Thursday, 25 January 2024

ఒకటే_బ్రాండ్_కాదు_కానీ_అదే_మెడిసిన్_అని_మెడికల్_షాప్_వాళ్ళు_ఇస్తూంటారు_ఇలాంటప్పుడు కొనేవాళ్ళు_చూడాల్సింది ఏమిటి?

*ఒకటే_బ్రాండ్_కాదు_కానీ_అదే_మెడిసిన్_అని_మెడికల్_షాప్_వాళ్ళు_ఇస్తూంటారు_ఇలాంటప్పుడు కొనేవాళ్ళు_చూడాల్సింది ఏమిటి?*

మనం టాబ్లెట్, కాప్సుల్, సిరప్,ఆయిట్మెంట్, ఇంజక్షన్ ఇలా వివిధ రూపాలలో తీసుకునే మందులలో, క్రియాశీలక ఔషధ పదార్థం (API-Active pharmaceutical ingredient) కొద్ది పరిమాణంలో మాత్రమే ఉంటుంది. దానిని మింగడానికి, నిలువ ఉంచడానికి అనువుగా మార్చడానికి,రకరకాల సహాయక పదార్థాలని (Excepeints) ని కలుపుతారు. ఈ సహాయక పదార్థాలు, అసలైన క్రి.ఔ.ప తో ఎలాంటి రసాయనిక చర్య జరుపవు.

అంటే మనం తీసుకునే ఒక ఔషధం క్రియాశీలక ఔషధ పదార్థం (API-Active pharmaceutical ingredient) మరియు సహాయక పదార్థాల (Excepeints) సమ్మేళనం అన్నమాట!

ఉదాహరణ కి, అందరికీ తెలిసిన ఔషదం డోలో -650 తీసుకుందాం. ఈ డోలో 650 స్ట్రిప్ ని తిప్పి చూస్తే, వెనుక భాగం లో, లేబుల్ పైన కింది విధంగా ముద్రించి ఉంటుంది.

పైన చూపిన చిత్రంలో మార్కు చేసి ఉన్న భాగం పారాసిటమోల్ IP అనేది అసలైన క్రి.ఔ.ప (API) మరియు ఎంత డోసు (650 mg) అనే వివరణ! మెడికల్ షాపు వాడు ఏ బ్రాండు ఔషధం ఇచ్చిన చూడవలసింది ఇవి మాత్రమే.వైద్య సలహాలు కోసం https://fb.me/8gsKLNaSo

ఏదైనా ఒక కొత్త ఔషధం ఒక కంపెనీ, ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి కనిపెట్టిన తరువాత, దాని తాలుకు ప్రతిఫలాల్ని అనుభవించడానికి ఔషధ నియంత్రణ సంస్థలు సుమారు 20 సంవత్సరాల పేటెంట్ హక్కులని ఇస్తాయి. ఈ కాలం లో ఎవరైనా ఆ ఔషధంను తయారు చేయలనుకుంటే, ఆ కంపెనీ నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది. పేటెంట్ గడువు ముగిసాక ఏ కంపెనీ అయినా ఆ ఔశధాన్ని తయారు చేయవచ్చును. పేటెంటు గడువు ముగిసాక వివిధ కంపెనీలు తయారుచేసే ఔషధాలు, ఇన్నోవేటర్ కంపెనీలు లేదా పేరున్న పెద్ద కంపెనీలు తయారు చేసే ఔషధాలకన్నా తక్కువ ధరకే లభిస్తాయి. వీటినే జెనెరిక్ ఔషధాలు అని అంటారు.

*ఉదాహరణకు* ఆగుమెంటిన్ (Augmentin Duo-1000 mg) అనే ఒక ఔషధం GSK అనే ఒక ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది. దీని ధర సుమారుగా 500 రూపాయలు.

*ఆగుమెంటిన్ లో ఉండే క్రి.ఔ.ప లు (amoxycillin 875mg + potassium clavulunate 125mg). ఇవే క్రి.ఔ.ప లు, అంతే డోసు కలిగి, ఆగుమెంటిన్ కి బదులుగా అందుబాటులో ఉన్న జెనెరిక్ ఔషదాలు Advent, Moxikind CV, Amoxyclav, bactoclav, solzer, Xoclav, mega CV మొదలయినవాటి ధరలు నూట యాబై రూపాయల నుండి మొదలవుతాయి.*

వైద్యులు మందుల చీటీలో బ్రాండు పేరుకి బదులుగా ఔషధం యొక్క జెనెరిక్ పేరు (అసలైన క్రి.ఔ.ప) వ్రాయాలని ఒక నిబంధన. కానీ, ఈ నిబంధన ఎవరూ పాటిస్తున్నట్లు కనపడదు. చాలావరకు ఫార్మా కంపెనీలు ఇచ్చే తాయిలాల ప్రకారం వాటి బ్రాండ్లు చీటీపై వ్రాయడం జరుగుతుంది.

వినియోగదారులు జెనెరిక్ ఔషధాలు కొనుగోలు చేయడం ద్వారా చాలా డబ్బు ఆదా చేయవచ్చు. కొనుగోలు చేసెటపుడు, ఔషధం పేరు, డోసు, గడువు లాంటి తదితర వివరాలు చూసుకుంటే సరిపోతుంది.
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti*
ఫోన్ 097037 06660,
             This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment