బూడిద గుమ్మడికాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
######################
బూడిద గుమ్మడికాయ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. బూడిద గుమ్మడికాయ ఆకులు, గింజలు కూడా పలురకాల చికిత్సలో ఔషదంగా ఉపయోగిస్తుంటారు. ఇందులో 96శాతం నీరు ఉంటుంది. పైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్-సి, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్-బి2, మెగ్నీషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి.
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న వ్యక్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బూడిద గుమ్మడికాయ సహాయపడుతుంది. క్రమం తప్పకుండా దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే టైప్-2 డయాబెటిస్(Type-2 diabetes) ను నియంత్రించవచ్చు.
విటమిన్ సి ,జింక్ కూడాపుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ప్రతిరోజూ ఉడికించిన బూడిద గుమ్మడిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడంలో సహాయం చేస్తుంది. తద్వారా గుండె సంబంధ సమస్యల(Heart problems) ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కడుపులో పుండ్లు(stomach ulcers), పేగు సమస్యలు ఉన్నవారికి బూడిద గుమ్మడికాయ ఫ్రీరాడికల్స్ ను తొలగించడం ద్వారా కడుపులో అల్సర్లను, ఆమ్లత గుణాన్ని తగ్గిస్తుంది.
బూడిద గుమ్మడికాయలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. కాలేయం, కిడ్నీలను క్లీన్ చేస్తుంది. డయేరియా, మలబద్దకం, మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్ళ తొలగింపు , మూత్రపిండ పనితీరు నియంత్రించడం, పేగు కదలికలు, మూత్రాశయ కదలికను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బూడిద గుమ్మడికాయంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రెటీనా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రేచికటి వస్తుంది. రిబోఫ్లోవిన్ బూడిద గుమ్మడిలో ఉండి కంటి చూపు సమస్యనే కాదు, కంటి మీద మచ్చలు, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది.
శరీర జీవక్రియకు . తినే ఆహారం శక్తిగా మారడంలో విటమిన్-బి2 బాగా సహాయపడుతుంది.బూడిద గుమ్మడిలో హార్మోన్లను సమతుల్యంగాఉంచడానికి . విటమిన్-బి 2 ప్రయోజనకారి
డిప్రెషన్(Depression).
బూడిద గుమ్మడికాయ తీసుకుంటే మోనోఅమైన్ ఆక్సిడేస్ ను అణిచివేసి డోపమైన్, సెరోటోనిన్, నోర్ పైన్ ఎంజైమ్ లను పెంచుతుంది. తద్వారా నిరాశ, డిప్రెషన్ ను తగ్గిస్తుంది.
బూడిద గుమ్మడికాయలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తప్రసరణ జరిగి. ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది. ఫలితంగా మెదడు పనితీరు మెరుగవుతుంది. రక్తహీనత(Anemia) సమస్యను నివారిస్తుంది.
కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బూడిద గుమ్మడికాయ బరువు తగ్గడంలో సహాయపడుతుంది(weight loss). కండరాల నిర్మాణాన్ని, జీవక్రియను ప్రోత్సహించడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. ఇక బూడిద గుమ్మడికాయలో విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మ సంరక్షణకు, జుట్టు సంరక్షణకు కూడా సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ పేస్ట్ ను జుట్టుకు పట్టిస్తే జుట్టు కుదుళ్లు దృడంగా మారతాయి. బలమైన జుట్టు, మచ్చలేని యవ్వనమైన చర్మం(strong hair and skin) కావాలంటే ప్రతిరోజూ బూడిద గుమ్మడి తీసుకోవాలి.
⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕
No comments:
Post a Comment