Thursday 7 December 2023

బాడీలో_యూరిక్_యాసిడ్_ఎక్కువగా_ఉండటం_వల్ల_వచ్చే_సమస్యలు_ఏమిటి

*బాడీలో_యూరిక్_యాసిడ్_ఎక్కువగా_ఉండటం_వల్ల_వచ్చే_సమస్యలు_ఏమిటి ?*
*అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*

యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు పెరగడం అనేది నేడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య.. మనం తినే ఆహారాన్ని బట్టే ఈ యూరిక్‌ యాసిడ్‌ బాడీకి అందుతుంది.. అలాగే మూత్రం రూపంలో బయటకు పోతుంది.. కానీ ఎప్పుడైతే ఇది బయటకు పోకుండా.. బాడీలోనే ఉంటుందో..కీళ్ల నొప్పులు, వాపులు, మూత్రపిండాల్లో రాళ్లు, షుగర్‌..ఇలా చెప్పుకుంటూ పోతే చాన్తాడంత లిస్ట్‌ ఉంది.. ఇలా బాడీలో యూరిక్‌ యాసిడ్‌ పెరిగి.. కొంతకాలానికి కీళ్ల మధ్య స్పటికాలుగా పేరుకుపోతుంది.. ఎముకల ఆకారం మారుతుంది.. దీన్నే గౌట్‌ అంటారు.. మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా..? ఇంటి నవీన్ రోయ్ సలహాలు ఒంటి కోసం..!!

*టిప్ 1*
ఒక గ్లాస్ సొర‌కాయ జ్యూస్‌ను తీసుకోవాలి. త‌రువాత అందులో వేయించిన వాము పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేయాలి. త‌రువాత ఇందులో పావు టీ స్పూన్ న‌ల్ల మిరియాల పొడి వేసి బాగా క‌లుపండి.. ఈ విధంగా త‌యారు చేసుకున్న జ్యూస్‌ను ఉద‌యం అల్పాహారం చేసిన త‌రువాత తాగండి..ఈ విధంగా సొర‌కాయ జ్యూస్‌ను తాగడం వ‌ల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు త‌గ్గ‌డంతో పాటు ర‌క్తంలో పేరుకుపోయిన ఇత‌ర వ్య‌ర్థ ప‌దార్థాలు కూడా తొల‌గిపోతాయి.
*టిప్‌ 2*
తిప్ప‌తీగ ర‌సంతో యూరిక్‌ యాసిడ్‌ సమస్య నుంచి బయటపడొచ్చు. తిప్ప‌తీగ అందుబాటులో లేని వారు ఈ తీగ ర‌సం మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.. ఈ జ్యూస్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.
https://m.facebook.com/story.php?story_fbid=831531285440370&id=100057505178618&mibextid=RtaFA8
*ఈ_జాగ్రత్తలు_తప్పనిసరి*..!
మ‌ద్య‌పానానికి దూరంగా ఉండాలి.
టీ, కాఫీల‌ను తాగ‌డం త‌గ్గించాలి.
ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు నీటిని ఎక్కువ‌గా తీసుకోవాలి.
మ‌సాలా ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను, మాంసాహారాన్ని, జంక్ ఫుడ్ ను, తీపి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం చాలా త‌గ్గించాలి.

ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌కు దూరంగా ఉండాలి.

🌷యూరిక్ యాసిడ్ ప్యూరిన్లు, కొన్ని ఆహారాలు మరియు పానీయాలలోని పదార్ధాల విచ్ఛిన్నం కారణంగా శరీరంలో సహాజంగా ఏర్పడుతుంది. దీనిని మూత్రపిండాలు మూత్రం ద్వారా తొలగిస్తుంది.

🌷రక్తంలో యూరిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల హైపర్యూరిసెమియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు మరియు గౌట్ వంటి బాధాకరమైన వ్యాధులకు దారితీయవచ్చు.

*అధిక_యూరిక్_యాసిడ్_స్థయికి_కారణాలు* ….

🌷ఆహారం..,ఎర్ర మాంసం, మాంసాలు, షెల్ఫిష్ మరియు కొన్ని రకాల చేపలు యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి.

🌷 చక్కెర పానీయాలు…చక్కెర మరియు అధిక ఫ్రక్టోజ్ పానీయాలు గౌట్ ప్రమాదాన్ని 15% పెంచి యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది,

🌷మద్యం వినియోగం…బీర్, వైన్ మరియు హార్డ్ స్పిరిట్స్ వంటి అన్ని రకాల ఆల్కహాల్ మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతాయి,

🌷#ఊబకాయం…అధిక శరీర కొవ్వు తక్కువ జీవక్రియ రేటును కలిగి యూరిక్ యాసిడ్ ఉత్పత్తికి కారణమవుతుంది.

🌷జన్యుశాస్త్రం….నిర్దిష్ట జన్యువులలో జన్యుపరమైన మార్పులు హైపర్యూరిసెమియాకు దారితీయవచ్చు.

👉 *నియంత్రించే డ్రై ఫ్రూట్స్*….*.

#జీడిపప్పు……ప్యూరిన్లు తక్కువగా ఉండి కొవ్వులు, యాంటీ-ఆక్సిడెంట్లు మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు ఉండును.

*అక్రోట్లు…*. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి,

*బాదం*…బాదం నందు ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం విటమిన్ E, మంచి కొవ్వులకు గొప్ప మూలం.

*వేరుశనగ:* వేరుశనగలో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

*అవిసె_గింజలు*… ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఫైబర్‌లు మంటను తగ్గిస్తాయి.

*బ్రెజిల్_నట్స్*….బ్రెజిల్ గింజలలో గణనీయమైన మొత్తంలో ఉండే సెలీనియం ఖనిజం యాంటీఆక్సిడెంట్ ప్రభావాలతో కూడి ఉంటుంది
*ఎండుద్రాక్ష…* విటమిన్లు, ఖనిజాలు సహజ చక్కెరలు ఎండుద్రాక్షలో ఉండి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాల కారణంగా, యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించ గలవు

👉 *#నియంత్రించే_ఇతర_ఆహారాలు….*

🌷పాలు పాల ఉత్సత్తుల

🌷Whole grains

🌷ఎండిన చెర్రిలు

🌷అధిక నీరు….. గంటకు ఒకసారి

*👉 డ్రైఫ్రూట్స్ను రోజుకు ఎన్ని తినాలి….*

డ్రైఫ్రూట్స్ను మితంగా తినడం ముఖ్యం,
రోజుకు 28-57 గ్రాముల డ్రైఫ్రూట్స్ తినడం మంచిది
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
6ఫోన్ -9703706660*,

This group created Naveen Nadimintion on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment