Tuesday, 5 December 2023

🍎ఆపిల్ పండు ఏ వేళలో తినాలి🍎

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
ఆపిల్
#####################
  దీనిని సేపు అని కూడ పిలుస్తారు.
*🍎ఆపిల్ పండు ఏ వేళలో తినాలి🍎*

*ఆపిల్‌ను ప‌గ‌టిపూట తిన‌డం చాలా ఉత్త‌మ‌మ‌ని నిపుణులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. దీనికి కార‌ణం ఆపిల్‌లో ఉండే పెక్టిన్, పీచు ప‌దార్థాలే. ఆపిల్‌ను ఉద‌యం లేదా రాత్రి తింటే అందులో ఉండే పెక్టిన్‌, పీచు ప‌దార్థాల వ‌ల్ల ఆపిల్ త్వ‌రగా జీర్ణం కాదు. అందువల్ల జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఆపిల్‌ను ప‌గ‌టి పూట తింటే రాత్రి మ‌ళ్లీ భోజ‌నం చేసే వ‌ర‌కు ఎక్కువ స‌మ‌యం ఉంటుంది. కాబ‌ట్టి ఆపిల్ పండ్లు త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. ఈ కారణంగా ప‌గ‌టి పూటే ఆపిల్‌ పండ్లను తినాల‌ని వైద్యులు సూచిస్తున్నారు
విరేచనాలు, అతిసారం: యాపిల్ గుజ్జులో ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ పదార్థం ద్రవ రూప మలాన్ని గట్టిపడేలా చేస్తుంది. అందుకే దీనిని అతిసారం వంటి సమస్యల్లో వాడవచ్చు. పచ్చి యాపిల్‌పైన తోలు తొలగించి కండ భాగాన్ని తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.

కొలెస్టరాల్ ఆధిక్యత: 
 యాపిల్స్‌ని తీసుకుంటే, దానిలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ పదార్థం కొవ్వు పదార్థాల గ్రహింపును అడ్డుకుంటుంది. పెక్టిన్ ఒక జెల్ మాదిరి పదార్థంగా తయారై అమాశయం గోడల మీద, చిన్న పేగు గోడలమీద పేరుకుపోయి కొవ్వు విలీనాన్ని అడ్డుకుంటుంది.

క్యాన్సర్లు: 
యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ జీవక్రియకు లోనైనప్పుడు బ్యుటైరేట్ అనే జీవి రసాయనం విడుదలవుతుంది. ఇది మలాశయం గోడల మీద రక్షణగా పనిచేసి క్యాన్సర్‌నుంచి మన శరీరాలను కాపాడుతుంది. యాపిల్‌ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని కార్నెల్‌ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చిలో తేలింది. 'ట్రిటర్‌పెనాయిడ్స్‌'గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్‌ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర. తొక్కులోనే కాదు... పండులోనూ అనేక రకాల క్యాన్సర్‌ నిరోధక ఫ్లేవనాయిడ్‌లూ ఫినోలిక్‌ ఆమ్లాలూ ఉంటాయి కాబట్టి తరచుగా యాపిల్‌ తినమని సూచిస్తున్నారు వారు.

రక్తహీనత: యాపిల్స్‌లో ఇనుము, ఆర్శినిక్, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్తహీనతలో బాగా పనిచేస్తుంది. తాజాగా జ్యూస్ తీసి వాడితే ఫలితాలు బాగుంటాయి. రోజు  తీసుకోగలిగితే మంచిది.

మలబద్ధకం, విరేచనాలు: యాపిల్స్ మలబద్ధకంలోను, విరేచనాలు రెంటిలోను ఉపయోగపడతాయి. దోరగా ఉన్న యాపిల్స్ మలబద్ధకంలో ఉపయోగపడతాయి. రోజుకు కనీసం రెండు యాపిల్స్‌ను తీసుకుంటేగాని మలబద్ధకంలో ఫలితం కనిపించదు. విరేచనాలవుతున్నప్పుడు ఉడికించిన యాపిల్స్ గాని బేక్ చేసిన యాపిల్స్ గాని ఉపయోగపడతాయి. ఉడికించే ప్రక్రియవల్ల యాపిల్స్‌లో ఉండే సెల్యూరోజ్ మెత్తబడి మలం హెచ్చుమొత్తాల్లో తయారవుతుంది.
 బాగా మిగల పండి, తియ్యని రుచి కలిగిన యాపిల్స్‌ని మెత్తగా చిదిమి వయసునుబట్టి ఒకటినుంచి నాలుగుపెద్ద చెంచాలు తినిపిస్తే జిగట విరేచనాలు తగ్గుతాయి.

ఉదర సంబంధ సమస్యలు: అల్పమైన జీర్ణక్రియా సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు యాపిల్ ఆహారౌషధంగా ఉపయోగపడుతుంది. యాపిల్‌ని ముక్కలుగా తరిగి మెత్తని గుజ్జుగా చేసి, దాల్చిన పొడిని, తేనెను చేర్చి తీసుకోవాలి. గింజలు, తొడిమ తప్ప యాపిల్‌ని మొత్తంగా ఉపయోగించవచ్చు. తిన బోయేముందు బాగా నమలాలి. ఆహార సమయాలకు మధ్యలో దీనిని తీసుకోవాలి. యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే పదార్థం అమాశయపు లోపలి పొర మీద సంరక్షణగా ఏర్పడి మృదుత్వాన్ని కలిగిస్తుంది. ముక్కలుగా తరిగిన యాపిల్స్‌కు పెద్ద చెంచాడు తేనెను చేర్చి కొద్దిగా నువ్వుల పొడిని చిలకరించి తీసుకుంటే జీర్ణావయవాలకు శక్తినిచ్చే టానిక్‌గా పనిచేస్తుంది.

తల నొప్పి: బాగా పండిన యాపిల్‌ని పైనా కిందా చెక్కు తొలగించి, మధ్యభాగంలోని గట్టి పదార్థాన్ని కూడా తొలగించి కొద్దిగా ఉప్పుచేర్చి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తహీనత వంటి కారణాలతో ఏర్పడిన తల నొప్పులు తగ్గుతాయి. 

గుండెజబ్బులు:  యాపిల్‌లో పొటాషియం, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటు పెరగదు. యాపిల్‌కు తేనెను చేర్చి తీసుకుంటే ఫలితాలు మరింత బావుంటాయి. యాపిల్‌లోని పొటాషియంవల్ల గుండె కండరాలు సమర్ధవంతంగా పనిచేస్తాయి. గుండెపోటు అవకాశాలు తగ్గుతాయి.

అధిక రక్తపోటు: రక్తపోటు ఎక్కువగా ఉన్న వారికి యాపిల్ మంచి ఆహారౌషధము
🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎

No comments:

Post a Comment