Sunday 14 January 2024

ఉల్లికాడ

ఉల్లికాడల్లో పీచు పదార్ధం ఎక్కువ. తరచుగా తినేవారిలో బరువు సమస్య ఏర్పడదు. ఇంకా మలబద్ధక సమస్య కూడా ఉండదు. ఉల్లి కాడల్లో ఉన్న డైటరీ ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది.
ఫైల్స్ సమస్యతో ఇబ్బందిపడేవారు ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా పెరుగు వేసుకుని అందులో ఉల్లికాడ ముక్కలను కలిపి.. రోజుకి రెండుసార్లు తింటే పైల్స్ స‌మ‌స్య త‌గ్గుతుంది. పైల్స్ వ‌ల్ల వ‌చ్చే వాపులు, నొప్పి కూడా త‌గ్గుతాయి.
ఉల్లికాడ‌ల్లోనే స‌ల్ఫర్ అధికం. దీంతో తరచుగా తినే ఆహారంలో చేర్చుకుంటే కొలెస్ట్రాల్‌ను, హైబీపీని అదుపులో ఉంటాయి.
జ‌లుబు, ద‌గ్గుతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడ‌ల‌ సూప్‌ దివ్య ఔషధం. ఉల్లికాడల సూప్ తాగితే దగ్గు జలుబు నుంచి వెంటనే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
ఉల్లికాడ‌ల్లో  ఉండే పెక్టిన్ అనే ప‌దార్థం పెద్ద పేగుల్లోని సున్నిత‌మైన పొర‌ల‌ను ర‌క్షిస్తుంది. దీంతో పెద్ద పేగు దెబ్బ తిన‌కుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
ఉల్లికాడల్లో ఉన్న గ్జియాంతిన్ అనే పదార్థం కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటూ, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
స్ప్రింగ్ ఓనియన్స్ లో ఉన్న ఫోలేట్లు గుండె జబ్బులని అదుపులో ఉంచుతాయి.
ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకొనే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. వాటిల్లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ‘సి’, బీటా కెరొటిన్ కూడా ఎక్కువ మొత్తంలోనే లభిస్తాయి.
ఉల్లికాడ‌ల్లో పోష‌కాలు అధికం.  స్త్రీ గర్భందాల్చిన మొదటి మూడు నెలల్లో తరచుగా ఉల్లికాడలను తింటే.. కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది. గర్భస్థ శిశువుకి వెన్నెముక సమస్యలను నివారిస్తుంది. ఆటిజం వంటి ప్రవర్తనాపరమైన సమస్యలు దరిచేరవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఉల్లికాడ‌ల‌ను ర‌సం ఒక టీ స్పూన్, ఒక టీ స్పూన్ తేనే కలిపి రోజూ తీసుకుంటే శరీర రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

No comments:

Post a Comment