Thursday 11 January 2024

షుగర్‌_అదుపులో_ఉండాలంటే_ఏం_తినాలోమరియు_ఏమి_తినవద్దు_తెలుసా..?

*షుగర్‌_అదుపులో_ఉండాలంటే_ఏం_తినాలోమరియు_ఏమి_తినవద్దు_తెలుసా..?#అవగాహన_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు*

                      ఈ రోజుల్లో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ షుగర్‌ వ్యాధి వస్తున్నది. ఈ దీర్ఘకాలిక వ్యాధి ఇంతలా పెరిగిపోవడానికి కారణం.. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిళ్లతో కూడిన జీవనవిధానమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఒక్కసారి మనం సుగర్‌ బారిన పడ్డామంటే.. దానికితగ్గ మెడిసిన్లు వాడటం ఎంత ముఖ్యమో, తగిన ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఒంట్లో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడం అసాధ్యం. కాబట్టి షుగర్‌ పేషెంట్లు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

*షుగర్_వ్యాధిగ్రస్తులు_తప్పక_తెలుసుకోవాల్సిందే*
*మధుమేహం రావడానికి గల కారణాలు - పాటించవలసిన ఆహార నియమాలు -*
    ఔషదాలు.
మధుమేహము కలిగినటువంటి మనుష్యుని యొక్క మూత్రం తేనె వలే తియ్యటి మరియు చిక్కటి మూత్రం వెలువరించును. ఈ మధుమేహము రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది శరీరం నందలి రస,రక్త ధాతువులు కొన్ని కారణాలచే క్షీణించడం వలన వాతం ప్రకోపించడం వలన కలుగునది. రెండోవది శరీరం నందు వాతం సంచరించు మార్గములలో కొన్ని దోషములు అడ్డగించునపుడు వాతం ప్రకోపం చెంది కలుగునది . మొద
టి రకమైన ధాతు క్షయముచే వచ్చు మధుమేహము తగ్గుట అసాధ్యము. జీవితాంతం ఔషధాలు వాడుతూ ఉండవలెను.వివరాలు కూ లింక్స్ లో చూడాలి https://www.facebook.com/1536735689924644/posts/2666480913616777/

*మధుమేహ_రోగులు_తీసుకోవలసిన_ఆహార_పదార్థాలు నవీన్ సలహాలు -*
పాతబియ్యం , పాత గోధుమలు, రాగిమాల్ట్, మేకమాంసం , మజ్జిగ, కందిపప్పు కట్టు, పెసర కట్టు, పాత చింతపండు, ఉసిరికాయ, వెలగపండు, తోటకూర, పాలకూర, మెంతికూర , కొయ్యతోటకూర, పొన్నగంటికూర, లేత మునగ కూర, లేత బీరకాయ, లేత సొరకాయ, లేత పొట్లకాయ, లేత బెండ , లేత క్యాబేజి, లేత టమాటో లేతవి మాత్రమే తీసుకోవాలి . బూడిద గుమ్మడి , కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి .జొన్నరొట్టె చాలా మంచిది.

*తీసుకోకూడని_ఆహారపదార్థాలు -*
                తేలికగా అరగని ఆహారం నిషిద్దం, చేపలు , రొయ్యలు తినరాదు. మద్యపానం , ధూమపానం నిషిద్దం , పెరుగు వాడరాదు , ఇంగువ, వెల్లుల్లి వాడకూడదు, నువ్వులు , నువ్వుల నూనె , ఆవాలు, ఆవనూనె వాడరాదు. ఎర్రగుమ్మడి తీసుకోరాదు, శనగపిండి తినరాదు, నూనెతో వేపిన పదార్థాలు వాడరాదు, కొబ్బరి ముట్టుకోకూడదు, పనస, ద్రాక్ష, కమలా పండ్లు నిషిద్దం, దుంపకూరలు పూర్తిగా మానివేయాలి, భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు, బెల్లము , కొత్త చింతపండు వాడరాదు .

*మధుమేహంలో_ఉపయోగపడు_ఔషధాలు నవీన్ రోయ్ సలహాలు -*
* పొడపత్రి ఆకు రసాన్ని రోజుకి పావుకప్పు తాగుతుంటే ఈ వ్యాధి తగ్గును.
*ఇండుప గింజ సగం వరకు అరగదీసి ఆ గంధాన్ని ప్రతినిత్యం నీటిలో కలిపి తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.*
* నేరేడు గింజల చూర్ణం పావు చెంచా ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ నీటితో కలిపి సేవించుచున్న మధుమేహం నియంత్రణ అగును.
* మధుమేహం అతిగా ఉన్నవారు పూటకి ఒక లవంగ మొగ్గ చప్పరిస్తూ ఉన్న మధుమేహం నియంత్రణ అగును.
*ప్రతినిత్యం ఒక కప్పు ఉలవలు ఉడకపెట్టిన నీటిని తీసుకొనవలెను .*
* త్రిఫల చూర్ణమునకు మధుమేహం తగ్గించే గుణము కలదు. కాకపోతే బయట దొరికే త్రిఫల చూర్ణం లో కరక్కాయ, తానికాయ, ఉశిరికాయ సమపాళ్లలో ఉంటాయి . అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే మోతాదులో తయారుచేసుకొని రోజు రాత్రిపూట అరచెంచా చూర్ణం అరకప్పు నీటిలో వేసుకొని రాత్రిపూట పడుకునేప్పుడు తాగవలెను . కరక్కాయ పెచ్చులు చూర్ణం ఒక భాగము , తానికాయ చూర్ణం రెండు భాగాలు , ఉశిరికాయ చూర్ణం మూడు భాగాలు కలిపి ఒకే చూర్ణంగా రూపొందించుకొని రాత్రిపూట వాడుచున్న మధుమేహం త్వరగా నియంత్రణకు వస్తుంది.
*తంగేడు పువ్వుల కషాయం ఉదయం , సాయంత్రం సేవించుచున్న మధుమేహము తగ్గును.*
* రోజూ అరటిపువ్వుని ఉడకబెట్టి అల్పహారంగా తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.
*మర్రిచెట్టు బెరడు చూర్ణం అరచెంచా కాని లేక బెరడు కషాయం పావుకప్పు కాని ప్రతినిత్యం సేవించుచున్న మధుమేహం నిశ్చయంగా తగ్గును.*
* ఉసిరికాయల కషాయం కాని లేక ఉసిరిగింజల కషాయం రోజుకి అరకప్పు తాగుచున్న మధుమేహం తగ్గును.
*లేత మామిడి ఆకులు ఎండించి చూర్ణం చేసి రోజుకి అరచెంచా తీసుకున్నచో మధుమేహం తగ్గును.*
నా అనుభవ యోగాలు -
* మధుమేహం 300 వరకు ఉంటే మూడు మారేడు దళాలు అనగా 9 లేత ఆకులు ఉదయాన్నే పరగడుపున , సాయంత్రం ఆహారానికి గంట ముందు తినుచున్న కేవలం 15 నుంచి 20 రోజుల్లో 170 నుంచి 190 వరకు వచ్చును. ఆ తరువాత రెండు మారేడు దళాలు చొప్పున ఉదయం , రాత్రిపూట పైన చెప్పిన సమయాల్లో తీసికొనవలెను. త్వరలోనే సాధారణ స్థితికి వస్తారు.
* పొడపత్రి చూర్ణం ఒక స్పూన్ , నేరేడు గింజల చూర్ణం ఒక స్పూన్ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి రాత్రి సమయంలో ఆహారానికి గంట ముందు సేవించవలెను . అదేవిధముగా రాత్రిపూట పైనచెప్పిన మోతాదులో గ్లాసు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున సేవించవలెను .
పైన చెప్పినవన్నీ నేను కొంతమంది వ్యాధిగ్రస్తుల చేత వాడించాను . చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఒకేసారి అల్లోపతి ఔషధాలు ఆపి ఇవి వాడవద్దు. ఇవి వాడుతూ అల్లోపతి ఔషదాల మోతాదు తగ్గించుకుంటూ చివరకి పూర్తిగా ఆపివేయవచ్చు .
ఈ ఔషధాలు వాడు సమయంలో టీ , కాఫీ , మద్యం , మాంసాహారం ముట్టుకోరాదు. త్వరగా గుణం కనిపించును

*ధాన్యం*
                మధుమేహం ఉన్నవారు అన్ని రకాల ధాన్యాలు ఆహారంగా తీసుకోవచ్చు. అయితే, చిరుధాన్యాలే తప్ప బియ్యంతో చేసిన వంటలు తినకూడదని కొందరు చెబుతుంటారు. ఇది ఒక తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే.. గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు మొదలైన ధాన్యాల్లో ఉన్నట్టే బియ్యంలో కూడా 70 శాతం పిండి పదార్థం ఉంటుంది. కాబట్టి చిరుధాన్యాలతో చేసిన వంటలలాగే వరి అన్నమూ తినవచ్చు. ఇక్కడ ఏ ధాన్యం తింటున్నామన్నది ముఖ్యంకాదు, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం అన్నదే ముఖ్యం.

*ఆకు_కూరలు*
                       షుగర్‌ పేషెంట్లకు అన్ని రకాల ఆకు కూరలు మంచివే. అయితే అన్నిటికంటే పాలకూర ఇంకా మంచిది. ఎందుకంటే దీనిలో కావాల్సినంత ఫైబర్‌ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం కాకుండా చూస్తుంది. దీనివల్ల ఆహారంలోని చక్కెరలు ఒకేసారి రక్తంలో కలువకుండా ఉంటాయి. దీంతో షుగర్‌ లెవల్స్‌ అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉండదు.

*కాయగూరలు*
                         ఇక కాయగూరల విషయానికొస్తే.. మధుమేహం ఉన్నవారు టమాట, వం కాయ, బీరకాయ, గోకరకాయ, చిక్కుడుకాయ, బెండకాయ, క్యాబేజి, కాలీఫ్లవర్‌, బ్రకోలి, దోసకాయ, మునగకాయ, ఆనక్కాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అయితే, వీటన్నిటికంటే టమాటాలు మరింత శ్రేష్ఠమైనవి. వీటిలో కేలరీలు తక్కువ. C విటమిన్ ఉంటుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టమాటాల్లో ఉండే విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది.

*బ్రకోలి*
                   డయాబెటిస్‌ ఉన్నవారికి బ్రకోలీ కూడా మంచి ఆహారం. దీనిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్‌తోపాటు విటమిన్ A, C, K ఉంటాయి. దీంతో ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బ్రకోలీలో గుండె సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది శరీరంలో వేడిని కూడా ఇది తగ్గిస్తుంది.

*పప్పు_దినుసులు*
                          షుగర్ పేషెంట్ల ఆహారంలో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూడాలి. పప్పు దినుసుల నుంచి లభించే ప్రొటీన్‌లు మాంసాహారంలో లభించే ప్రొటీన్‌ల కంటే మేలైనవి. ఇవి ప్రొటీన్లతోపాటు ఫైబర్స్‌ను కూడా అధికంగా కలిగి ఉంటాయి. ఈ రెండు పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచుతాయి.

*చేపలు*
                  మధుమేహం ఉన్నవారు చేపలు తింటే చాలా మంచిది. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే షుగర్‌ పేషెంట్లు వారంలో ఒక్క రోజైనా చేపలను తింటే మంచిది. అయితే వేపుడ్ల రూపంలో కాకుండా, ఉడికించి తినడం ఉత్తమం.

*ఓట్స్_బెర్రీస్‌*
                 ఇవి శరీరంలోని చెడు కొవ్వులను తగ్గించి, రక్తంలోని చక్కెర స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచే ఆరోగ్యవంతమైన ఫైబర్‌ను కలిగి ఉంటాయి. ప్లెయిన్ ఓట్స్ తక్కువ చక్కెరలను కలిగి ఉండి, నెమ్మదిగా జీర్ణమవుతాయి. బెర్రీస్ తక్కువగా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి.
*ధన్యవాదములు🙏* 
*మీ నవీన్ నడిమింటి* 
ఫోన్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment