ఎసిడిటీ ఏర్పడటానికి అనేక కారణాలుంటాయి. అధికంగా మసాలా తిండి, అతి ఆహారం వంటివి కొంత మేర ఎసిడిటీ తెస్తాయి. ఎసిడిటీ విరుగుడుగా ఎన్నోరకాల మందులు ఉన్నాయి. అయినా సహజ మార్గాలను ఎంచుకోవడమే మేలు.
ఎసిడిటీ ఉంటే ఆహారంలో అరటిపండు తినండి. అది మంటను తగ్గించడంలో సహాయపడతుంది.
మసాలాలు, వేపుడు కూరలు, ఊరగాయలు, చాక్లెట్లు వంటివాటికి దూరంగా ఉండండి.
పచ్చి క్యాబేజి, పచ్చి ఉల్లి, రాడిష్, మిరియాలు వంటివి తినొద్దు. వాటి వల్ల ఎసిడిటీ మరింత పెరుగుతుంది.
పండని పండ్లు తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. పూర్తిగా పండిన యాపిల్ అసలే వద్దు.
ఆహారాన్ని బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి తప్ప బలవంతంగా తినొద్దు.
హడావుడిగా ఆహారం తినే పద్ధతి మార్చుకోవాలి.
భోజనానికీ భోజనానికీ మధ్య సమయం మరీ అధికంగా లేకుండా చూసుకోవడం మంచిది.
నీటిని అధికంగా తీసుకోవడం చాలా మంచిది.
రాత్రిపూట ఆహారం తీసుకునే సమయానికి, నిద్రపోయే సమయానికి మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండేలా చూసుకోవాలి.
సిగరెట్, మత్తు పానీయాల అలవాటు బాగా తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి.
సలహా. 9949363498
No comments:
Post a Comment