Tuesday 19 March 2024

అపెండిక్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అపెండిక్స్ వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు

*అపెండిక్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అపెండిక్స్ వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
*The Appendix is important For Your Immune System.*

*If they take it out.*
*How should the person compensate?*
*Be more careful?*
*Eat more vitamins and minerals to boost immune system.*
*Avoid people who are ill?*with- Naveen Nadiminti
*అపెండిక్స్‌ పగిలితే ప్రాణాపాయం-

అపెండిసైటిస్‌ గురించిన పూర్తి అవగాహన ప్రతివారూ కలిగి ఉండటం అవసరం. అపెండిక్స్‌ మనిషి శరీరంలో చిన్నప్రేవులు, పెద్దప్రేవులు కలిసే భాగం వద్ద ఉంటుంది. మనిషిలో ఈ అపెండిక్స్‌ వలన ప్రయోజనం శూన్యం. ఇది జంతువులలో మాత్రమే నిర్దిష్టమైన విధులు నిర్వర్తిస్తుంది. మనిషిలో కొన్ని సంవత్సరాల తరువాత బహుశా ఇది పూర్తిగా అంతర్థానమయ్యే అవకాశం ఉంది. అపెండిక్స్‌ వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేకపోయినప్పటికీ, దీని వలన కలిగే సమస్యలు మాత్రం ఎదుర్కొనక తప్పడంలేదు. అపెం డిక్స్‌కు ఇన్‌ఫెక్ష్షన్‌ సోకినప్పుడు వచ్చే బాధను అపెండిసైటిస్‌ అని వ్యవ హరిస్తాం. అపెండిసైటిస్‌ సాధారణంగా 15నుంచి 20 సంవత్సరాల మధ్య ఎక్కువగా వస్తుంది. అపెండిసైటిస్‌కు గురయ్యే అవకాశాలు మాంసాహారుల్లో ఎక్కువే అయినప్పటికీ, శాకాహారుల్లోనూ ఇది కనిపిస్తుంది. అలాగే ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశాలున్నాయి.

తెల్లవారు జామునే తీవ్రమైన కడుపునొప్పితో అపెండిసైటిస్‌ మొదలై, ఒకటి రెండుసార్లు వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. నొప్పినాభి చుట్టూ కాని, నాభి పైభాగంలో కాని మొదలై, కుడివైపు పొత్తి కడుపులో (ఇక్కడే అపెండిక్స్‌ ఉంటుంది) స్థిరంగా నిలుస్తుంది. ఆ భాగంలో చేతితో నొక్కి నప్పుడు నొప్పి ఎక్కువవుతుంది. అపెండిసైటిస్‌తో బాధపడే వారికి కొద్ది పాటి జ్వరం - సుమారు 100 డిగ్రీల ఫారెన్‌హీట్‌ - కూడా ఉంటుంది. అపెండిసైటిస్‌ కేసులన్నిటికీ ఆపరేషన్లు అవసరమా? మందులతో తగ్గే అవ కాశం ఉందా పరిశీలిద్దాం.వైద్య నిలయం లింక్స్ 
https://www.facebook.com/share/v/z99sFkJQkQ4xabVJ/?mibextid=oFDknk
*అపెండిసైటిస్‌ నొప్పి మూడు విధాలుగా రూపాంతరం చెందుతుంది. అవి:*

