*అరికాళ్లు_మడిమలు_మరియు_కీళ్ల_నొప్పులకి_కారణం_ఏ_విటమిన్_లోపం_అయి_ఉంటుంది?*
*కీళ్ల_వాతం_కినవీన్ నడిమింటి వైద్య _నిలయం_సలహాలు*
D విటమిన్ లోపం వల్ల చాలా నష్టాలు వున్నాయి.. రోజుకు ఒక అరగంట ఓపిక ఉంటే, ఎండలో వాకింగ్ చేయాలి.. లేకపోతే ఎండలో అన్నా కూర్చోవాలి…ఓట్స్, రాగి, లాంటివి ఎక్కువ తీసుకోవాలి
కొంతమంది షుగర్ కూడా కారణం కావచ్చు షుగర్ ఉన్న గాని అరికాళ్ళకు తిమ్మిర్లు పెట్టి నొప్పి వస్తుంది.
ఎందుకైనా మంచిది షుగర్ టెస్ట్ చేయించుకోండి బిపి కూడా. మీ వయసు చెబితే కొంచెం అవగాహన వస్తుంది.
👉కీళ్ల వాతం అనేది కీళ్లలో నొప్పి మరియు వాపుతో కూడిన ఒక అనారోగ్య పరిస్థితి.
👉కీళ్ల వాతానికి జన్యుపరమైన కారకాలు, బరువు పెరగడం, గాయాలు కావడంతో సహా అనేక కారణాల ఉన్నాయి.
✨ఇంటి వైద్యం కీళ్ల వాతం యొక్క ప్రభావాన్ని తగ్గించి ఉపశమనం కలగజేస్తుంది.
💥వేడి కాపడం కీళ్లలోని నొప్పి మరియు వాపును తగ్గించడానికి వేడి నీటి స్నానం, హీట్ ప్యాక్, లేదా అల్ట్రాసౌండ్ థెరపీ వంటి వేడి చికిత్సలను ఉపయోగించవచ్చు.
నొప్పి ఉన్న భాగాన్ని , మరియూ అరిపాదాలు, ప్రతిరోజూ రెండు పూటలా నువ్వుల నూనె తో మర్ధనా చేసి అరగంట తర్వాత వీలైనంత వరకూ ఇంట్లో నడవడం అభ్యాసం చేయాలి.వైద్య నిలయం లింక్స్ https://fb.me/4eNMuT01m
💥వాపు మరియు నొప్పిని తగ్గించడానికి ఐస్ ప్యాక్‌ను కీళ్లపై 20 నిమిషాలు వేసి, 20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం ద్వారా శీతల చికిత్సను అందించవచ్చు.
💥వాకింగ్, స్విమ్మింగ్, యోగ వంటి తక్కువ ప్రభావితమయిన వ్యాయామాలు కీళ్లను కీళ్ళ చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి
💥ఆరోగ్యకరమైన ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు బీన్స్ ఉన్నాయి.
💥 బరువు తగ్గడం, కీళ్లపై ఒత్తిడిని తగ్గించి , నొప్పి మరియు వాపు నుంచి ఉపశమనం కలగ జేస్తుంది.
💥పిప్పరమెంటు, లావెండర్, యూకలిప్టస్ మరియు రోజ్మేరీ వంటి నూనెలు వర్తించినప్పుడు వాటి లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ కీళ్ల నొప్పులను తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి.
💥అల్లం టీ లేదా సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల అందులోని జింజెరోల్స్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి.
💥పసుపులోని ప్రధాన బయోయాక్టివ్ సమ్మేళనం కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలను కలిగి ఉంది. కర్కుమిన్ క్యాప్సూల్స్ తీసుకోవడం ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించును
💥యాపిల్ సైడర్ వెనిగర్ లోని ఎసిటిక్ యాసిడ్ నొప్పి మరియు వాపును తగ్గిస్తుంది. నీరు మరియు తేనెతో కలిపి ప్రతిరోజూ త్రాగాలి.
