Tuesday, 23 January 2024

Penile Diseases

*👆Penile Diseases Awareness.26.12.2023.*
*పురుషాంగం నుండి పసుపు రంగు ద్రవం వస్తూ మూత్ర విసర్జన సమయంలో మంట సమస్య కు*
*జననాంగంపైన_ఎర్రని_పొక్కులు_కనిపిస్తున్న*
*జనైటల్_హెర్పిస్_లైంగిక_వ్యాధులు*
*ప్రోస్టేట్_గ్రంథి_వాపు (ప్రోస్టటైటిస్)*
*#సమస్యలు_పరిష్కారం_మార్గం_నవీన్_నడిమింటి_సలహాలు* 

            మగవారికి జననేంద్రియంలో సాధారణమైన నొప్పి వచ్చినా లేనిపోనివి ఊహించుకుని హడలిపోతుంటారు . దీనికి కారణాలు అనేకం, నొప్పి ఉండే స్థానం మర్మావలయం కావటం, పురుషాంగంలో నొప్పికి శృంగార జీవితానికి సంబంధం ఉండటం, విషయాన్ని ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడుకోలేకపోడవం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. అయితే దీని మీద సరైన అవగాహన ఉంటే అనవసరమైన భయాందోళనలకు తావుండదు.

1. *#సంభోగంలో_దురుసుతనం_వల్ల_నొప్పి:*

పురుషాంగంలో అనేక రకాలైన నిర్మాణాలుంటాయి. లైంగిక చర్యలో ఇవి ఒకోసారి ఒరిపిడికి లోనై నొప్పిని కలిగించే అవకాశం ఉంది. ఉదాహరణకు పురుషాంగపు ముందు చర్మం బిగుతుగా ఉన్నప్పుడుగాని, పురుషాంగం శిశ్నమణి క్రింద భాగంలో చర్మాన్ని శిష్నానికి కలుపుతూ వుండే స్నాయువు కురచగా ఉన్నప్పుడుగాని సంభోగ సమయంలో కదిలికలకు ఇబ్బంది ఏర్పడి నొప్పి వస్తుంది. పురుషాంగంలో ఇటువంటి నిర్మాణపరమైన సమస్యలు ఉన్నప్పుడు సాధారణస్థాయికి మించి కొంచెం ఎక్కువ ఉద్రేకంతోనూ, ఎక్కువ సార్లు సమాగమంలో పాల్గొంటే, సరైన లూబ్రికేషన్ (జారుడుగుణం) లేని కారణంగా పురుషాంగం ముందు చర్మం చిట్లడంగాని, చర్మాన్ని శిశ్నానికి కలిపి ఉంచే ఫ్ఫ్రెన్యులం తెగటం గాని జరిగి నొప్పి వస్తుంది.

నవీన్ రోయ్ సూచనలు: ఇలా జరిగినప్పుడు ఉప్పు కలిసిన వేడినీళ్లతో కాపడం పెట్టుకుంటే రెండు మూడు రోజుల్లోనే పరిస్థితి చక్కబడుతుంది. అవసరమైతే జాత్యాది ఘృతం అనే మందును పై పూతగా వాడవచ్చు.పూర్తి ఆరోగ్యం సలహాలు కోసం వైద్య నిలయం లింక్స్ లో చూడాలి
https://m.facebook.com/story.php?story_fbid=518938140033021&id=100057505178618
*2. #విసర్పం (జనైటల్ హెర్పిస్):*

జననాంగంపైన వచ్చే హెర్పిస్ వ్యాధి - ముఖ్యంగా సింప్లెక్స్ వ్యాధి సరైన రక్షణ పాటించని లైంగిక కలయికతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో చమట కాయల మాదిరి నీటి పొక్కులు గుంపులుగా ఏర్పడి, పగిలి, ఒకే వ్రణంగా తయారై, చెక్కుకట్టి పూర్తిగా మానిపోతాయి చాలామందిలో హెర్పిస్ వైరస్ వెన్నుపూసలో దాగివుండి మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడుగాని, జలుబుం ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడుగాని తిరగబెడుతూ మానసిక వేదనకు, నిస్పృహకు గురిచేస్తుంటుంది. పొక్కులు కనిపించే ముందు జననాంగం పైన కొద్దిగా దురదగా, లేదా మంటగా అనిపిస్తుంది. ఒకోసారి గజ్జల్లో కూడా కడతాయి. గుడూచి, శారిబా, హరిద్రా, భూమ్యామ్లకి అనే మూలికలు హెర్పిస్ వైరస్ ను సమర్ధవంతంగా అదుపు చేయగలుగుతాయి. వీటిని వ్యక్తిగత ప్రకృతిని బట్టీ, వ్యాధి ఉధృతిని బట్టీ వివిధ సంయోగాలుగా ఇవ్వాల్సి ఉంటుంది.

#ఔషధాలు: గుడూచి సత్వం, కర్పూర శిలాజిత్తు భస్మం, కామదుఘ రసం, మంజిష్టాది క్వాథం చూర్ణం, నింబాది క్వాథ చూర్ణం. పిండ తైలం, షడంగ క్వాథ చూర్ణం.

బాహ్యప్రయోగాలు - మహాతిక్తక ఘృతం, నాల్పామారాది తైలం.

