Friday, 8 December 2023

మతి_మరుపును_ఎలా_జయించాలి ? ఎలా హ్యాండిల్ చేయాలి ? ఎలా అధిగమించ గలం

*మతి_మరుపును_ఎలా_జయించాలి ? ఎలా హ్యాండిల్ చేయాలి ? ఎలా అధిగమించ గలం ?అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*

          మతి మరుపు రెండు రకాలుగా ఏర్పడుతుంది. మొదటి రకం శారీరక డ్వామెజ్ ద్వారా రెండవది మానసిక డ్యామేజ్ ద్వారా ఏర్పడేది వీటి మెదటి రకం నివారణకు గత్యంతరంలేని మెడిషన్ ….రెండవ రకం నివారణకు మెడిటేషన్ అందుకు ఏకాగ్ర మనోదీపాన్ని వెలిగించాలి…సంకల్పాలను ఆలోచనలను ఉత్పత్తి చేసే కర్మాగారం మనిషి మనసు అటువంటి మనసు నిద్రాణమైనప్పుడు జ్ఞాపకశక్తిని కోల్పొవడం జరుగుతుంది. పునరుద్ధరింప చేయటకు పూజా పునస్కార రహిత పాజిటీవ్ సంకల్పాల మెడిటేషన్ తో నిద్రాణమనసును నిదురలేపుట అత్యవసరం నాకు కూడ రెండవ రకం ఏర్పడినది. ఏకాగ్ర వ్యాపక మెడిటేషన్ తో చాలా చాలా మతిమరుపును తగ్గించుకున్నా ఫలితాలను పొందుకున్నాను.

*కింద ఇచ్చిన సలహాలను పాటిస్తే మతిమరుపు అదుపులో ఉంటుంది.*

1.-ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం చెయ్యడం.
2.-మెదడును యాక్టివ్ గా ఉంచుకోవడం. అంటే మెదడుకు మేత పెట్టే ప్రహేళికలు (పజిల్స్), పదవినోదం, సుడోకు లాంటివి రోజూ సాధన చేస్తూ ఉండటం.
3.-మెమరీకి సంబంధించిన ఆటలు ఏదైనా ఆడుతూ ఉండటం. ఉదాహరణకు ఎవరినైనా కొన్ని వస్తువులు ఒక గదిలో పెట్టమని, వాటిని మీరు ఒక నిమిషం పాటు చూసి బయటకు వచ్చి, ఏమేం చూసి వచ్చారో అన్నీ గుర్తు చేసుకుని చెప్పడం, రాయడం. ఇది పిల్లల్లో కూడా జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఆడించవచ్చు. ఇది మా చిన్నప్పుడు మా ఉపాధ్యాయులు అప్పుడప్పుడూ ఆడించేవారు. ఇంటర్నెట్ లో వెతికితే మరిన్ని ఆటలు దొరకవచ్చు. కానీ శ్రద్ధగా సాధన చేయడం ముఖ్యం.
4.-ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అన్నింటికీ మంచిది.
5.-నలుగురితో ఉల్లాసంగా గడపడం. ఇందువల్ల నిద్రాణమైన జ్ఞాపకాలు బయటికి వచ్చి జ్ఞాపకశక్తి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
6.-ఇంట్లో మీరు వాడే వస్తువులను క్రమపద్ధతిలో ఉంచుకోవడం వల్ల, ఏది ఎక్కడ ఉంటుందో సులభంగా గుర్తుంటుంది. ఉదాహరణకు మీ కళ్ళజోడు ఎప్పుడూ బెడ్ పక్కనే చిన్న టేబుల్ మీద ఉంచే అలవాటు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కనబడనప్పుడు నేరుగా అక్కడికే వెళ్ళి వెతకచ్చు, ఇంట్లోవాళ్ళెవరైనా ఆ చోటు మార్చేస్తే తప్ప.
7.-మంచి నిద్ర కేవలం మతిమరుపు నివారించడానికే కాదు, పూర్తి ఆరోగ్యానికి అవసరం. మంచి నిద్రలో మెదడు సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తుంది. మరిచిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660,*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02bBsHLJMp1W31zBMHEbUcDkcvymdnLaXpECEuwnBPSWxpSnXW5sXJGKbPQr5PHYsjl&id=100057505178618&mibextid=Nif5oz
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment