Sunday 17 March 2024

నాలుక_పూత_నాలుక_మీద_పగుళ్ళు_సమస్యకు_నవీన్_నడిమింటి_వైద్య నిలయం సలహాలు* Glossitis

*నాలుక_పూత_నాలుక_మీద_పగుళ్ళు_సమస్యకు_నవీన్_నడిమింటి_వైద్య నిలయం సలహాలు* 
Glossitis

నాలుక (Tongue) పూర్తిగా కండరాలతో చేయబడిన నోటిలోని భాగం. ఇది ఆహారాన్ని నమలడం మరియు మింగడంలో ఉపకరిస్తుంది. దీనివల్లనే మనకు రుచి తెలుస్తుంది. లాలాజలం దీన్ని ఎప్పు డూ తడిగా ఉంచుతుంది. మనం మాట్లాడడానికి కూడా ఇది సహకరిస్తుంది. ఇది నోటి అడుగుభాగంలో క్రింది పల్లు నుండి గొంతు వరకు వ్యాపించింది.

నిర్మాణము

* ఉపకళా కణజాలము: జిహ్వా మొగ్గలు కలిగి ఉండి, రుచిని తెలియజేస్తాయి.
* గ్రంధులు: వీటి స్రావాలు నాలుకను తేమగా ఉంచుతాయి.
* కండరాలు: ముఖ్యంగా చారల కండరాలు. నాలుక చలనంలో తోడ్పడతాయి.వివరాలు కు లింక్స్ లో చూడాలి 
https://m.facebook.com/story.php?story_fbid=2605307669734102&id=1536735689924644

*నాలుక పూత*
* నాలుక పూత ఒకరకమైన శిలీంద్ర సంబంధమైన వ్యాధి. నోరుమంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అది నోటి మాటలకు వర్తిస్తుంది అనుకోండి. కాని నోటిని అపరిశుభ్రంగా ఉంచుకుంటే మాత్రం నోటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నోరు మన మాట వినదు సరికదా. పైగా నోరే మనలోని జబ్బులను బయటపెడుతుంది.

అపుడప్పుడు అందరికీ నోరు పూత వస్తుంటుంది. నోటి పూత కారణంగా నాలుక నోటి లోపలి బుగ్గలు, పెదవులు, ఎర్రగా పూసినట్లు కనిపిస్తుంది. కారం తగిలితే మంట పుడుతుంది. నోటి వెంట లాలాజలం ఊరుతుంది. ఏమి తినాలన్నా నొప్పితో చాలా బాధపడాల్సి ఉంటుంది. నాలిక పైనఅంతా చిన్ని చిన్ని పుండ్లు కూడా వస్తాయి. దీనికి కారణం ముఖ్యంగా నోటి అపరిశుభ్రతే. అంతేకాకుండా ఒక్కోసారి శరీరంలో బికాంప్లెక్ లేమి వలన, వైరస్ వలన, ఫంగస్, బాక్టీరియాల ఇన్‌ఫెక్షన్ కడుపులో పురుగులు, మెటాలిక్ పాయిజినింగ్ దీర్ఘకాలిక అనారోగ్యం, మానసిక ఒత్తిడి, అజీర్ణవ్యాధి, దంతాల వ్యాధులు, ఏదైనా మందులు తీసుకొంటే అవి
వికటించినపుడూ ఇలా నోరు పూస్తుంది. కనుక ఎంతైనా మన నోరును మన జాగ్రత్తగా ఉంచుకోవాలి .

*నాలుక_సమస్యలు_నివారణ_ఆయుర్వేదంలో_నవీన్_సలహాలు*

*చిరునాలుక --లేదా --   కొండనాలుక*
           శిరస్సు లో పుట్టిన కఫం చిరునాలుక  వద్ద చేరి పొడి దగ్గు వస్తుంది. నస ఉంటుంది. 
యోగాసనాలు:--- 
1. శీత్కారి ప్రాణాయామం :-- 
1.పెద్ద నాలుకను పైకి కొండ నాలుక వైపు మడవాలి. పళ్ళు బిగబట్టి గాలి పీల్చి నోరు మూసి ముక్కు ద్వారా వదలాలి .
ఇది కనీసం 12  సార్లు చేస్తే తగ్గి పోతుంది.
2. నాలుకను బాగా పూర్తిగా మూయడం, తెరవడం చెయ్యాలి
3.నోరు పూర్తిగా మూయడం , తెరవడం చెయ్యాలి.
4.  ఒక కప్పు ఆవు పాలలో  పావు చెంచా కలకండ ,పావు చెంచా పసుపు వేసి వీలైనంత వేడిగా తాగాలి. 
5. పాలు, పెరుగు, మజ్జిగ  గేదెవి వాడకూడదు. ఆవు పాలతో మాత్రమే వాడాలి. ఆవు మజ్జిగలో మెంతిపొడి 
పసుపు, ఎర్రగడ్డలు  వేసి మజ్జిగ చారు వాడితే చిరునాలుక తగ్గి పోతుంది. 
6. వేడిగా ఉన్న మిరియాల చారు (ఎక్కువ ఘాటు లేకుండా) తో వేడి వేడి అన్నం తింటే తగ్గుతుంది.
చిన్న పిల్లలు తినలేకపోతే అరటి పండును తీసుకొని దానిలో రంధ్రం చేసి పిల్లలకైతే 3 చిటికెలు , పెద్దలకైతే
6 చిటికెలు మిరియాల పొడి వేసి తినిపించాలి.
7. బొటన వ్రేలును తడుపుకొని మిరియాల పొడి అడ్డుకోవాలి. నోటిని అంగిలివరకు తెరచి కొండనాలుకకు తగిలేటట్లుగా అద్దాలి. మూడు పూటలా చేస్తే ఒకటి ,రెండు రోజులలో తగ్గిపోతుంది.
8.ఒక కప్పు పాలల్లో రెండు గ్రాముల శొంటి, రెండు గ్రాముల పసుపు కలుపుకొని తాగాలి.

నాలుక మీద పగుళ్ళు---టంకన   భస్మం
వేలిగారాన్ని (టంకనం) శుద్ధి చేసి నాలుక మీద పూయాలి. అరగంట తరువాత కడగాలి. మింగినా పరవాలేదు. కాని మింగ వలసిన పరిష్టితి  వస్తే  రెండు గ్రాములు కంటే ఎక్కువగా వాడకూడదు.

నాలుకపై వచ్చే పొక్కులు  
     
అతిగా వేడి చేయ్యడం వలన వస్తుంది.
అతిమధురం చూర్ణం నీళ్ళలో వేసి కాచి  ఆ నీటితో పుక్కిలించాలి.  

*Treatment :*

కారణాన్ని బట్టి చికిత్స చేయవలసి ఉంటుంది.
నోటి శుబ్రత పాటించాలి ... మౌత్ వాస్ తో నోరు పుక్కలించాలి. (Listril Mouth wash, Dresin mouth wash)
నాలుక , నోరు ఇన్‌ఫెక్షన్‌ అయితే ... యాంటిబయోటిక్స్ (oflaxin+ornidazole), యాంటి ఫంగల్ (flucanazole+Candid oral paint)వాడాలి.
పోషకాహార లోపం ఉంటే మంచి విటమిన్లు ఉన్న ఫుడ్ తినాలి , రక్తహీనత ఉంటే ఐరన్‌ +ఫోలిక్  యాసిడ్  వాడాలి.
ఇర్రిటేషన్‌ కలిగించే ఆహారములు అనగా --- కారము మసాలా తో ఉన్న ఆహారపదార్ధములు , ఆల్కహాల్ , పుగాకు (టొబాకొ) ఉత్పత్తులు తినకూడదు .
బి.కాంప్లెక్ష్ మాత్రలు లేదా సిరప్ రెగ్యులర్ గా తీసుకుంటుండాలి.
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment