*తిప్ప_తీగ_ఆకు_ఆకుగా_తినడం_మంచిదా_లేకపోతే_కషాయం_తాగితే_మంచిదా? నవీన్_నడిమింటి_ఆయుర్వేదం_సలహాలు*
ఈ తిప్ప తీగ లో 30 కి పైగా మానవాళికి పనికొచ్చే రసాయనాలు ఉన్నట్లు నిర్ధారించారు. వారి పరిశోధనల ఆధారంగా తిప్పతీగ నీ ఎలా వాడాలి అనే దాని కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. అవి :
1.ఆకు ఫ్రెష్ గా లభించినట్లయితే ఆకులను మెత్తగా నూరి ముద్దగా చేసుకుని తీసుకునేది ఒక మార్గం.
2. ఆకును ఎండబెట్టి పొడిగా చేసుకొని డబ్బాల్లో నిల్వ చేసుకొని రోజూ ఒక స్పూన్ పొడిని ఒక లీటర్ నీళ్ల చొప్పున తీసుకొని ఆ నీళ్ళని బాగా మరిగించి అవి 1/2లీటర్ కు తగ్గేవరకు వరకు మరిగించి వాటిని వడగట్టి తీసుకునేది ఒక మార్గం.
3. అదేవిధంగా అదే పొడిని తేనెలో కలుపుకొని ఉండలుగా చేసుకుని తినడం ఇంకొక పద్ధతి.
4. తిప్పతీగ ఆకుని కషాయంగా తీసుకొని రసం రూపంలో తాగడం ఇంకొక పద్ధతి.
#తిప్పతీగ_వల్ల_చాలా_లాభాలు_ఉన్నాయి.
5) #ఒత్తిడి: ప్రస్తుత జనరేషన్ లో ఒత్తిడి అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తిడికి గురి అవుతుంటారు. ఇలా ఒత్తిడిని తొలగించడానికి తిప్ప తీగ అద్భుతంగా పని చేస్తుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడమే కాక మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది.పూర్తి వివరాలు మన వైద్య నిలయం లింక్స్
https://www.facebook.com/1536735689924644/posts/3106665739598290/
6) #ఆర్థరైటిస్: ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్లవాపుల బారిన పడుతున్నారు. కీళ్లు వాపులకు గురవడం వల్ల ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. తిప్పతీగలో యాంటీ ఆర్థరైటిస్ గుణాలు ఉంటాయి. అయితే తిప్ప తీగ కీళ్ల వాపులను తగ్గిస్తుంది. ఈ క్రమంలో ఆర్థరైటిస్ ఉన్నవారికి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
7) #రోగ_నిరోధక శక్తి: తిప్ప తీగలో ఉండే ఆల్కలాయిడ్లు, లాక్టేన్లు అనబడే బయో యాక్టివ్ సమ్మేళనాల వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. బాడీలో షుగర్ లెవెల్స్ ను తగ్గించడంలో కూడా దోహదపడుతుంది.
8) #శ్వాస_సమస్యలు: శ్వాస సమస్యలకు తిప్పతీగ అద్భుతంగా పని చేస్తుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండటం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. తిప్పతీగలో ఉండే ఔషధ గుణాలు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
9) #డయాబెటిస్: డయాబెటిస్ వల్ల మన దేశంలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇది సర్వసాధారణమైన రోగంగా మారింది. అయితే తిప్పతీగను నిత్యం తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. తిప్పతీగ మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
10) #విషజ్వరాలు: జ్వరాలు వచ్చిన వారు తిప్ప తీగ తీసుకోవడం వల్ల చాలా త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ఫ్లూ, ఇతర వైరల్ జ్వరాలకు కూడా తిప్పతీగను వాడవచ్చు. తిప్పతీగ శరీర రోగ నిరోధక శక్తిని పెంచి విష జ్వరాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
11) #జీర్ణ_ప్రక్రియ: ప్రస్తుతం అనేక మంది పాటిస్తున్న అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల చాలామందికి జీర్ణ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అజీర్ణం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అలాంటి వారు తిప్పతీగను నిత్యం తీసుకోవాలి. తిప్పతీగ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. చాలా మంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదని అంటుంటారు. అలాంటి వారు ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం తిప్పతీగను తీసుకుంటే ఫలితం ఉంటుంది.
*#గమనిక:* తిప్పతీగను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తీసుకోరాదు
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti*
Ph -9703706660
This group created health information Ayurveda awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA
No comments:
Post a Comment