*👆World Leprosyday awareness.*
*కుష్టువ్యాధి పై అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
ఇది బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. కుష్టువ్యాధి రోగితో చాలా కాలం కలిసి మెలిసి తిరిగితే సోకవచ్చు. ఒక్క పర్యాయం తాకగానే అంటుకోదు. అదీ మనలో రోగనిరోధక శక్తి బాగా ఉంటే సోకక పోవచ్చు.
తొలి దశలో చెవులు చుట్టూ ఎర్రగా, చూడను కొంత వికారంగా ఉండి స్పర్శ తగ్గిపోతుంది. అదే సూచన. చర్మం నుంచి చిన్న sample తీసుకుని మైక్రోస్కోప్ కింద పరీక్షచేస్తే తేలిపోతుంది.
ఇప్పుడు చాలా శక్తివంతమైన యాంటీ బయోటిక్స్ అందుబాటులో ఉన్నాయి. మల్టి డ్రగ్ థెరపీ ద్వారా మూడు నెలలో నయమయిపోతుంది.
కుష్టు అని చెప్పుకోడానికి, వైద్యులవద్దకు వెళ్ళడానికి నామోషీ పడి వైద్యం చేయించుకోరు. క్రమంగా రోగం ముదిరి వేళ్ళు కొనలు, ముక్కు చెవి భాగం వికృతంగా అవుతుంది.
క్షయరోగం కలిగించే బ్యాక్టీరియా, కుష్టువ్యాధి కలిగించే బ్యాక్టీరియా అక్కాచెల్లెళ్ళవంటివి.
టి.బి రాకుండా వేయించుకొనే బిసిజి టీకా వేయించుకుంటే కుష్టువ్యాధికి కూడా రోగనిరోధకశక్తి ఏర్పడుతుంది. కనుక అందరూ బిసిజి వ్యాక్సిన్ వేయించుకోవాలి.
ప్రభుత్వ వైద్యశాలలో కుష్టువ్యాధికి ఉచితంగా వైద్యం చేస్తారు. మందులు రోగి ఇంటికే తెచ్చి ఇస్తారు. ఏభై ఏళ్ళ క్రితం ఈ రోగం నెల్లూరు జిల్లాలో విపరీతంగా ఉండేది. ఇప్పుడు అరుదుగా మాత్రమే రోగులు కనిపిస్తారు.
ప్రజల్లో అవగాహన, శాస్త్రీయదృష్టి లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది?
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
వైద్య సలహాలు కోసం
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19
No comments:
Post a Comment