*3. #లైంగిక_వ్యాధులు (సెక్యువల్లీ ట్రాన్సిమిటెడ్ డిసీజెస్):*

గానోరియాలోను, ఇతర మూత్రనాళానికి చెందినా ఇన్ఫెక్షన్లలోను, మూత్రంలో మంటతోపాటు పురుషాంగంలో నొప్పి కూడా ఉంటుంది. సరైన రక్షణ పాటించని అనైతిక లైంగిక సంబంధాలలో సాధారణంగా ఇటువంటి లక్షణం కనిపిస్తుంది. గజ్జల్లో బిళ్ళలు కూడా కడతాయి.

#ఔషధాలు: చందనాదివటి, చందనాసవం, చంద్రప్రభావటి, గోక్షురాదిగుగ్గులు, తామ్రభస్మం, వంగభస్మం, వంగేశ్వరరసం, యవక్షారం.

*4. #ప్రోస్టేట్_గ్రంథి_వాపు (ప్రోస్టటైటిస్):*

ప్రోస్టేట్ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు (ప్రోస్టటైటిస్) పురుషాంగంలో నొప్పి వస్తుంది. ఈ వ్యాధి చాలా మందిలో దీర్ఘ వ్యాధిగా కొనసాగుతుంది. లైంగిక వ్యాధుల నుంచి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వరకు అనేక రకాలు ప్రోస్టటైటిస్ ను కలిగించే అవకాశం ఉంది.

#ఔషధాలు: అభ్రక భస్మం, చందనాదివటి, చందనాసవం, చంద్రప్రభావటి, గోక్షురాది చూర్ణం, గుడూచి సత్వం, గోక్షురాది గుగ్గులు, కర్పూర శిలాజిత్తు భస్మం, కాంచనార గుగ్గులు, స్వర్ణవంగం, త్రిఫలాది క్వాథ చూర్ణం.(పై మందులు అన్ని అందరికి ఒక్క లాగా పని చేయడు మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు తీసుకోవాలి )

*5.#పురుషాంగం_ముందు_చర్మం_బిగుసుకుపోవడం (బెలనైటిస్):*

      కొంతమందికి బ్యాక్టీరియా వల్లగాని, ఫంగస్ వల్లగాని పురుషాంగం ముందు భాగం ఇన్ఫెక్షన్ కు లోనై, ఎర్రగా వాచిపోయి నొప్పిని కలిగిస్తుంది. మధుమేహవ్యాధి గ్రస్తుల్లోను, వ్యాధి క్షమత్వ శక్తి తగ్గిన వారిలోనూ ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

#ఔషధాలు: కైశోరగుగ్గులు, మంజిష్టాదిక్వాథ చూర్ణం.

బాహ్యప్రయోగం: పంచవల్కల కషాయం.

*6. #పెరోనీజ్_వ్యాధి:*

కొంతమందికి పురుషాంగంలోని కణజాలం గట్టిగా, స్కార్ టిష్యూగా మారి సంకోచ గుణాలను కోల్పోతుంది. ఇలాంటి స్థితి ఏర్పడినప్పుడు ఒకవేళ అంగ స్తంభన జరిగితే అసౌకర్యం, నొప్పి కలుగుతాయి. పురుషాంగం స్తంభించినప్పుడు ఒక పక్కకు వంగిపోతుంది. ఈ స్థితిని వైద్య పరిభాషలో 'పెరోనీజ్ వ్యాధి' అంటారు.

నవీన్ రోయ్ సూచనలు: దీనిలో ఆయుర్వేద ప్రత్యేక చికిత్సలైన స్నేహస్వేదాలను చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. పిండతైలం, శ్రీగోపాల తైలం అనే ఔషధాలను ఈ చికిత్సలో భాగంగా ఉపయోగించాల్సి ఉంటుంది.

*7. #శాశ్వత_అంగ_స్తంభన (ప్రియాపిజం):*

ఒకోసారి పురుషాంగం నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే సిరలలో రక్తం గడ్డ కట్టడం వల్ల అంగస్తంభన శాశ్వతంగా ఉండిపోతుంది. ఫలితంగా పురుషాంగంలో నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలా సాధారణంగా పురుషాంగానికి దెబ్బ తగిలినప్పుడుగాని, వాపు ఏర్పడినప్పుడుగాని జరుగుతుంది. ఒకోసారి లుకీమియా వంటి వ్యాధులున్నప్పుడు కూడా ఇలాంటి స్థితి ఏర్పడుతుంది.

నవీన్ రోయ్ సూచనలు: రక్త సరఫరాను మెరుగుపరిచే నాగార్జునాభ్రరస వంటి మందులు ఈ స్థితిలో ఉపకరిస్తారు.

*8. #కణితులు (ట్యూమర్స్):*

చాలా అరుదుగా కొంతమందికి పురుషాంగంలో కంతులూ, గడ్డలూ ఏర్పడతాయి. కారణానుగుణంగా, 'అర్భుదహర' ద్రవ్యాలతో వీటిని చికిత్సించాల్సి ఉంటుంది.

*#ఔషధాలు:* కాంచనారగుగ్గులు, వజ్రభస్మం, నిత్యానందరసం.
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti*
ఫోన్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
**Naveen Nadiminti
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment