*👆Air Polution & Health Problems..3.1.2024.*
*రోజూ రోజు కు పెరుగు తున్న పొల్యూషన్ నుండి మనము ఎలా ఎదురుకోవాలి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు నివారణ పరిష్కారం మార్గంలు*
నేటి తరుణంలో ఎక్కడ చూసినా వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతున్నది. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమలు, అడవులను ధ్వంసం చేయడం తదితర అనేక కారణాల వల్ల వాయు కాలుష్య తీవ్రత ఎక్కువవుతున్నది. దీంతో ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో సతమతం అవుతున్నారు. ఊపిరితిత్తుల్లో కాలుష్య కారకాలు చేరి అవి వ్యాధులను కలగజేస్తున్నాయి
*👉🏿బ్రెయిన్ తో పాటు డయాబెటిస్ పేషంట్లు కనుక పొల్యూషన్ కి గురైతే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ చేరి ట్యూబర్కిలోసిస్ లాంటి వి ఎఫెక్ట్ అవడానికీ ఛాన్సులున్నాయి*
*👉🏿శ్వాసకు మనస్సుకు చాలా దగ్గరి సంబంధం ఉంది. సహజంగా చూస్తే శ్వాసే మనస్సు. శ్వాస స్థూల రూపం, మనస్సు దాని సూక్ష్మ రూపం. శ్వాసే మనస్సుగా మారుతుంది. కావున శ్వాస కదిలితే మనస్సు కదులుతుంది. శ్వాస ఆగితే మనస్సు ఆగుతుంది. మనస్సు ఆగితే శ్వాస ఆగుతుంది.* కావున ద్యానంలో మొదట శ్వాస తగ్గుతుంది, తర్వాత మనస్సు ఆగుతుంది. మనస్సు ఆగితే సత్యం తెలుస్తుంది.
*👉🏿రోడ్లమీద ఎయిర్ పొల్యూషన్ మెదడుకు ఎంత ప్రమాదం అంటే…*
హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ వంటి నగరాల్లో గంటల తరబడి రోడ్ మీద కాలుష్యంలో గడుపుతూ ఉంటాం. అయితే అనేకమందికి బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు ఉత్పన్నం కావడానికి ఈ ఎయిర్ పొల్యూషన్ కారణమవుతోంది.
2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణం కలిగిన ధూళి కణాలు ముక్కు ద్వారా నేరుగా బ్రెయిన్ లోని olfactory cortex అనే ప్రదేశంలోకి చేరుకుంటున్నాయి. అలాగే ఊపిరితిత్తుల ద్వారా, ప్రేగుల ద్వారా రక్త ప్రవాహంలోకి కూడా అనేక కణాలు మళ్లీ బ్రెయిన్‌కి వెళ్తున్నాయి. అనేక సందర్భాల్లో మనిషి బ్రెయిన్‌ని పోస్ట్‌మార్టం చేసినప్పుడు వివిధ వాహనాల ఇంజిన్స్ నుండి బయటకు వచ్చే ధూళిని పోలిన కణాలు ఫ్రాంటల్ కార్టెక్స్‌లో దర్శనమివ్వడం ఆందోళన కలిగించే అంశం. అంతేకాదు, అధిక సమయం పాటు వాయుకాలుష్యం లో గడిపిన వారి బ్రెయిన్‌లో వైట్ మాటర్ పరిమాణం బాగా తగ్గినట్లు కూడా రుజువయింది.
వాయు కాలుష్యానికి గురి అయ్యే చిన్నపిల్లల విషయంలో బాసల్ గాంగ్లియా వంటి బ్రెయిన్‌లోని ముఖ్యమైన ప్రదేశాలు చాలా నెమ్మదిగా డెవలప్ అవుతున్నట్లు పలు MRI స్కాన్ల ద్వారా నిరూపితమైంది. బ్రెయిన్ సెల్స్ దెబ్బ తినడానికి కూడా వాయు కాలుష్యం పరోక్షంగా కారణం అవుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే జ్ఞాపకశక్తికి సంబంధించిన అతి పెద్ద సమస్య అయిన అల్జీమర్స్‌కి కారణమయ్యే amyloid-B ప్రొటీన్ వాయు కాలుష్యానికి గురి అయ్యే వ్యక్తుల్లో ఎక్కువగా ఉంటున్నట్లు ఆధారాలు లభించాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేవలం శ్వాసకోశ సంబంధిత సమస్యలు మాత్రమే కాదు.. ఇంకా అనేక రకాలుగా మనిషి వాయు కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఎవరికీ వ్యక్తిగతంగా మందులు సూచించడం జరగదు..దయచేసి గమనించండి.
"మీ ఫేమిలీ డాక్టరుని గాని..దగ్గరలో డాక్టరుని గాని సంప్రదించండి..ఇంకాఏదైనా వ్యాధి వివరాలు కావాలంటే ఈ గ్రూపులో నేను ముందు పెట్టిన పోస్టులు చూడండి..అవగాహన పెంచుకోండి... *ఎవరికీ మందులు సూచించడం ఈ గ్రూపులో సాధ్యం కాదు*"
సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://fb.watch/pjWl4Aj3k3/?mibextid=Nif5oz
No comments:
Post a Comment