*సుఖ_రోగాలు (#సవాయి_రోగాలు)#నివారణ Naveen Nadiminti సలహాలు*
ఈ రోగాలు చెడు వ్యసనాల వలననే కాక ఆ రోగులు మూత్ర విసర్జన చేసిన చోట ఆరోగ్యవంతులు మూత్ర విసర్జన చేయడం వలన, వారి దుస్తులను ధరించడం వలన కూడా వస్తాయి.
వీటిలో తెల్ల సెగ, పచ్చ సెగ, అడ్డగర్రలు (గజ్జల్లో గడ్డలు ) మొదలైన రకాలుంటాయి.
*మూలబంధనం:--* పద్మాసనం వేసుకొని ఆసనాన్ని గట్టిగా బంధించాలి.
ఉడ్యానబంధనం, ఉదరచాలనం , కపాలభాతి ప్రాణాయామం చెయ్యాలి.
ఈ వ్యాధి వున్న వాళ్లకు జననాంగము నుండి పసుపు పచ్చని ద్రవం లేక, తెల్లని ద్రవం,లేక ఎర్రని ద్రవం కారుతూ వుంటుంది.
*అడ్డగర్రలు_నివారణ*
గజ్జల్లో పెద్ద పెద్ద గడ్డలు వాచి ఉండడాన్ని అడ్డగర్రలు అంటారు.
తులసి ఆకుల చూర్ణము
నల్ల ఉమ్మెత్త ఆకుల చూర్ణము
గాడిదగడపాకు చూర్ణము
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని నిల్వ చేసుకోవాలి.
అవసరమైనంత పొడిని నీటితో కలిపి మెత్తగా నూరి గడ్డలపై పట్టు వేస్తే కరిగి పోతాయి.పూర్తి ఆరోగ్యం సమస్యలు కోసం
https://m.facebook.com/story.php?story_fbid=581030843823750&id=100057505178618
*సెగ_రోగము (#గనేరియా)_నివారణ*
లక్షణాలు:-- మూత్రవిసర్జనలో మంట, శరీరమంతా విపరీతమైన మంటలుగా వుండడం, జననాంగము నుండి పసుపు పచ్చని ద్రవం కారడం, మగవాళ్ళకు జననాంగము చివర ద్రవము అతుక్కొని మూత్ర విసర్జన సమయంలో చాలా బాధగా వుంటుంది.
లక్ష్మితులసి సమూలం ఎండబెట్టి దంచిన పొడి --- మూడు వేళ్ళకు వచ్చినంత
కలకండ ----తగినంత
రెండింటిని కలిపి నాలుకతో అద్దుకొని చప్పరించాలి.
*ముదిరిన_పచ్చ_సెగరోగము_నివారణ*
తులసి గింజల పొడి
సబ్జా గింజల పొడి
మంచి గంధం
మిరియాల పొడి
రేవల చిన్ని పొడి
ఉసిరిక పొడి
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి .
అర టీ స్పూను పొడిని నీళ్ళలో కలుపుకొని తాగాలి. దీనితో ఎంతో కాలంగా వున్న రోగామైనా నివారింప బడుతుంది.
*ఎర్రని_తెల్లని_సెగరోగం_నివారణ*
తులసి ఆకులు ----- 50 gr
పమిడి (పైడి) పత్తి ఆకులు ----- 50 gr
బియ్యం కడిగిన నీళ్ళు ----- 50 gr
మేడి చెట్టు ఆకులు ----- 50 gr
పిప్పళ్ళు ----- 50 gr
మిరియాలు ----- 50 gr
లవంగాలు ----- 50 gr
జాజికాయ ----- 50 gr
జాపత్రి ----- 50 gr
అన్నింటిని రోట్లో వేసి దంచి ముద్దగా అయ్యేంత వరకు నూరాలి. రేగిపండు గింజంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టి , బాగా ఎండిన తరువాత సీసాలో భద్రపరచాలి.
ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వేసుకోవాలి.
*పద్యం చాలా ముఖ్యం:--* కందిపప్పు, నెయ్యి, అన్నం కలుపుకొని తినాలి. పప్పులో ఉప్పు వేసుకోకూడదు.
15 రోజుల తరువాత వేయించిన ఉప్పు వేసుకోవచ్చు.
*గనేరియా తీవ్రత నివారణకు చిట్కా*
పటికను పెనం మీద పొంగించి పొడి చెయ్యాలి. ఈ పొడిని ముల్లంగి ముక్కల మీద చల్లి పది రోజులు తింటే వ్యాధి తీవ్రత తగ్గుతుంది.
*గనేరియా_నివారణ*
ఇది ఎక్కువగా పురుషులలో వస్తుంది. పురుష మర్మాంగానికి వస్తుంది. ఇది అంటువ్యాధి ఇది బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. లైంగిక, మరియు ఇతర లోపాల వలన వ్యాపిస్తుంది.
మంటలు, దురదలతో ప్రారంభమై ఐదారు వారాల తరువాత బయట పడుతుంది. చివరి భాగం పెద్దదయి, వాఛి బుడ్డ లాగా తయారై మంట గా వుంటుందికూడా , నడవలేక పోతారు. ఈ సమస్య తీవ్రమైతే కీళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళలో చీము పట్టి పుండ్లు రావడం జరుగుతుంది.
ఉసిరిక పొడి --- 100 gr
కరక్కాయ పొడి --- 100 gr
తాని కాయ పొడి --- 100 gr
కలిపి నిల్వ చేసుకోవాలి.
రెండు టీ స్పూన్ల పొడిని రెండు కప్పుల నీటిలో వేసి కాచి ఆ కషాయం తో మర్మాంగాన్ని రోజుకు రెండు సార్లు కడగాలి.
త్రిఫల చూర్ణం --- 100 gr
తుంగ ముస్తల చూర్ణం --- 50 gr
నీళ్ళు --- రెండు గ్లాసులు
రెండు చూర్నాలను కలిపి నిల్వ చేసుకోవాలి.
రెండు టీ స్పూన్ల పొడిని రెండు గ్లాసుల నీటిలో వేసి కషాయం కాచాలి. బొటన వేలంత సైజులో వున్నా తిప్ప తీగ ముక్కను నీటిలో వేసి కాచాలి. దించి బాగా పిసకాలి. ఆ విధంగా చేయడం వలన నీళ్ళ అడుగున తిప్పసత్తు మిగులుతుంది. నీటిని వంచేసి మిగిలిన తిప్ప సత్తును అంతకు ముందు కాచిన త్రిఫల, తుంగ గడ్డ ల కషాయానికి కలిపి తీసుకోవాలి.
*తీసుకోవలసిన_జాగ్రత్తలు :--* అంగ శుద్ధి, వస్త్ర శుద్ధి, స్నానం, ఆహారం విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. గిట్టని పదార్ధాలు వాడకూడదు. పచ్చి మిరిచి, వంకాయ, గోంగూర, శనగ పిండి, మైదా వాడకూడదు.
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti ,*
ఫోన్ -9703706660*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment