Tuesday, 2 January 2024

ముఖంపై నల్లని మంగు మచ్చలు ఉన్నాయని బాధపడుతున్నారా

*ముఖంపై నల్లని మంగు మచ్చలు ఉన్నాయని బాధపడుతున్నారా.అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
      అందమైన ముఖాన్ని అందహీనంగా మార్చే నల్లని మచ్చలనే మంగు మచ్చలని అంటారు. సీతాకోకచిలుక రెక్కలను పోలి ఉండే ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుండి ముక్కు వరకూ వ్యాపిస్తాయి. ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు వెనుకభాగంలో ఏర్పడే అవకాశం ఉంది. 
 
కారణాలు
శరీరతత్వాన్ని బట్టి బొబ్బలు, మొటిమలు వ్యాపించటం.. చర్మానికి తగిలిన గాయాలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు, పుట్టు మచ్చలు మొదలైనవి కారణాలుగా చెప్పవచ్చు. వంశపారంపర్యం గానూ, హార్లోన్లలో సమతుల్యత లోపించడం వల కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను పోగొట్టడానికి మెరుగైన చికిత్స తీసుకోవాలి
     మీరు సహజ మార్గంలో నల్లని మచ్చలను తొలగించుకోవాలి అనుకుంటున్నారా? తెల్లని ఛాయ కలిగిన స్త్రీల అందమైన మొహంలో నల్ల మచ్చలు చాలా స్పష్టంగా ఇబ్బందికరంగా కనిపిస్తాయి. అయితే ముఖం మీద కనిపించే ఈ నల్లని మచ్చలు మీద ప్రభావంతంగా పనిచేసే ఎన్నో రకాల కాస్మొటిక్ ఉత్పత్తులు సులభంగా నేడు లభిస్తున్నాయి. కానీ చాలామంది మార్కెట్ లో లభించే ఈ క్రీములని అధిక మొత్తంలో ఉపయోంచడం వలన చర్మ సమస్యలు ఏర్పడి ఎంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి మీరు కొన్ని గృహ నివారణలు పాటించడం వలన ఎంతో సులభంగా ముఖం మీద నల్లని మచ్చలను తొలగించడానికి చికిత్స చేయవచ్చు. చర్మపు పొరల మీదగా నల్ల మచ్చల వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంతమంది చర్మములో అదనపు మెలానిన్ స్రావాలను కలిగి ఉండటం వలన, మరి కొందరు సూర్య రశ్మిలో ఎక్కువసేపు గడపడం వలన చర్మం ప్రభావితం కాబడినప్పుడు ఇదే సమస్యని పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ ముఖం మీద నల్లని మచ్చలను తొలగించడానికి గొప్ప సహజమైన చిట్కాలను అందిస్తున్నాం. గర్భం దాల్చిన స్త్రీలు అలాగే కొన్ని ప్రత్యేకమైన మందులు వాడుతున్న ప్రజలు కూడా చర్మం మీదగా నల్లని మచ్చలు ఏర్పడి ఇబ్బంది పడుతూ ఉంటారు.పూర్తి ఆరోగ్య సమస్య కోసం మన వైద్య నిలయం గ్రూపులో చూడాలి
https://www.facebook.com/1536735689924644/posts/2327052977559574/

*👉🏿ముఖం మీద నల్లని మచ్చల చికిత్సకు*

*1.-నిమ్మకాయ మరియు తేనెలతో ఫేస్ ప్యాక్*

సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయ పుష్కలమైన విటమిన్ సి మూలకాలను కలిగి తేనెతో అది కలిసినప్పుడు ముఖ చర్మం మీద మొటిమలు, మచ్చలు, కురుపులు వంటి అన్ని రకాల సమస్యలకు అద్భుతమైన నివారిణిగా పనిచేస్తుంది. దీనికోసం మీరు కొన్ని తాజా నిమ్మ చెక్కలను గ్రైండ్ చేసి దానికి ఒక చెంచా తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాసుకోండి. దానిని కాసేపు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి. ఈ చిట్కాని రోజు తప్పించి రోజు అనుసరించండి.
*2.-వేప ఫేస్ ప్యాక్*
పురాతన ఆయుర్వేదం వేప యొక్క చర్మ సంరక్షిత అద్భుత లక్షణాలను విశదీకరిస్తుంది. వేప ఆకులు ముఖం మీద మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను అధిగమించడానికి ఎంతో గొప్ప ఉపకరణాలు అని చెప్పవచ్చు. దీనికోసం చేతి నిండా తాజా వేప ఆకులని తీసుకుని దానికి చూర్ణం ఏర్పడడానికి సరిపడా రోజ్ వాటర్ కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి ఒక 15 నిముషాలపాటు ఆరనివ్వాలి. ప్యాక్ పూర్తిగా ఎండిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి 
*3.-ఉసిరికాయ:* విటమిన్ సి పుష్కలంగా కలిగివుండే ఉసిరిని కేశ సంరక్షణ కోసం ఉపయోగించుకోవచ్చు. కొబ్బరినూనెలో ఉసిరికాయలను వేసి తలకు పట్టిస్తే మృదువైన, దట్టమైన కేశాలు మీ సొంతం అవుతాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. 

*4.-సున్నిపిండి:* సున్నిపిండిని రోజూ స్నానానికి ముందు ముఖానికి పట్టిస్తే చర్మం కాంతివంతం అవుతుంది. అంతేగాకుండా సున్నిపిండి పాల క్రీమ్ కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. 
*5-ఆలివ్ ఆయిల్:* ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే మొటిమలకు చెక్ పెట్టడంతో పాటు చర్మం పొడిబారకుండా ఉంటుంది.
*6.-పసుపు :* క్రిములను నాశనం చేసే పసుపును చర్మానికి ఉపయోగించడం ద్వారా అలెర్జీలకు చెక్ పెట్టవచ్చు. 
*7.-ఆపిల్ :* మొటిమలు, మచ్చలను ఆపిల్ దూరం చేస్తుంది. ఆపిల్ మాస్క్ ద్వారా ఇంకా చర్మం మృదువుగా తయారవుతుంది. ముందుగా ఆపిల్ ముక్కలతో ముఖానికి మసాజ్‌లా చేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ పేస్ట్‌తో ఒక టేబుల్ స్పూన్ బంగాళాదుంప పేస్ట్ చేర్చి ముఖానికి పట్టించాలి. 10 లేదా 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది 
*8.-కుంకుమ పువ్వు:* మీరు అందంగా తెల్లగా కనిపించాలంటే కుంకుమ పువ్వును వాడాలి. పాలులో కుంకుమపువ్వును చేర్చి ముఖానికి పట్టిస్తే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, కంటి కింద ఉండే నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చు. 
 *9.-రోజా పువ్వులు:*  తాజా పువ్వులతో తయారు చేసే రోజ్ వాటర్‌ను టోనర్‌గా ఉపయోగించవచ్చు. ఇది జిడ్డుకు చెక్ పెట్టవచ్చు 
*10.-ముఖము పైన నల్లని మచ్చలు* ఏర్పడిన కలబంద గుజ్జు తీసుకొని అందులో తగు మాత్రం పసుపు కలిపి ముఖము నకు రాసి ఒక గంట సమయం వరకు ఆరనిచ్చి తర్వాత ముఖము కడుక్కోవాలి. ఈ విదంగా చేసిన చో ముఖము పై నల్లని మచ్చలు పోయి కాంతి వఁతముగా యుండును .
*11.-మెడ నల్లగా వున్నా వాళ్ళ కోసం*
ముల్తానీ మట్టి, వేప, రోజ్ వాటర్ వాడటం వలన నల్లని మచ్చలు తొలగుతాయి. వీటితో ప్యాక్ తయారు చేసి మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి. మొటిమలతో బాధపడే వారికి ఇది ఒక మంచి చిట్కా.
టాన్ చర్మం కోసం
ముల్తానీ మట్టి, తేనే, శనగపిండి మరియు దోసకాయ రసం తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇది టాన్ చర్మాన్ని తొలగించుటకు వేసవిలో ఉపయోగపడుతుంది.
*13.-మంగు మచ్చలు పోవుటకు:-*
సీమబాదంపప్పును నీళ్ళతోఅరగదీసి.మంగు ఉన్నచోట పైన పట్టంచుచుండిన యెడల మంగు మచ్చలు పోవును.

*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
       *సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించలి 

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

No comments:

Post a Comment