Wednesday 6 March 2024

నడుము నెప్పికి, సయాటికాకు సమస్య కు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి

*నడుము నెప్పికి, సయాటికాకు  సమస్య కు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

    సయాటికా లేదా నడుము పట్టడం లేదా నరం జారింది దీర్ఘకాలిక సమస్య. వెన్నుపూసల మధ్యలో కల మాంసపు దిండ్లు బయటికి ఒచ్చి సయాటిక్ నరం పై ఒత్తిడి తేవడం ద్వారా మొదలౌతుంది. ఆ భాగం లోని నడుము కండరాలకు సరైన ఎక్సర్సైజులు లేక బలహీన పడి నరం జారి నరకం చూపిస్తుంది. పూర్వం కాళ్ళకి బరువులు కట్టి కొన్ని వారాల పాటు పూర్తిగా పడక మీద విశ్రాంతి ఇవ్వడం ద్వారా చాలా మట్టుకు తగ్గేది లేదా ఒక్కోసారి నరము మాంసపు దిండ్లు మధ్యలో మరలా చేరి సమస్య తెలీకుండా పోయేది. పరిస్థితి తీవ్రతను పట్టి వైద్యులు బయటికి ఒచ్చిన మాంసపు దిండ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. కొన్ని సార్లు ఈ సర్జరీ విఫలమై రోగి రెంటికీ చెడ్డ రేవడిలా తయారై డబ్బులు ఆరోగ్యం రెండింటిని కోల్పోతాడు. ప్రస్తుతం ఈ సమస్యకు నెర్వ్ సూదనర్స్ మరియు మసుల్ సూదనర్స్ అంటే నరాలను కండరాలకు నెప్పి తెలియకుండా చేసే మందులు రావడం తో వీటిని వాడితే ఉపశమనం కలుగుతుంది. ఈ మందులు పరిస్థితులను పట్టి జీవితాంతం వాడాల్సివుంటుంది. వీటితో సర్జరీకి పోయే అవసరం బాగా తగ్గుతుంది
వైద్య నిలయం సలహాలు కోసం
https://fb.me/4cRo6fUrl                                                                                                          *1.-వీపు నొప్పి సమస్య --- నివారణ*                                   
బోడసరం
చెంగల్వ కోష్టు
వస
దబ్బసొంపు

      అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని చూర్ణాలుచేసి కలిపి నిల్వ చేసుకోవాలి .

      తగినంత చూర్ణాన్ని తీసుకొని దానికి పులిసిన గంజిగాని  లేదా  మజ్జిగ గాని లేదా నిమ్మరసం కలిపి నూరి వీపు మీద
వీపు మీద పట్టు వేయాలి . ఈ విధంగా  ఆరు , ఏడు సార్లు చేస్తే నొప్పి తగ్గుతుంది
                                                                   *2.-ప్రక్కటెముకలలో వాపులు , నొప్పులు  --- నివారణ*

జిల్లేడు ఆకుల రసం
గోధుమ పిండి

       గోధుమ పిండిలో జిల్లేడు ఆకుల రసం కలిపి పిసికి నొప్పి వున్నచోట పట్టు వేస్తె నొప్పి తగ్గుతుంది


*3.-కీళ్లలో గుజ్జు శక్తి పెరగడానికి*
                                           
           జువ్వి పండ్లు ( ప్లక్ష వృక్షము)  ఎన్ని దొరికితే అన్ని తెచ్చి వారిని రెండేసి ముక్కలుగా చేసి బాగా ఎండ బెట్టాలి. బాగా మందంగా వున్న కుండను శుద్ధి చేసి బాగా కడగాలి.  కుండను తేమ లేకుండా బాగా ఎండబెట్టాలి.
        ఆ కుండలో ఎండిన పండ్లను పోసి అవి  మునిగేంతవరకు  తేనె పొయ్యాలి.  ఎండిన జువ్వి పండ్లు  తేనెను పీల్చుకుంటాయి. మరలా మునిగే వరకు తేనె పోయాలి.
 కుండ మీద మూకుడు బోర్లించాలి. ఒక గుడ్డకు బంక మట్టిపూసి కుండలోకి గాలి చొరబడకుండా
 మూకుడు, కుండ కలిసే చోట సీల్ చేయాలి.   ఆ కుండను గాలి తగలని .చోట ఒక మూలగా 30 రోజులు ఉంచాలి.  అది బాగా మగ్గి హల్వా లాగా తయారవుతుంది.
       దీనిని ప్రతి రోజు ఒక అర టీ స్పూను తీసుకొని తింటూ వుంటే కీళ్లలో గుజ్జు పెరగడమే కాక వీర్య వృద్ధి, శక్తి 
వృద్ధి జరుగుతుంది.
                                        *4.-కీళ్లలో బలం కోసం గుజ్జు అరిగిపోతే  --- పెరగడానికీ*

       తుమ్మ బంకను తెచ్చి రెండు చుక్కలు  నెయ్యి వేసి వేయించి , దంచాలి . దానికి సమానంగా కలకండ పొడిని కలపి
నిల్వ చేసుకోవాలి .

      ప్రతి రోజు ఉదయం , సాయంత్రం అర టీ స్పూను పొడి చొప్పున తిని పాలు తాగాలి
      ఈ విధంగా చేయడం వలన   కీళ్ళ మధ్య అరిగిపోయిన గుజ్జు బాగా పెరుగుతుంది .
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
       This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment