Tuesday 6 February 2024

హ్యూమన్ పాప్పీలోమా వైరస్ స్త్రీలకు , పురుషులకు సోకుతుంది అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు

*హ్యూమన్ పాప్పీలోమా వైరస్ స్త్రీలకు , పురుషులకు సోకుతుంది అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు.*

ఇది స్త్రీలలో సెర్వికల్ కాన్సర్ ను , పురుషుల్లో పురుషాంగం , మలద్వారం , గొంతు టాన్సిల్స్ , నాలుక కింది భాగం లో కాన్సర్ ను కలుగచేస్తుంది . 
ఏటా అమెరికా లో 15  వేలమంది పురుషులు ఈ వైరస్ ద్వారా హెచ్పివి కాన్సర్ కు గురవుతున్నారు . 

పాప్పీలోమా వైరస్ వల్ల కలిగే వైరస్ కు సెర్వికల్ కాన్సర్ అని పేరుపెట్టి అది కేవలం స్త్రీలకు సోకుతుంది అని ప్రచారం చెయ్యడం వల్ల చాలామందిలో కన్ఫ్యూజన్ నెలకొంది .  మహిళల్లో వచ్చే సెర్వికల్ కాన్సర్ లు అన్నిటికీ ఈ వైరస్ సోకడమే కారణం కాదు . మహిళల్లో సెర్వికల్ కాన్సర్ కు ప్రధాన కారణం ఈ వైరస్ సోకడం . కానీ ఇతరత్రా కారణాలు కూడా వున్నాయి . మద్యం,  పొగ తాగడం , కొన్ని రకాల కాన్సర్ కారక రసాయనాలకు ఎక్సపోజ్ కావడం .. ఉదా ముట్టు దుస్తుల్లో వాడివి ఇంకా కొన్ని రకాల అల్లోపతి మందులు , జన్యు కారణాలు . 

వైరస్ వల్ల వచ్చే కాన్సర్ కు-  కణాలు అనియంత్రంగా విభజనకు గురికావడం వల్ల వచ్చే కాన్సర్ కు ... తేడా అర్థం చేసుకోవాలి 

అమెరికా కు చెందిన సిడిసి ప్రకారం వారి దేశం లో  లైంగికంగా చురుకుగా ఉండే { మహిళలు పురుషులు } కనీసం యాభై శాతం మందిలో...  అంటే  కాస్త అటుఇటుగా  జనాభాలో కనీసం నలబై  శాతం మందిలో ఈ వైరస్ ఉంది. 

ఈ వైరస్ శరీరం లోకి దూరింది అంటే వెంటనే కాన్సర్ రాదు . ఈ వైరస్ బలహీనమయ్యింది .  . ఇమ్మ్యూనిటి కాస్త బలంగా ఉన్నా చాలు .. ఈ వైరస్ చనిపోతుంది . కొన్ని సందర్బాల్లో ఈ వైరస్ ఇమ్యూన్ వ్యవస్థను తప్పించుకొని శరీరం లో అలాగే ఉండి పోతుంది . ఆలా నిద్రాణంగా ఉన్న  వైరస్ వెంటనే కాన్సర్ ను కలుగచేయదు. వ్యక్తి ఇమ్మ్యూనిటి బాగా బలహీన పడినప్పుడు అది ఆక్టివ్ అవుతుంది .  శరీరం లోకి వైరస్ ప్రవేశించడానికి అది కాన్సర్ గా మారడానికి మధ్య సరాసరిగా ఇరవై ఏళ్ళ సమయం ఉంటుందని సిడిసి తెలియచేస్తోంది . 

ముఖ్యంగా ఇమ్మ్యూనిటి బాగా బలహీన పడిన వారిలో ఇది కాన్సర్ గా మారే అవకాశముంది . అంటే ఎయిడ్స్ రోగులు .. వరుస ప్రసవాల వల్ల బాగా బలహీన పడిన మహిళలు మొదలయిన వారు . 

వర్ధమాన దేశాల్లో ఈ రకం కాన్సర్ లు వాటి వల్ల మరణాలు ఎక్కువ ఉండడానికి కారణం .. పోషకాహార లోపం , వరుస ప్రసవాలు , ఎయిడ్స్ లాంటి వాటి వల్ల ఇమ్మ్యూనిటీ బలహీనం కావడం . 

అమెరికా లో హెచ్పివి వాక్సిన్ ను అబ్బాయిలు , అమ్మాయిలు .. ఇద్దరికీ వేస్తున్నారు . పదకొండు పన్నెండు వయసు కల బాలబాలికలకు ఇది వేయాలని అమెరికా ప్రభుత్వం సూచిస్తోంది . తొమ్మది ఏళ్ళ కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు ఇది వేయరు . 26  ఏళ్ళు దాటిన వ్యక్తులకు ఇది అవసరం లేదని అమెరికా ప్రభుత్వం సూచిస్తోంది . 

27  దాటిన వ్యక్తులకు ఎందుకు అవసరం లేదని అక్కడి ప్రభుత్వం చెబుతోంది . ఇది నా మాట కాదు . వారి ప్రభుత్వ సూచనలు . 27  ఏళ్ళు దాటిన వ్యక్తి అంటే అతని / ఆమె శరీరం లో ఇది వరకే ఈ వైరస్ ప్రవేశించి ఉంటుంది . అది ఇమ్మ్యూనిటి చేత నాశనం అయ్యి అయినా ఉండాలి .  ఆలా అయ్యింది అంటే ఆ వ్యక్తికి ఆ వైరస్ నుంచి రక్షణ వున్నట్టే . ఇంకో సారి దూరినా ఏమీ కాదు . లేదా ఆ వైరస్  శరీరం లో నిద్రాణంగా అయినా ఉండాలి . ఒక సారి ఈ వైరస్ శరీరం లోకి వెళ్ళాక ఇక వాక్సిన్ పని చేయదు . కాబట్టి 27  అంతకన్నా ఎక్కువ వయసు వారికి ఇది అవసరం లేదని అమెరికా ప్రభుత్వ సంస్థ సిడిసి మాట . 

ఈ వైరస్ కేవలం సెక్స్ ద్వారా మాత్రమే శరీరం లో ప్రవేశిస్తుంది . స్త్రీ - పురుషుడు , లెస్బియన్ గే మలద్వారం సెక్స్ , ఓరల్ సెక్స్ ఇలా .. అవతలి వ్యక్తికి శరీరంలో ఇది వరకే వైరస్ ఉంటే అది సెక్స్ ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది . స్కిన్ తో స్కిన్ టచ్ అంటే అంగ చూషణ లాంటివి ద్వారా కూడా . తల్లికి ఉంటే అది  ప్రసవ సమయం లో 
బిడ్డకు సోకుతుంది . ఎయిడ్స్ వ్యాధి లాగే కోటికి  ఒకటి రెండు కేసుల్లో సిరంజి లు సరిజికల్ సాధనాల ద్వారా వ్యాపించవచ్చు . ఇది మాహా అరుదు .
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19
భార్య భర్తకు పెళ్లయి నాటికి ఈ వైరస్ లేదంటే అటు పై వారు వేరొకరితో లైంగిక సంభందం ఏర్పర్చుకోక పొతే ఈ వైరస్ సోకదు .

నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ అనే భారత ప్రభుత్వ సంస్థ అంచనా ప్రకారం మనదేశంలో కనీసం ఎనభై శాతం మంది మహిళల్లో ఈ వైరస్ ఏదో ఒక దశలో శరీరం లో ప్రవేశిస్తుంది . ఈ సంస్థ పురుషుల శాతాన్ని లెక్క కట్టలేదు . మహిళల్లో ఎనభై శాతం అంటే దాదాపు పురుషుల్లో ఇంతే శాతం అనుకోవచ్చు . అంటే మన దేశంలో వంద కోట్ల మందిలో ఈ వైరస్ ఏదో ఒక దశలో శరీరం లోకి ప్రవేశిస్తుంది . పైన చెప్పినట్టుగా అది ఇమ్మ్యూనిటి తో చస్తుంది . లేదా అరుదైన సందర్బాల్లో శరీరంలో నిద్రాణంగా ఉండిపోయి .. ఇమ్మ్యూనిటీ బాగా బలహీన పడి నప్పుడు .. డ్రగ్స్ తీసుకోవడం ... పోషకాహారం లోపం తో పాటు వరుస ప్రసవాలు , ఎయిడ్స్ వ్యాధి వల్ల ఇమ్మ్యూనిటీ దెబ్బ తినడం లాంటి కారణాల వల్ల కాన్సర్ గా మారొచ్చు .

వాసిరెడ్డి అమర్నాథ్ ను బండబూతులు తిట్టినా వ్యక్తిత్వ హననం చేసినా ఫరవాలేదు. నేను పూనుకొని పోస్ట్స్ పెట్టేంతవరకు మీరు ఇలా అనుకొన్నారు. అవునా ? కాదా? చెప్పండి ..

 1. సెర్వికల్ కాన్సర్ కు హెచ్పివి కాన్సర్ కు తేడా తెలుసా మీకు ?

2.ఈ వైరస్ వల్ల కేవలం స్త్రీలలో కాన్సర్ వస్తుంది అనుకొన్నారు. కదా   ?
3 . 
దీనికి పురుషులకు సంభంధం లేదు అనుకొన్నారు .. అవునా? కాదా ?
4. 
భారతదేశం లో...  .అయ్యా ఇది నా అంచనా కాదు . ప్రభుత్వ సంస్థల అంచనా.. ఎనభై శాతానికి జీవితం లో ఏదో ఒక దశలో ఈ వైరస్ సోకి ఉంటుంది అని మీకు తెలుసా ?

5 . 

ఈ వైరస్ సోకితే వెంటనే కాన్సర్ అని అనుకొన్నారు లేదా ?
6. 

అసలు ఈ వైరస్ ఎయిడ్స్ వైరస్ లాంటిదే అని అంటే కేవలం సెక్స్ ద్వారా { కోటికి ఒక కేసులో సర్జికల్ పరికరాల ద్వారా } మాత్రమే వ్యాపిస్తుంది అని మీకు తెలియదు కదా ?
7. 

ఈ వైరస్ శరీరం లో దూరిదంటే వెంటనే కాన్సర్ .. కాన్సర్ వస్తే మరణం అనుకొన్నారు . అవునా కదా ? రెంటికి మధ్య సరాసరిగా ఇరవై ఏళ్ళు .. అదీ ఇమ్మ్యూనిటీ మరీ బాలహీనముగా వున్నప్పుడు .. అనే విషయం  మీకు ముందుగా తెలుసా ? 

నిన్నటి దాక మీకు తెలిసిందల్లా ఈ వైరస్ సోకితే కాన్సర్ వస్తుంది . అంటే అన్ని రకాల కాన్సర్ లకు ఈ వైరస్ కారణం . ఈ వాక్సిన్ వేసుకొంటే ఇక కాన్సర్ .. అంటే అన్ని రకాల కాన్సర్ లు దరిదాపుకు రావు .. అని మీరు అనుకొన్నారు లేదా ?

లోపం  ఎక్కడుంది ? 
మీకు సరైన సమాచారం ఎందుకు రాలేదు .

ఆలోచించండి . నేను కలిగిస్తున్న అవగాహన వల్ల ఎవరికి నష్టం ? ఈ అవగాహన వల్ల మీకు లాభమా నష్టమా ?

చివరిగా ఒక మాట . నేను ఆదిమ మానవుడి గురించి పాఠం చెప్పాను. రాతి యుగంలోకి వెళ్లి చూసావా? అని ఎవరూ అడగలేదు .
 చరిత్ర పాఠాలు చెప్పాను . అశోకుడు అక్బర్ ను చూడలేదు .
  ఆంత్రోపాలజి లో భాగంగా మెడికల్ ఆంత్రోపాలజీ లో మానవ ఆరోగ్యం పై ఎన్నెన్నో పాఠాలు చెప్పాను . 

 నేను టీచర్ .
 పాఠాలు చెబుతాను . 
అది జన్మ హక్కు . 

అనేక జర్నల్స్ చదివి అర్థం చేసుకొని మీకు అర్ధమయ్యే రీతిలో .. మీ లైఫ్ కు సంభందించిన అనేక విషయాల పై పాఠాలు చెబుతున్నా.. చబుతూనే ఉంటా! 

https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19

No comments:

Post a Comment