Friday, 29 December 2023

చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ సమస్యలు అయిన దగ్గు, జలుబు, ఆయాసం, ఆస్తమా, నిమోనియా, సైనసైటీస్ లాంటి సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద గృహ చిట్కా

చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ సమస్యలు అయిన దగ్గు, జలుబు, ఆయాసం, ఆస్తమా, నిమోనియా, సైనసైటీస్ లాంటి సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద గృహ చిట్కా
**********************************
కావాల్సిన ద్రవ్యాలు:

పైతోలు తొలగించి దంచిన అల్లంముక్కలరసం 400 ml
పాతబెల్లం 100గ్రా||,
దాల్చినచెక్కపొడి 5గ్రాII,
మిరియాలపొడి 5గ్రాII,
సొంఠిపొడి 5గ్రాII, పిప్పళ్ళపొడి 5గ్రా II, చిన్న ఏలకులు పొడి 5గ్రాII, లవంగాలపొడి 5గ్రా ||,
వాయు మిరియాలు 5 గ్రాల్!!
నాగకేసరాలపొడి 5గ్రాII, ఆకుపత్రిపొడి 5గ్రా ||

చొప్పున తీసుకోవాలి.
తయారీ విధానం :

ముందుగా ఒక కళాయి పాత్రలో అల్లంరసాన్ని, పాతబెల్లాన్ని కలిపి చిన్నమంటపైన పాకం వచ్చేటట్లు మరిగించాలి.

లేత పాకం రాగానే అందులో మిగిలిన పదార్థాల చూర్ణాలను కలిపి పాత్రను దించుకోవాలి.

పదార్థాలన్నీ కలిసిపోయేటట్లు బాగా కలిదిప్పి అది కొంచెం గోరువెచ్చగా అయిన తరువాత మంచితేనె  200గ్రా|| కలిపి ఒకగాజు పాత్రలో నిలువవుంచుకోవాలి.

ఇదే అద్భుతమైన అల్లం లేహ్యం
ఈ లేహ్య సేవన వల్ల కేవలం ముక్కు సమస్యలు, గొంతు సమస్యలు, ఉపిరితిత్తుల సమస్యలు హరించి పోవడమే కాక, అణగిపోయిన జఠరాగ్ని తిరిగి ప్రజ్వలించి మంచి ఆకలిని పుట్టిస్తుంది.

జీర్ణరసాలను బాగా ఉత్పత్తి చేసి తిన్న ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేస్తుంది. మలబద్దకాన్ని మాయం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్తమా, క్షయ సమస్యలు ఉన్న వారికి ఇది ఏనాటికీ మరువలేని ఒక అద్భుతమైన ఆహారయోగం
❎❎❎❎❎❎❎❎❎❎

No comments:

Post a Comment