Thursday 7 December 2023

అధికంగా వేధిస్తున్న ఎసిడిటీ సమస్య - అద్భుతమైన ఆయుర్వేద గృహ చికిత్సలు

అధికంగా వేధిస్తున్న ఎసిడిటీ సమస్య - అద్భుతమైన ఆయుర్వేద గృహ చికిత్సలు*

👉ఏదైనా ఆహారం తినగానే గుండెలో,కడుపులో మంట వంటివి వస్తే.. ఈ పరిస్థితినే అసిడిటీ అంటారు 
👉జీర్ణాశయంలోని జఠర గ్రంధులు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ జఠర రసంలో హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక్కోసారి ఇది అధికంగా తయారవుతుంది. అలా అధిక ఉత్పత్తి కావడాన్నే ‘ఎసిడిటీ’ అంటారు.

👉ఎసిడిటీ వున్నవారికి చాతీలోను, గొంతులోను, గుండెల్లోనూ, జీర్ణాశయంలోనూ మంటగా వుంటుంది. 

👉 మలబద్ధకం, అజీర్ణం పెరిగి ఆకలి మందగిస్తుంది 
👉మసాలాలు,ఆల్కహాల్, పొగ త్రాగుడు, గుట్కాలు లాంటి పదార్థాలను పూర్తిగా మానివేయాల

👉ప్రతిరోజూ నియమిత సమయంలో, ఆహారాన్ని ఆదరా బాదరాగా కాక ప్రశాంతంగా.. బాగా నమిలి తినాలి.

👉కాబట్టి ఎసిడిటీనీ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ.. మన అలవాట్లు, ఆహార నియమాలలో వుంది.

👉 ప్రతివారూ కాస్త శ్రద్ధ తీసుకొని వీటిని పాటిస్తే.. ఎసిడిటీని తరిమేయవచ్చు.

👉పులుపు గా ఉన్న పదార్ధాలు తినికూడదు.
👉మసాలా వస్తువులు ఎక్కువగా తినకూడదు.
👉తేలికగా జీర్ణం అయ్యే పదార్ధములే తినాలి.
👉కొబ్బరి కోరుతో తయారయ్యే పదార్ధములు .నూనే వంటకాలు మితము గా తీసుకోవాలి (ఫ్రై ఫుడ్స్ ),

✍️ *పాటించాల్సిన ఆయుర్వేద గృహ చికిత్సలు:*

👉 అరటికాయను ముక్కలుగా తరిగి ఎండబెట్టి చూర్ణం చేసి పూటకు టీస్పూన్ చొప్పున అరకప్పు పాలతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి.

👉ఉసిరిపండ్ల తొక్కు (ఉసిరిపెచ్చులు) పొడిని మోతాదుకు అర టీస్పూన్ చొప్పున అరగ్లాసు పాలకు కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

👉 వేయించిన జీలకర్ర పొడికి సమభాగం కండచెక్కర కలిపి నిల్వచేసుకొని ఉదయం పరగడుపున అరటీ స్పూన్ మోతాదుగా తీసుకోవాలి.

👉రెండు చిన్న చెంచాలు అల్లం రసం, రెండు చిన్న చెంచాలు నిమ్మరసం, 2 చిన్న చెంచాలు తేనె కలిపి ఉ దయం ఖాళీ కడుపుతో వారం రోజులపాటు తీసుకొని చూడాలి.

👉 అడ్డసరం ఆకులు (వాసా), తిప్పతీగ (గుడూచి), వర్పాటకం పంచాంగాలు (పిత్తపావడా), వేపబెరడు, నేలవేము, పంచాంగాలు (కిరాతతిక్త), కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, చేదుపొట్ల ఆకులు (పటోల) వీటిని ఒక్కోటి ఒకటిన్నర గ్రాము చొప్పున తీసుకొని దంచి, అరలీటర్ నీళ్లకు వేసి మరిగించాలి. సగభాగం జలాంశం మిగిలిన తరువాత చల్లబరిచి, చెంచాడు తేనెకలిపి తీసుకోవాలి.

👉 నిమ్మరసం, అల్లం రసం, జీలకర్ర పొడి సమపాళ్లలో కలిపి తగినంత పంచదార కలిపి పాకం పట్టి, తీగపాకం వచ్చిన తరువాత దించి చల్లార్చి సీసాలో నిల్వచేసుకోవాలి.

దీనిని అవసరానుసారం మోతాదుకు టేబుల్ స్పూన్ చొప్పున అరకప్పు నీళ్లకు చేర్చి తీసుకోవాలి.

👉 వేపబెరడు లేదా ఆకులనూ, మారేడు పండు గుజ్జును కలిపి ముద్దగా నూరి, 10 గ్రాముల ముద్దను గ్లాసు నీళ్లకు కలిపి పావు గ్లాసు కషాయం మిగిలేంత వరకూ మరిగించి వడపోసుకొని తాగితే హెలికోబ్యాక్టర్ వంటి సూక్ష్మజీవుల కారణంగా తలెత్తే ఎసిడిటీలో చక్కని ఫలితం కనిపిస్తుంది.

👉కరి వేపాకును నీడలో ఆరబెట్టి, పొడిచేసి పూటకు టీస్పూన్ చొప్పున చిటికెడు ఉప్పుతో కలిపి రెండు పూటలా వారం పాటు తీసుకోవాలి.

👉గుప్పెడు తులసి ఆకులను నలిపి ముందు రోజు రాత్రి గ్లాసెడు చన్నీటిలో వేసి మరునాడు ఉదయం ఆ నీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మానసిక అలజడి తగ్గి ఎసిడిటి దూరమవుతుంది.

👉 పిల్లిపీచర గడ్డలను (శతావరి) ముద్దగా నూరి పూటకు టీస్పూన్ మోతాదుగా నీళ్లతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి.

👉వస కొమ్ము చూర్ణాన్ని పూటకు పావు టీస్పూన్ మోతాదుగా, తేనె, బెల్లం కలిపి రెండు పూటలా తీసుకోవాలి. 

👉శొంఠి చూర్ణాన్ని, గుడిచి సత్వాన్ని సమభాగాలుగా, తేనెతో కలిపి పూటకు 1-2 గ్రాముల మోతాదులో రెండు పూటలా తీసుకోవాలి.

👉త్రిఫలా చూర్ణం, కటుకరోహిణి బూ మికoద చూర్ణం సమాన భాగాలు కలిపి పటికబెల్లం కలిపి పూటకు 2-3 గ్రాముల మోతాదులో రెండు పూటలా తీసుకోవాలి.

👉కరక్కాయల చూర్ణం, భృంగరాజ పంచాంగ చూర్ణం సమభాగాలు కలిపి పాతబెల్లంతో పూటకు 2-3: గ్రాముల మోతాదులో రెండు పూటలా తీసుకోవాలి.

👉రక్కాయ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఆమ్లపిత్తంలో హితకరంగా ఉంటుంది.

👉గుప్పెడు పచ్చని ధనియాలను రాత్రి నీటిలో నానవేసి ఉదయం ఆ నీటిలో చక్కెర కలిపి తీసుకోవాలి.

👉బెల్లం, రావిచెట్టు పట్ట, కరక్కాయ చూర్ణం సమభాగాలు తీసుకొని మెత్తగా నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసి రెండు పూటలా ఒకో మాత్రచొప్పున వాడితే పైత్యం తగ్గి ఆకలి పుడుతుంది.

👉 ఓమం (వాము) గింజల పొడిని రెండు భాగాలు, జిలకర,వంటసోడా ఒక భాగం చొప్పున నిల్వచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోతాదుకు అర టీస్పూన్ చొప్పున నోట్లో వేసుకొని గోరువెచ్చని నీళ్లతో మింగేయాలి.

*పైన సూచించిన చిట్కాలు ప్రారంభ దశలో పని చేస్తాయి. మీ సమస్య తీవ్రతను మాకు తెలిపితే అద్భుతమైన మందులు మీకు పంపబడుతుంది. 100% అద్భుతమైన శాశ్వత పరిస్కారం పొందుతారు*

ఈ విలువైన సమాచారాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు
*
*మా Cell.9949363498

No comments:

Post a Comment