Thursday 1 February 2024

అతి వేడి నుండీ శరీరానికి చలువ చేసే ఆహార పదార్థాలు ఇవే

*అతి వేడి నుండీ శరీరానికి  చలువ చేసే ఆహార పదార్థాలు ఇవే అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*

🌹….మంచి నీళ్ళు…

నీళ్లు కొద్ది కొద్ది గా చప్పరించి తాగడం వలన మన నోటిలో ఉన్న లాలాజలంతో కలిసి శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది….

🌹… మజ్జిగ..

ఒక గ్లాస్ పెరుగుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు కలిపి పల్చగా మజ్జిగ చేసి కొద్దిగా ఉప్పు… కొంచెం నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది

🌹…. బార్లీ నీళ్లు…

బార్లీ గింజలను కొంచెం రవ్వగా మిక్సీలో పట్టి ఒక రెండు స్పూన్లు బార్లీ గింజలకు ఒక లీటర్ నీళ్లు పోసి కాసేపు మరిగించి ఆ నీటిని వడపోసి అందులో కొంచెం ఎలక్ట్రాల్ పౌడర్ కొంచెం కలుపుకొని తాగవచ్చు చాలా తొందరగా చలువ చేస్తుంది…శక్తి కూడా వస్తుంది … నీరసం తగ్గిపోతుంది…ఎండ దెబ్బ తగిలినప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎలక్ట్రాన్ పౌడర్ కలుపుకోవద్దు

🌹…. సబ్జా గింజలు

సబ్జా గింజలు నీటిలో నాన పెడితే చక్కగా ఉబ్బుతాయి..తెల్లగా.. అవి నీళ్లలో కలుపుకొని తాగవచ్చు.. ఎప్పుడైనా…ఎన్నిసార్లు అయినా తాగవచ్చు చలువ చేస్తుంది…వైద్య సలహాలు కోసం https://fb.me/7pqahnY57

🌹…కటోర గోంద్..

బాదం బంక అంటారు దీన్ని…ఇది తుమ్మబంక రెండు ఒకే తీరుగా కనిపిస్తాయి.. రెండిటికి తేడా ఏమిటి అంటే ఒకటి నీళ్లలో కరిగిపోతుంది నాన పెట్టినప్పుడు….బాదం బంక మాత్రం ఉబ్బుతుంది కొంచెం పెడితే చాలా ఎక్కువ అవుతుంది…ఇది రాత్రి నానబెట్టి ఉదయాన్నే నీళ్లలో కలుపుకుని తాగవచ్చు.. పాయసం చేసుకుని తినవచ్చు…సేమియాలో వేసుకుని తినవచ్చు…ఎలా అయినా వాడుకోవచ్చు … కాస్త చక్కెర కలుపుకుని కూడా తినొచ్చు చలువ చేస్తుంది చక్కగా….

🌹…సుగంధ పాల (నన్నారి)

ఇది చాలా ఫేమస్ సోడా విజయవాడలో..

రక్త శుద్ధి కూడా జరుగుతుంది.. ఇది తాగడం వల్ల చర్మవ్యాధులు కూడా తగ్గిపోతాయి.. ఏదైనా చర్మవ్యాధులతో బాధపడేవారు వేడి చేసి చర్మం బాగా దురద వచ్చేటప్పుడు ఇది క్రమం తప్పకుండా తాగడం వల్ల వేడి తగ్గి.. చర్మంలో ఉన్న వేడి..దురద ..మంట.. కూడా తగ్గిపోతుంది..

🌹…వట్టివేర్లు షర్బత్…

ఇది కూడా నన్నారి సోడా లాగే ఉంటుంది…చక్కగా చలువ చేస్తుంది… దీని రుచి నాకు చాలా ఇష్టం…వేడి చేసి యూరినల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా మంచి మందు…

నీళ్లలో కానీ సోడాలో కానీ కలుపుకొని తాగవచ్చు…

🌹…మారేడు షర్బత్..

ఇది కూడా నన్నారి…వట్టివేళ్ళు.. లాగానే..మారేడు అంటే బిల్వ..

బిల్వ పండుతో చేసిన రసం అన్నమాట..

ఇది పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది …వేడి బాగా తగ్గిస్తుంది.. పైల్స్ ద్వారా విరోచనంలో రక్తం పోతుంటే ఇది నీళ్లలో కానీ సోడాలో కానీ కలిపి తీసుకోవాలి… అప్పుడు చాలా శరీరానికి చలువ చేస్తుంది … రక్తం పడే సమస్య ఆగిపోతుంది…

🌹.. సగ్గుబియ్యం జావ..

సగ్గుబియ్యాన్ని పాలు పోయకుండా పల్చగా జావ చేసుకుని అందులో చక్కెర గాని ఎలక్ట్రాల్ పౌడర్ కానీ కలుపుకొని తాగవచ్చు..

చాలా తొందరగా చలువ చేస్తుంది..

షుగర్ పేషెంట్స్ మాత్రం చక్కెర… ఎలక్ట్రాల్ పౌడర్ కలుపుకొని తాగకూడదు…

🌹…. రాగి జావ..

రాగి జావ లో మజ్జిగ కలుపుకొని తాగితే చలువ చేస్తుంది…

రాగి జావలో పాలు కలుపుకొని తాగితే వేడి చేస్తుంది…

కాస్త దండిగా కూడా.. ఉంటుంది బలంగా అనిపిస్తుంది..

🌹.. గంజి

ఇది నా ఫేవరెట్…అప్పుడే వార్చిన వేడివేడి గంజిలో పెరుగు బాగా చిలికి ఒక రెండు స్పూన్లు కలిపి కొంచెం ఉప్పు కలిపి తాగితే చాలా బాగుంటుంది.. టేస్టీగా… ఒంటికి చలువ కూడా చేస్తుంది శరీర తాపాన్ని తగ్గిస్తుంది…
ధన్యవాదములు 🙏
 **నవీన్ నడిమింటి,*
ఫోన్ - 097037 06660,
        This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment