Sunday 10 March 2024

సహజమైన_ఆయుర్వేద_పద్ధతుల_ద్వారా_రోగ_నిరోధక_శక్తిని_పెంచడం_ఎలా

*సహజమైన_ఆయుర్వేద_పద్ధతుల_ద్వారా_రోగ_నిరోధక_శక్తిని_పెంచడం_ఎలా?.*
*అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి సహజంగా ఇంట్లో దొరికే పదార్థాలతో ఎంతో మేలు చేసే విధంగా ప్రయత్నం చేయవచ్చు.
         సాధారణంగా మీరు తీసుకునే ఆహారమే వేళకు తీసుకోండి. మనసు శరీరం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. నిదానంగా మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు మీకే తెలుస్తుంది. పరిస్థితులను ఒప్పుకొని చేయ గలిగినది చెయ్యడం చెయ్యలేని దాన్ని ఒదిలిపెట్టడం అలవాటు పడండి. జీవితంలో పరుగులు అపి నడవడం మొదలు పెట్టండి. ఎవరి జీవితం వారిదే. ఎవరి ఆరోగ్యం కూడా వారిదే.

ప్రాణంగా కరోనా కష్టకాలాల్లో ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ఈ విషయాలను ఎన్నోసార్లు చెప్పడం జరిగినది.

1.-రోజు ఒక నిమ్మకాయ తినడం ద్వారా విటమిన్ సి వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
2.-ఒకరోజు ముందు నానబెట్టి మరుసటి రోజు పొద్దున బాదం ను తింటే జలుబు నుండి రక్షణ వస్తుంది.
3.-రోజు పెరుగు మరియు తేనె తీసుకోవడం వల్ల విటమిన్ డి కూడా శరీరానికి అందుతుంది.
4.-పసుపు అనేది ఇమ్యూనిటీ బూస్టర్ అని చిన్నప్పటి నుంచి విన్నాము. దీనిని వంటలతో పాటు అవకాశం ఉన్న ప్రతిసారి తీసుకోవడం మంచిది. ఇంకా రోజు గ్లాసులు పాలలో పసుపు కలుపుకొని తాగడం మంచిది.
5.-ఆకుకూరల్లో ఎక్కువగా పాలకూరకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల శరీరంలో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్లతో ఇది పోరాడే శక్తినిస్తుంది.
6.-ప్రతిరోజు అల్లం తీసుకోవడం జీర్ణ వ్యవస్థకు ఎంతో మంచిది.
7.-వెల్లుల్లి దీనిని మనం దివ్య ఔషధం అని కూడా పిలుస్తారు. ఏకమూలిక ఔషధం అని కూడా పిలుస్తారు. దీన్ని నిత్యం ఆహారంలో కలిపి తీసుకోవడం రోగ నిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
8.-కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష అని పిలవబడే డ్రై ఫ్రూట్లో విటమిన్B12 అనేది విరివిగా లభిస్తుంది.
9.-తినే ఆహారమే కాకుండా శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యం ఉండటం కోసం ప్రతి దినం ఆసనాలు, వాకింగ్, ప్రాణామయము, మెడిటేషన్ లాంటివి కచ్చితంగా చేయాలి.
10.-నీటి శాతం ఎక్కువ ఉండే పుచ్చకాయ లాంటి జ్యూసులు టమాట, బీట్రూట్ క్యారెట్ జ్యూసులు కూడా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
11.-తినే ఆహారము, తాగే నీరు మన చుట్టూ ఉన్న ప్రకృతి, మంచి నిద్ర వీటన్నిటితోపాటు సానుకూల దృక్పథం మనిషిలో కచ్చితంగా అవసరం.వైద్య సలహాలు కోసం లింక్స్ https://fb.me/1PQhrFuLW
*పండ్లు మరియు కూరగాయలు….* పండ్లు మరియు కూరగాయలు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం, ఇవి శక్తి స్థాయిలను పెంచడంలో మరియు అలసటను తగ్గించడంలో సహాయపడతాయి.

ధాన్యాలు…ధాన్యాలు శక్తికి మంచి మూలం, అలాగే ఫైబర్, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు పూర్తిగా ఉంచడంలో సహాయపడుతుంది.

లీన్ ప్రోటీన్….. లీన్ ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి మరియు మరమ్మతు చేయడానికి సహాయపడుతుంది, ఇది శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.

*ఆరోగ్యకరమైన కొవ్వులు…* .ఆరోగ్యకరమైన కొవ్వులు శక్తికి మంచి మూలం, అలాగే అవి గ్రహించడానికి సహాయపడతాయి. కొవ్వు-ద్రావణీయ విటమిన్లు.

*నీరు…* నీ.రు హైడ్రేటెడ్‌గా ఉండటానికి అవసరం, ఇది శక్తి స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.

*బెర్రీలు…* బెర్రీలు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ అలసటకు దోహదపడే అణువులు.
డార్క్ చాక్లెట్… డార్క్ చాక్లెట్ యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం, ఇది శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడే కెఫిన్‌ను కూడా కలిగి ఉంటుంది.

*గుడ్లు…*…గుడ్లు ప్రోటీన్ మరియు ఇనుముకు మంచి మూలం, ఇవి రెండూ శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి.

*ఓట్ మీల్……* ఓట్మీల్ ఫైబర్‌కు మంచి మూలం, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు పూర్తిగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.

*అరటి పండ్లు…* అరటిపండ్లు పొటాషియం యొక్క మంచి మూలం, ఇది కండరాల పనితీరును మెరుగుపరచడంలో మరియు అలసటను నివారించడంలో సహాయపడుతుంది.

ఈ ప్రపంచంలో ఊహాతీతమైన రోగాలు ఎన్నో వచ్చినవి. ఎన్నో వేల, లక్షల మంది చనిపోయారు. కానీ మానసిక మొండితనము, మానసిక దృఢత్వం మనిషిని ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి సిద్ధపరుస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా మానసికంగా మారడం అత్యంత పెద్ద ఇమ్యూనిటీ బూస్టర్ 
✍️ మీ Naveen Nadiminti,
ఫోన్ 097037 06660 ,
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment