకోవచ్చు.
👉ఆ తరువాత ఆయిల్ ని తలకు బాగా పట్టించి మర్దనా చేయాలి. మూడు గంటల తర్వాత త్రిఫల కషాయం తో తలంటుకుని స్నానం చేయాలి.

పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. 

✍️ విన్నపం:

మీరు చదివిన తర్వాత ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి. .

✍️సమస్య ఏదైనా ఒకసారి మాతో చర్చించండి. మా వంతు సహాయంగా మీకు విలువైన ఆరోగ్య సలహాలు ఇవ్వబడును.
call 9949363498

No comments:

Post a Comment