1.తీవ్రమైన స్థాయిలో అపెండిసైటిస్‌ - దీనిని ఎక్యూట్‌ అపెండిసైటిస్‌ అని అంటారు. దీనిలో పదేపదే నొప్పి వస్తుంటుంది. 
2. అపెండిక్స్‌కు రంధ్రం - దీనిని అపెండిక్యులార్‌ పర్ఫొరేషన్‌ అంటారు. దీనిలో అపెండిక్స్‌కు రంధ్రం పడటం లేదా అది పగిలిపోవడం జరుగుతుంది
 3. అపెండిక్స్‌ మాస్‌ - దీనిలో అపెండిక్స్‌ గట్టిపడుతుంది.  ఎక్యూట్‌ అపెండిసైటిస్‌: అపెండిక్స్‌కు సోకిన ఇన్‌ఫెక్షన్‌ను కొన్నిసార్లు ఇంజక్షన్లతో తగ్గించవచ్చు. లేదా ఆపరేషన్‌ అవసరం కావచ్చు.  సాధారణంగా ఈ విధమైన కేసుల్లో మొదటిరోజునే ఆపరేషన్‌ చేయించుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. ఎందుకంటే మందులతో ఈ వ్యాధి తగ్గకపోగా, అపెండిక్స్‌ పగిలిపోవడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముంది. లేదా అపెండిక్స్‌ గట్టిపడిపోవడం 
జరుగుతుంది. ఈ రెండూ జరుగకపోయినా, అప్పటికి నొప్పి తగ్గి, పలుమార్లు వ్యాధి తిరగబెట్టే అవకాశముంది. ఇలా పలుమార్లు అపెండిసైటిస్‌ బాధకు గురికావడాన్ని రికరింగ్‌ అపెండిసైటిస్‌ అంటారు. ఈ కారణంగానే డాక్టర్లు మొదటే ఆపరేషన్‌ వైపు మొగ్గు చూపుతారు.  

వ్యాధి నిర్ధారణ: ఈ వ్యాధిని నిర్ధారించడానికి రోగిని శారీరకంగా పరీక్షిస్తే సరి పోతుంది. దీనిని క్లినికల్‌ ఎగ్జామినేషన్‌ అంటారు. ఇతర వ్యాధి నిర్ధారణా పరీక్షలు చాలా వరకూ రోగి మరేవైనా వ్యాధులతో బాధ పడుతున్నాడా? అనే అంశాన్ని పరిశీలించడానికి ఉపయోగపడతాయి.  అపెండిసైటిస్‌కు చేసే శస్త్రచికిత్స సులభమైనది. రోగి వారం రోజులలోపే ఇంటికి వెళ్లిపోవచ్చును. ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యం పొందిన లాప్రోస్కోపిక్‌ పద్ధతి ద్వారా రోగి 24 గంటలలో ఇంటికి వెళ్లి పోవచ్చును.

అపెండిక్స్‌కు రంధ్రం: అపెండిక్స్‌కు రంధ్రం పడటం వలన కడుపులోకి చీము చేరి రోగి సెప్టిక్‌ షాక్‌లోకి వెళ్లిపోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అపెండిక్స్‌కు రంధ్రం పడటమనేది ప్రాణాపాయస్థితి. దీనికి శస్త్రచికిత్స తప్ప మరొక మార్గంలేదు.  ఏఏ రోగులకు ఈ దశ వస్తుందనేది చెప్పలేము. రోగి కోలుకోవడానికి కనీసం రెండు వారాలు పడుతుంది.  అందుకే మొదటి దశ లోనే అంటే ఎక్యూట్‌ అపెండిసైటిస్‌ దశలోనే డాక్టర్లు ఆపరేషన్‌ చేయిం చుకోవాల్సిందిగా సలహా ఇస్తారు.

అపెండిక్యులార్‌ మాస్‌: ప్రతి వ్యాధికీ మన శరీరం తనదైన రీతిలో స్పంది స్తుంది. ఆ స్పందన కారణంగానే చుట్టూ ఉన్న ప్రేవులు అపెండిక్స్‌ను బం ధించి, ఇన్‌ఫెక్షన్‌ ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధిస్తాయి. దీనినే అపెండిక్యులార్‌మాస్‌ లేదా అపెండిక్స్‌ గడ్డ కట్టడమని అంటారు. దీనిని ముందుగా మందులతో కరిగించి, ఆరువారాల తరువాత ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది.
ధన్యవాదములు 🙏
మి నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
            This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment