Saturday 6 January 2024

సయాటికా* / SCIATICA ( గుద్రసీ వాతము ) సమస్యకు.. ఆయుర్వేదం

**సయాటికా* / SCIATICA ( గుద్రసీ వాతము ) సమస్యకు.. ఆయుర్వేదం* 

*_ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యల వలన మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో అతి ముఖ్యమైనది (నడుమునొప్పి) కటిశూల. నూటికి 90 మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి ఈ నడుమునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఆయుర్వేదశాస్త్రంలో చరక, నూశ్రత, వాగ్భటులు ఈ సమస్యను గుద్రసీ వాతం (సయాటికా)గా పేర్కొంటూ ఎంతో విపులంగా వివరించారు._*
 
 
*_ఎక్కువగా ఒకే పొజిషన్‌లో కూర్చొనుట, స్థూలకాయం, అధికశ్రమతో కూడిన పనులు ఎక్కువసేపు చేయటం, అధిక బరువులను మోయటం, ఎక్కువదూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించటం, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వలన, కొన్ని వంశపారంపర్య వ్యాధుల వలన, మరికొన్ని రోడ్డు ప్రమాదాల వలన ఈ నడుమునొప్పి సమస్య వస్తుంటుంది._*
 
* శరీరంలో వాతప్రకోపం జరిగి, ముందుగా పిరుదులకు పైభాగాన స్తబ్ధతను, నొప్పిని కలిగించి తరువాత కటి ప్రదేశం (నడుము), తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాలలో క్రమంగా నొప్పి కలుగుతుంది. దీనినే గుద్రసీ వాతము (సయాటికా) అని అంటారు. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది._*
 
*_ముఖ్యంగా నడుముకు సంబంధించిన ఎల్4-ఎల్5, ఎస్1-ఎస్2 వెన్నుపూసల మధ్యగల సయాటికా అనే నరంపై ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది._*
 
 
 *_#ఆయుర్వేద చికిత్స :_*
 *_ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు సమగ్రమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి._* 

*_అందులో.._*
 *_1. శమన చికిత్స_*
 *_2. శోధన చికిత్స_*
 
 *_#శమన చికిత్స: ఇది దోషాలను బట్టి అభ్యంతరంగా వాడే ఔషధ చికిత్స. ఇందులో వేదన, కాయకంగా ఔషధాలు ఉంటాయి. అలాగే వాతహర చికిత్సా పద్ధతులు ఉంటాయి._*
 
 
 *_# జాగ్రత్తలు :_*

*_సరైన పోషక ఆహారాలు తీసుకోవడం, నిదాన పరివర్జనం అనగా పైన చెప్పిన ప్రత్యేక వ్యాధి కారణాలను మళ్లీమళ్లీ చేయకుండా జాగ్రత్త పాటించినట్లయితే ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చు._*
 
 *_# డిస్క్‌లో వచ్చే మార్పులు :_*
 
*_ఈ వ్యాధిలో వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్‌లో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి డిస్క్ మీద ఒత్తిడి పెరగటం, వాపు రావటం లేదా డిస్క్‌కి రక్తప్రసరణ సరిగా లేకపోవటం, అరిగిపోవటం అనే సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది._*
 
*_డిస్క్‌లో వాపు వస్తే దానిలో ఉండే చిక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం లేదా దాన్నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి కలిగించటం వల్ల నొప్పి వస్తుంది._*
*_ఓ రకంగా ఈ ద్రవం సహజ నొప్పి నివారిణి అన్నమాట. అదే వ్యాయామం లేకపోతే లిగమెంట్లు ఎక్కడికక్కడ బిగదీసుకుపోతాయి. తుంటి, మోకాళ్లు, నడుము వంటి బరువుపడే ప్రాంతాలకు ఈ ద్రవం రక్షణ కవచంలా పనిచేస్తుంది. అన్నింటికి మించి వ్యాయామం... శరీరం సంతోషంగా ఉండటానికి కావాల్సిన హార్మోన్లని విడుదల చేస్తుంది._*

*_👉🏼 కీళ్ళ నొప్పులు నివారణకు.. సలహాలు :_*

*_వెల్లులిని తీసుకొని పేస్ట్ లా చేసుకోవాలి ఆ పేస్ట్ ని కొబ్బరి నూనెతో కలిపి మర్దన చేసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి._*

*_👉🏼 రోజూ మీరు తీసుకునే ఆహారంలో చింతపండును తగ్గించండి. కొత్త చింతపండును ఆహారంలో తక్కువగా తీసుకుంటే. అది మన శరీరంలోని ఎముకల చుట్టూ ఉన్న కార్డిలేజ్‌కు ఎలాంటి ముప్పు తలపెట్టదు._*

*_అలాగే బంగాళాదుంపలు వంటివి ఆహారంలో ఎక్కువగా చేర్చుకోకండి._*

*_పసుపు పొడి, వెల్లుల్లి పాయలను తీసుకుని బాగా పేస్ట్ చేసుకుని మోకాలి పట్టిస్తే కీళ్ల నొప్పులు మటుమాయం అవుతాయి._*

*_👉🏼 ఇంకా కూల్‌డ్రింక్స్‌ను తీసుకోవడం ద్వారా ఎముకలు బలహీన పడతాయి. కాబట్టి కూల్‌డ్రింక్స్‌ను తాగడం ఆపేస్తే మంచిది._*

*_👉🏼 కీళ్లనొప్పులు, పైనాపిల్‌ తింటే ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. కారణం ఈ బ్రొమిలైన్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా మెండు. అయితే దీన్ని ఉదయం భోజనం అయిన తరువాత అంటే మధ్యాహ్న సమయంలో తింటే మంచిది._*

*_👉🏼 ఆముదపు గింజల పొట్టు తీసివేసి మెత్తగా నూరాలి. అందులోంచి చెంచా ముద్దను ఒక గ్లాసు ఆవు పాలతో కాచి సేవిస్తే, నరాల నొప్పి, సయాటికా నొప్పి తగ్గిపోతాయి._*
 
*_ఒక చెంచా ఆముదాన్ని, 50 మి.లీ శొంఠి కషాయంతో కలిపి సేవించినా ఈ కీళ్లనొప్పులు, సయాటికా నొప్పి నుంచి బయటపడవచ్చు._*
 
*_6 గ్రాముల ఆముదపు వేరు పొడిని రోజుకు రెండు సార్లు సేవిస్తే మెడనొప్పి, నడుము నొప్పి తగ్గుతాయి._*
 
*_ఓ నాలుగైదు ఆముదపు చిగుళ్లను ఒక వెల్లుల్లితో కలిపి నూరి ఆ ముద్దను రోజుకు రెండు సార్లు సేవిస్తే  తగ్గుతాయి అయితే దీనికి తోడు ఉప్పులేకుండా ఉడికించిన మినుప కుడుమును కూడా ఆహారంగా తీసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది._*

*_👉🏼 త్రిఫలా కషాయంలో కాస్తంత ఆముదం వేసి తాగుతూ ఉంటే  వ్యాధి తగ్గుతుంది._*

*_ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కీళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు._*
.
 
 *_# లక్షణాలు :_*

*_నడుములో నొప్పి కలగటం, వాపు, కొంచెం శారీరక శ్రమ చేయగానే నొప్పి తీవ్రత పెరగటం, ఈ నొప్పి సూదులతో గుచ్చినట్లుగా, ఒక్కోసారి తిమ్మిర్లు, మంట తో కూడి ఉంటుంది. సమస్య తీవ్రమైనది అయితే స్పర్శహాని కూడా కలుగవచ్చు. ఒక్కోసారి మలమూత్రాల మీద నియంత్రణ కూడా పోయే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పి బాధ అనగానే సాధారణంగా పెయిన్ కిల్లర్స్‌తో కాలయాపన చేస్తుంటారు.దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కల్గుతుంది.  కానీ కీళ్లు,నరాలు,డిస్కులు, వర్టెబ్రాలు. బలహీన పడి అరగడం జరుగుతుంది,కాని మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. కావున ఇలాంటి సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి, జాగ్రత్తపడటం వల్ల ఈ వ్యాధిని సమూలంగా తగ్గించుకోవచ్చు._*
Call 9949363498

No comments:

Post a Comment