💥చెర్రీస్ లోని ఆంథోసైనిన్స్ అనే సమ్మేళనం యూరిక్ యాసిడ్ స్థాయిలను , గౌట్ దాడులను తగ్గిస్తాయి. ప్రతిరోజూ 1/2 కప్పు తినండి, చెర్రీ జ్యూస్ త్రాగండి.
💥వెచ్చని ఎప్సమ్ సాల్ట్ బాత్‌లో 15-20 నిమిషాలు నానబెట్టడం వల్ల నొప్పి మరియు వాపు తగ్గుతుంది.
💥ఆలివ్, కొబ్బరి లేదా బాదం నూనె వంటి నూనెలతో వృత్తాకార కదలికలతో, మితంగా మసాజ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ పెరుగుతుంది,
💥మెంతులు శోథ నిరోధక మరియు అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. మీరు మెంతి క్యాప్సూల్స్ తీసుకోవచ్చుల్నిక లేదా మసాజ్ చేయడానికి మెంతి నూనెను ఉపయోగించవచ్చు.
💥కాటెచిన్స్ అని పిలువబడే గ్రీన్ టీ యొక్క యాంటీఆక్సిడెంట్లు కీళ్ల నొప్పులను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. రోజూ 2-3 కప్పుల గ్రీన్ టీని త్రాగండి లేదా గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ క్యాప్సూల్స్ తీసుకోండి.
వాతానికి ఆముదం బాగా పనిచేస్తుంది…
*రోజుకు ఒక చెంచా చొప్పున గోరువెచ్చని ఆముదం పరగడుపున గాని…. రాత్రి నిద్రపోయే ముందు గానీ తీసుకుని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగాలి….*
కడుపు ఖాళీ అవుతుంది…వాతం కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ పోతుంది
ఆముదం ఆకులు కూడా వేడి చేసి నొప్పి ఉన్నచోట పట్టు వేస్తారు….
మునగాకు పొడి కూడా వాతానికి బాగానే పనిచేస్తుంది….
మునగాకు కూర, పప్పు, పచ్చడి …. చేసుకొని తినొచ్చు వారంలో ఒక్కసారైనా రెండు సార్లు అయినా ఎక్కువగా తింటే వేడి చేస్తుంది….
విరోచనం సాఫీగా ఉండేలా చూసుకోవాలి అప్పుడు కాస్త నొప్పులు తక్కువగా బాధిస్తాయి….
50% రోగాలు విరోచనం సాఫీగా లేకపోవడం వల్లనే వస్తాయి….
వాతం చేసే వస్తువులు …కూరగాయలు ….అంటే *వంకాయ, గోంగూర, ఆలుగడ్డ, చామదుంపలు, జున్ను ,క్యాలీఫ్లవర్, మటన్…. ఇలాంటివి కాస్త తగ్గించుకుని తినాలి….*
ఇవి తిన్నప్పుడు ఇంకా నొప్పులు ఎక్కువ అవుతాయి….
*మాంసాహారం పూర్తిగా మానేస్తే చాలా మంచిది…*
ముందుగా బరువు తగ్గండి. శరీర భారం అంతా మోకాళ్ళ మీద పడి మోకాళ్ళ నొప్పులు వస్తాయి కొందరికి.
*మహాబీర గింజలు రాత్రి అంతా నానపెట్టి ఉదయాన్నే ఆ నీరు తాగడం వలన కొంచం నొప్పులు తగ్గుతాయి.*
అయినా తగ్గక పోతే వైద్యుడిని సంప్రదించండి.
మీకు దగ్గరలో ఉన్న Naveen Nadiminti ఆయుర్వేదిక్ వైద్యున్ని సంప్రదించి అవసరమైన మందులు వాడుకోవాలి,…
ఆయుర్వేదంలో కొంచెం ఖరీదైనవి… కాస్త స్ట్రాంగ్ గా పని చేసేవి మంచి మందులే ఉంటాయి
*ధన్యవాదములు 🙏*
మీ Naveen Nadiminti,
ఫోన్ - 097037 06660,
*Dear friends, this community group*
created exclusively for health care related information only.Those who are interested can join with the above link.please note those who are already receiving messages from me directly can exit from this group. https://chat.whatsapp.com/KOzGuS1Hf0U3pYsj36sERs
No comments:
Post a Comment